Posts

శ్రీ సాయి శతకము

Image
శ్రీసాయినాథాయనమః  "బాబాను భగవానునివలె పూజించిన శిరిడీ ప్రజలు పుణ్యాత్ములు. ఏది తినుచున్నను , త్రాగుచున్నను , తమ దొడ్లలోనో పొలములలోనో పనిచేసి కొనుచున్నను , వారెల్లప్పుడు సాయిని జ్ఞప్తియందుంచుకొని సాయిమహిమను కీర్తించుచుండేవారు. సాయితప్ప యింకొక దైవమును వారెరిగియుండలేదు. శిరిడీ స్త్రీల ప్రేమను భక్తిని దాని మాధుర్యమును వర్ణించుటకు మాటలు చాలవు. వారు పామరులయినప్పటికి , వారికున్న స్వల్పభాషాజ్ఞానముతోనే ప్రేమతో బాబాపై పాటలను కూర్చుకొని పాడుకొనుచుండిరి. వారికి అక్షరజ్ఞానము శూన్యమయినప్పటికి వారిపాటలలో నిజమైన కవిత్వము గానవచ్చును. యదార్ధమైన కవిత్వము పాండిత్యము వల్లరాదు. అదియసలైన ప్రేమవలన వెలువడును. "  శ్రీసాయిసచ్చరిత్రము, అధ్యాయము 10 పైనచెప్పబడినట్లు సాయిపట్ల శిరిడీవాసుల యనంతప్రేమలో ఓ లేశమాత్ర ప్రేమ మరియు బాబా యనుగ్రహములే శ్రీసాయిశతక రచనకు ప్రేరణలు.  ఆ సద్గురుమూర్తికి శతకోటి నమస్సుమాంజలులు.   ప్రియమైన పాఠక మహాశయులకో సవినయ విన్నపము:  నాకెలాంటి పాండిత్యములేక , కేవలము సాయిప్రేరణతో  సాగిన శ్రీ సాయిశతకము లోని  రచనా వ్యాకరణ  దోషముల పెద...