శ్రీ సాయి శతకము
శ్రీసాయినాథాయనమః
"బాబాను భగవానునివలె పూజించిన శిరిడీ ప్రజలు పుణ్యాత్ములు. ఏది తినుచున్నను , త్రాగుచున్నను , తమ దొడ్లలోనో పొలములలోనో పనిచేసి కొనుచున్నను , వారెల్లప్పుడు సాయిని జ్ఞప్తియందుంచుకొని సాయిమహిమను కీర్తించుచుండేవారు. సాయితప్ప యింకొక దైవమును వారెరిగియుండలేదు. శిరిడీ స్త్రీల ప్రేమను భక్తిని దాని మాధుర్యమును వర్ణించుటకు మాటలు చాలవు. వారు పామరులయినప్పటికి , వారికున్న స్వల్పభాషాజ్ఞానముతోనే ప్రేమతో బాబాపై పాటలను కూర్చుకొని పాడుకొనుచుండిరి. వారికి అక్షరజ్ఞానము శూన్యమయినప్పటికి వారిపాటలలో నిజమైన కవిత్వము గానవచ్చును. యదార్ధమైన కవిత్వము పాండిత్యము వల్లరాదు. అదియసలైన ప్రేమవలన వెలువడును. " శ్రీసాయిసచ్చరిత్రము, అధ్యాయము 10
పైనచెప్పబడినట్లు సాయిపట్ల శిరిడీవాసుల యనంతప్రేమలో ఓ లేశమాత్ర ప్రేమ మరియు బాబా యనుగ్రహములే శ్రీసాయిశతక రచనకు ప్రేరణలు. ఆ సద్గురుమూర్తికి శతకోటి నమస్సుమాంజలులు.
ప్రియమైన పాఠక మహాశయులకో సవినయ విన్నపము: నాకెలాంటి పాండిత్యములేక , కేవలము సాయిప్రేరణతో సాగిన శ్రీ సాయిశతకము లోని రచనా వ్యాకరణ దోషముల పెద్దమనసుతొ మన్నింప ప్రార్థన.
శ్రీసాయి శతకము
ఆత్మబలముల పొందరె అయ్యలార
ఆత్మపరమది
షిరిడీలొ
అన్నలార
సాయి షిరిడియె సర్వము సాయిరామ
బ్రహ్మ తేజమె సద్గురు బాబ సాయి
విష్ణు రూపమె సద్గురు విభవ సాయి
శంభు ధవళమె సద్గురు షిరిడి సాయి
సాయి షిరిడీయె సర్వము సాయిరామ
వినరె
సాయిలీలల నలువేదమటుల
కనరె
సాయిలీలల పలు గాథ సుధలు
సుఖము
సౌఖ్యము కల్గును సాయి చలువ
సాయి
షిరిడియె సర్వము సాయిరామ
చలువ మజ్జిగ గ్రోలట
సాయిలీల
రచన పంతట సేసెను రమ్యమేను
చెవుల తేనెల సోనల జేయువిందు
పఠన సేయరె లీలల భక్తితోడ
స్వాగతమిది షిరిడిలొ సాయినీకు
అప్రయత్నపు పూజారి యటుల బిలచె
బాబ శివుడట కాలూన పెండ్లివార
సాయి షిరిడియె సర్వము సాయిరామ
పాదమోపగ షిరిడియె పావనంబు
పెండ్లివారితొ రాకయె పరమ విందు
ధాత్రి కల్యాణ మూర్తియె ధరమ సాయి
సాయి షిరిడియె సర్వము సాయిరామ
సాయి సహనము శ్రద్ధయు షిరిడిలోన
హాయి పగలును రేయియు సాయితోడ
సాయె అభయ విభవ విద్య సరిగ జూడ
సాయి షిరిడియె సర్వము సాయిరామ
పాటీలు హయమును పొందెను బాబ చలువ
నీరు నిప్పుల కన్నుల
నచటజూసె
దైవరూపుడు సాయట ధాత్రి కల్గె
సాయి షిరిడియె సర్వము సాయిరామ
అగ్నిజలములు సటకతొ అధ్బుతంబె
పిండి విసరుల రోగము పారిపోయె
దివ్వె వరుసలు జలముతొ వెలుగులిచ్చె
సంతసములకు కూడలి సాయిగూడు
సంతువిభవము
భక్తుల సాయిగూర్చె
సంతు జనులకు సంతుయె సాయిదేవ
సాయి షిరిడియె సర్వము సాయిరామ
సాయి జగమున వెలసెలె సాయమివ్వ
జాలిగుండెతొ సాకెలె చూడజూడ
దయకు దాల్మికి లేరులె దాటియవరు
సాయి షిరిడియె సర్వము సాయిరామ
గీత గలగల బారెలె గంగావోలె
సాయి పెదవుల జీవన సాధనముల
చెప్పిజేసేడు వాడులె సాయిబాబ
సాయి షిరిడియె సర్వము సాయిరామ
రూపు కనకము సద్గురు రీతివేరు
సాగె శునకపు రూపుతొ సమము జూప
తానె యన్నిట నిండెలె తరచిజూడ
సాయి షిరిడియె సర్వము సాయిరామ
పంతు నియమించి లీలల బాబ వ్రాసె
భక్తజనులకు కాదదె పార్థ గీత
గీతమహిమ మార్చె లె
గీత మనల
సాయి షిరిడియె సర్వము సాయిరామ
ఊది మహిమలు కొల్లలు ఓహొ ఓహొ
వ్యాధిబాధలు చెల్లెలె వెంట వెంట
మైనతాయిని గాచెలె మాయబాబ
సాయి షిరిడియె సర్వము సాయిరామ
దాసగణునకు బాలిక దారిజూపె
ఈస
ఉపనిషదుకు భాష్యమటుల గూర్చె
కుశల కార్యము కాదదె
కావ్య బోధ
సాయి షిరిడియె సర్వము సాయిరామ
పాముకథయది కప్పతొ పావనంబు
జన్మ జనమల బంధువె సాయిబాబ
మండు కమునట గాచెలె మృత్యువేళ
సాయి షిరిడియె సర్వము సాయిరామ
స్వప్న మధురిమలెన్నియొ సాయిజూపె
పద్మపదముల
పాఖడె
పాయజూసె
రీతినెరిగెను మదరాసి రామదాసి
సాయి షిరిడియె సర్వము సాయిరామ
కింకరుడె సాయి భక్తుల కార్యముల
ఆర్తి బిలువ సాయము శీఘ్రమేను
సాయి గురువును దైవము సేవకుండు
సాయి షిరిడియె సర్వము సాయిరామ
పాశధరుడన సాయి వశీకరించు
పిచ్చుకలుగ మార్చును పాశమేసి
చేయు విధములు లీలలు చెప్పలేము
సాయి షిరిడియె సర్వము సాయిరామ
వామపాద మది భక్తుల వారధయ్యె
పరమిహంబుల గూర్చెడి పావనంబు
పాదములను బట్టరె బాబసేవ
సాయి షిరిడియె సర్వము సాయిరామ
రండి గురునితొ ఐక్యమె రమ్యకేళి
రెండుపైసలు చాలట రూపు జూడ
శ్రద్ధ సహనము లివ్వరె సాయి జూడ
సాయి షిరిడియె సర్వము సాయిరామ
చూడ వచ్చును చూడుము సాయిదేవ
ఎట్ట యెదుటనె నిల్చును వేల్పుయంత
భక్తిమీరగ నిరతము బాబ సేవ
సాయి షిరిడియె సర్వము సాయిరామ
వింత విషయము కాదది వాస్తవంబు
చెంతజేరులె సాయి జేరదీయు
కొంతసమయము సాయికి కేటయింప
సాయి షిరిడియె సర్వము సాయిరామ
తల్లి తనయుల గాచులె ధాత్రివోలె
ప్రేమకనులతొ కూర్మము ప్రేమసేయు
న్యాయమటులనె సద్గురు నమ్ము శిష్య
సాయి షిరిడియె సర్వము సాయిరామ
సొంతపనులకు నెంతయొ సమయముండు
చింతమిగులును యెంతయు సంపదింప
తాను తొలచిన గుంటలొ తూలినటుల
సాయి షిరిడియె సర్వము సాయిరామ
ఆలు సుతులును మధ్యలొ హాయిగూర్పు
శక్తీ తరిగిన పిమ్మట సాయమేది
సాయి యనగ సాయము సర్వవేళ
సాయి షిరిడియె సర్వము సాయిరామ
పైడి పొలముల పంటల మాయవీడ
మేడ మిద్దెల కోర్కెల మోహమీడ
ముక్తి ఫలములు యుక్తిగ మీవిగావె
సాయి షిరిడియె సర్వము సాయిరామ
చీడ కలుపులు తీయగ చేలు పండు
నీరు యెరువుల తోటియె నాణ్యమౌను
సాయి తలపులె బుద్ధుల శుద్ధిజేయు
సాయి షిరిడియె సర్వము సాయిరామ
పెక్కు మహిమలు జూడరె మజీదు మాయి
చిక్కులన్నియు తొలగును సాయిలీల
రామనవములు ఉరుసులు రేయి పగలు
సాయి షిరిడీయె సర్వము సాయిరామ
అల్ల మాలికు శుభముల యటుల సేయు
సాయి పలుకుచు భక్తుల సేవజేసె
భ్రాంతియేలను యేలిక బాబ నిలువ
సాయి షిరిడీయె సర్వము సాయిరామ
అమ్మ అన్నయు నాన్నయు అన్ని తానె
విన్నపముల సేయరె వెన్నదొంగ
కల్లకపటము లెరుగని గొల్లవాడు
సాయి షిరిడీయె సర్వము సాయిరామ
సాగె పల్లకి సాయితొ
సీమ సీమ
సాయి చూపులతొ పులకలె ధాత్రిపొందె
భాగ్యమదియెను బోయగ సాయిసేవ
సాయి షిరిడీయె సర్వము సాయిరామ
మేఘ శివునిగ బాబ పూజసేసె
శ్యామ యాప్త మిత్రునిగనె బాబాయందు
తాత్య మామగ పిలుచుచు తృప్తిపొందె
సాయి షిరిడీయె సర్వము సాయిరామ
శ్యామకంటెను ముందుగ దాటి గంగ
కాదె పండితసదనము కాలుమోపె
లోకమేలేటి మేటిలే లీల సాయి
సాయి షిరిడీయె సర్వము సాయిరామ
మౌనశిలయది జీవితాంతము మౌని మోసె
ఉలుకు పలుకులులేక యొర్మి జూపె
ధ్యాన మీరీతి భక్తితొ దారి చూపు
సాయి షిరిడీయె సర్వము సాయిరామ
బుద్ధి గలిగిన యంత పథము బాబజూపు
వైద్య బాబను జూడ వేచియుండ
షామ వెడలెనుయట సప్త శ్రీన్గిసేవ
సాయి షిరిడీయె సర్వము సాయిరామ
చోల్కరుని చక్కెర సేవ చోద్యమాయె
పంచదారను మానగ బాబ సేవ
తానె మిగుల చక్కెరల తేనీరు నిచ్చె
సాయి షిరిడీయె సర్వము సాయిరామ
సాయి గరళము మింగిన సాంబు డటుల
చేయికొలిమిలొ కాల్చెలె చూడచూడ
ప్లేగు తనువును దాల్చెలె పాహి పాహి
సాయి షిరిడియె సర్వము సాయిరామ
దక్షిణల భక్తిభావనల దత్తు డందె
రక్షకుడుగ కర్మల తానె రూపుమాపె
ఇవ్వతలువని వారిని ఏలయడుగు
సాయి షిరిడియె సర్వము సాయిరామ
రెండురూకల దక్షిణ రూపుజూడ
శ్రద్ధ సహనమె భక్తుల సాయిపొంది
భిక్షకుడుగనె షిరిడిలో బాబనడచె
సాయి షిరిడియె సర్వము సాయిరామ
వేపనీడయె బాబకు వాసమాయె
చేదువిరచట యమృత ఝరియ సేసె
మట్టిబొమ్మల మోక్షపు మార్గదర్శి
సాయి షిరిడియె సర్వము సాయిరామ
తేనె పలుకుల బాబయె తీపికూర్ప
సర్వజీవుల చేతనమె సాయి సాయి
బాబ రూపము నిలుప మాయతొలగు
సాయి షిరిడియె సర్వము సాయిరామ
పాదుకలవె భక్తుల ముక్తినీయ
ఆది యంతము లేనివి హాయిగూర్చు
వృక్ష నింబపు ఛాయ రక్షసేయ
సాయి షిరిడియె సర్వము సాయిరామ
భక్త భాగోజి కుష్ఠును బాబ మాపె
పిళ్లె పీడను బాబట పారదోలె
పుత్రు పితళుని మూర్ఛకు బాబ యూది
సాయి షిరిడియె సర్వము సాయిరామ
శ్యామ నాముని విరచెను సాయికరుణ
సాయిసాయిని నమ్మగ సాయమేను
సాయి షిరిడియె సర్వము సాయిరామ
షిరిడి వీధుల భిక్షకు సాయివెడలె
మధుకరంబది భక్తుల మేలుసేయ
షిరిడి వాసులె ధన్యులు సాయిసేవ
సాయి షిరిడియె సర్వము సాయిరామ
భక్తి తొమ్మిది దారుల మార్గమేను
నవవిధంబది భక్తియె దానిపొందు
పల్కె పాటంకురినితోటి బాబ యటుల
సాయి షిరిడియె సర్వము సాయిరామ
లక్ష్మిబాయికి తొమ్మిది డబ్బులిచ్చి
భక్తిరీతులు తొమ్మిది బాబ పల్కె
అప్పసాహెబు బాబతో యటుల పొందె
సాయి షిరిడియె సర్వము సాయిరామ
తూర్పు తలనిడు శయనమె తండ్రిసాయి
తాత్య తలగడె పచ్చిమ దిశగ నలరు
మాల్సపతి
యట ఉత్తర మేలి పానుపు
సాయి షిరిడియె సర్వము సాయిరామ
కష్టహారిణి
ధుని యట గాంచరయ్య
పాపకర్మల నేర్పుతొ గాల్చరయ్య
ఆత్మ రూపమె ఊదట యనంతమేను
సాయి షిరిడియె సర్వము సాయిరామ
కింది కల్లుయె తిరుగలి కర్మయనగ
మిది
కల్లుయె తిరుగలి భక్తి యనగ
సాయి విసరెను చిత్రపు జ్ఞాన పిడితొ
సాయి షిరిడియె సర్వము సాయిరామ
సాయి పొలిమేర పిండిని జల్లియటుల
మారి కాలరాను దూరము బోవజేసి
దోష కర్మల యటులనె దవ్వుజేసె
సాయి షిరిడియె సర్వము సాయిరామ
అహము విడువరె నేర్పుతొ
అయ్యలార
అహము తొలగగ సద్గురు పరము నిచ్చు
తనువు మనసును బుద్ధిని నప్పగింప
గురుడు జూపును దారిని
గైడు వోలె
సాయి సాయని పలుకగ శక్తి కలుగు
సాయి సాయిని కొలువగ ఛాయ తొలగు
సాయి సాయిని నిలుపగ
సుఖమె మిగులు
సాయి సాయని తలచుచు సాగిరావొ
సాయి సాయియె కాచెడి సార్వభౌమ
సాయి సాయియె ఈభువి సూర్యతేజ
సాయి సాయియె రక్ష సర్వకాల
సాయి సాయని నిష్టతొ సేవజేయ
సాయినామము కలియుగ సాధనంబు
సాయినామము తలచిన చాలు
చాలు
సాయినామము సద్గతి జూపు జూపు
అన్యవిధమేల తల్పగ అయ్యలార
షిరిడి ఇచటనె విఠలుడు సాయి రూపు
షిరిడి ఇచటనె గంగయె జాలువారె
షిరిడి ఇచటనె జలముతొ జోతులెలిగె
షిరిడి షిరిడిని చేరరె సాయిజుడ
కుస్తీపోటిలొ తానోడ కోర్కెలిగుర
మారె యాతని జీవన భావమూను
జేష్ట దేవియె చూడగ సాయిరాణి
షిరిడి వీధుల శివుడట సాయిబాబ
పీఠమేదియు పట్టక బాబా యచట
తాను తానుగ వెలసిన తల్లిసాయి
మంత్రమేదియు నివ్వక మహిమజూపి
మాయ యవనిక త్రుంచిన మానిషతడు
వేయి వెలుగుల జిలుగుల వేలుపతడు
రాగరంజిత మన్మథ రూపుడతడు
పాపమోహపు నాశన బ్రహ్మ యతడు
తాపజీవుల గాచెడి తీర్థమతడు
రామనవములు చందన సంబరములు
సాయిజరిపెను జంటగ షిరిడి నింట
రాము రహిములు ఒక్కరె రూపువేరు
తల్లిసంద్రము జేరవె నదులు యెన్నొ
హిందువందురు సాయిని హైందవులు
యావనుండిగ జూతురు యంతలోనె
సర్వ మతముల మమతల సారమతడు
సర్వజనులకు జీవన సాధనతడు
రాజయోగియె సాయట రాజరాజు
ఖండయోగిగ తానట గానుపించె
కర్మయోగిగ తానట కష్టమొంది
యోగిరాజుగ నలరెను అవనియందు
ధునిలొ కట్టెలదోయుచు దూర్చి కరము
శిశువులాగెను కొలిమిని సాయిదయతొ
తనదు హితమును మరచిన ధన్యుడతడు
సర్వజీవుల వ్యాపక చేతనతడు
దాతయతడు కర్ణుని దాటు
యతడు
గీతయతడు జీవన గానమతడు
మాతయతడు మల్లెల మూట యతడు
సాయినామపు సాగర సేతువతడు
మురళి లోలుడు మోహన మూర్తి యతడు
సరళ భావుడు సుందర సాయియతడు
సుధలుచిందగ పొంగగ సూక్తులిడుచు
కథలనెన్నియొ కరుణతొ గూర్చునతడు
మనిషి జన్మము దుర్లభ భాగ్యమదియె
అవనిజీవుల కాదదె యద్భుతంబు
మనిషి రూపుతొ సాయిట మనకుగల్గె
మనదు జన్మము ధన్యము మౌనిసేవ
బిచ్చమెత్తెను వీధుల బాబ షిరిడి
కర్మఫలముల భక్తుల కరము బట్టె
శుద్ధి నొందెను తానట సౌచక్రియల
సిద్ధపురుషుడు జీవుల శ్రద్ధయతడు
సాయి యనుమతి గావలె షిరిడి వీడ
తాత్య సరుకును సేయక తానుసాగ
అశ్వశకటము దొరలెను యాత్రలోనె
బాబనమ్మరె మనమున భక్తితోడ
బాబ సాహెబు తార్ఖడు పత్నియచట
పుత్రుతోడను షిరిడీకి యాత్రజేసె
పూజమరువగ తార్ఖడు బాంద్రనింట
సాయీయాకలి
నొందెను షిరిడిలోనె
లీలకాదదె ఫలక విలోలనిదుర
నాల్గుమూలల దివ్వెల నేర్పునిలిపి
భక్తులెల్లర బరువుల మోయుతండ్రి
బాబ శయనము సాగె బరువులేక
పాంచభౌతిక దేహపు బ్రహ్మసాయి
పాంచజన్యము బట్టిన పార్థసఖుడు
పంచభూతము లెల్లను పంచనిలిపి
మందహాసపు మోముతొ బాబయలరు
మూలె బాబలొ గురుని మూర్తిజూసె
ఫాల్కె బాబలొ మాలికు ప్రేమజూసె
మేఘ బాబలొ శంభుని మేనిజూసె
గౌలిబూ వట రంగని కాంతి జూసె
భీమ పాటీలు క్షయకట బాబ కరుణె
బాలగణపతి జ్వరముకు బాబ చలువ
బూటి వాంతులు శాంతమె బాబకృపతొ
రోగ గతులట దూరమె రయము రయము
రతను నాందెడు బిడ్డకై రయము జేర
అయిదు రూకల కానుక యాతనడిగి
ఇరువదణాలు పట్టుచు ఈసు సాయి
తనకు మౌలికి నభేదము తెలియజెప్పె
కాన్కలివ్వరె
సాయికి కలిమి గలుగ
కాన్కలందుచు సాయి కరుణ జూపు
కానివారల కాసుల కాసపడక
కావలన్నల వారల కరుణ జూచు
ప్రాణపంచక మివ్వరె ప్రేమమీర
కర్మపంచక మివ్వరె కేలు మోడ్చి
జ్ఞానపంచక మివ్వరె జాగులేక
బ్రహ్మమార్గము డబ్బుల బాట గాదు
మనసు అహమును బుద్ధియు బాబకొసగి
నవలక్షణముల భక్తుడు నిండవలయు
కలుగు ఆత్మయు తానుగ కోరునంత
క్రతుల కావ్యపు పఠనల కానరాదు
కనుల సద్గురు రూపము కలుగునయ్య
సహనశ్రద్ధల వీడక సేవ సేయ
ఉపవసింపగ నేలను యోర్మిజూపి
గురుని కరుణను పొందరె గురియె సాయి
కనరె ఆర్తులనాథల కరుణతోడ
తెరలు మనమున తొలగగ తేజమేను
మనల కలయిక నిట రుణబంధమేను
హరిహరాదుల సాగెడి హేల హేల
కలుగు పాపము ద్వేషికి కనరె నిచట
సుకర నీతియె చూడిట సాయిమాట
సుమతి వీవుగ మెల్గవె సాయిబాట
పరమునేరుగునె
పండిత మాన్యుడైన
పఠన పఠనల కల్గునె పరమశాంతి
కలిమిలేముల పొంగుచు కాకనింట
గణుకు బాలిక జెప్పెను కావ్యమంత
ముందు ముచ్చట లాడుచు మొక్కులిడుచు
చేరి వెనుకను దెప్పుటే
చోరనీతి
భక్తి నిలుపుము నేస్తమా బాబయందు
సాయిపలుకుల నడచుటె సాధనంబు
తాను పొందిన చాలదు ధరణిలోన
సాటివారికి పంచుము సంపదింత
కర్మఫలముల
కోరక గురునిచేరి
ఉర్వి పొందరె సుఖముల యోర్మిజూపి
ఏకభుక్తము మేలులె యెంచిచూడ
" పాలుతాగకు పరుగుల " బాబ పల్కి
దాము అణ్ణను గాచెను దయతొ సాయి
పత్తి ధాన్యపు పంటల బేరమాపి
భాగవతముల పఠనము భక్తితోడ
విష్ణుసహస్రపు పఠనము వేడ్కమీర
బాబ జరిపెను మాజిదు
మాతయందు
గ్రంథపఠనము సేయరె కృష్ణలీల
పట్టిలాగును భక్తుల పిచ్చుకలుగ
మేఘ కాకజి వైద్యుల పథము గూర్చి
షిర్డి నగరికి జేర్చుట చిత్రమేను
జన్మ ధన్యము గాదె షిరిడి జేర
బాబ మాటతొ శూలపు బొమ్మగీసి
పిండి పొందగ మేఘట బాబనుండి
భక్తి నిలచెను మేఘలొ పరమశివుని
సాయి శివుడును శక్తియు షిరిడిలోన
కాశి యాత్రలొ సద్గురు కాన్కలన్ద
బాబజేరిన మదరాసి భక్తజనుడు
స్వప్నమందున సద్గురు శక్తి గనియె
స్వప్నలీలల సాయివి చెప్పతరమె
ఆత్మ వెదుకుచు నల్వురు నడవిజేరి
మార్గమందున గాంచిరి మార్గదర్శి
సాయ మాతని పొందక సాగివెడలి
దారిగాంచక జేరిరి తొల్లిచోటు
సాయి యంతట వానిసేవలంది
గాంచె గురువునట కాంతులీన
శ్రద్ధ సహనపు కాన్కల సేవజేసి
ముక్తుడాయెను జీవన పుడమి పొంగ
భోగమేలను సుస్థిర మనము లేక
భాగ్యమేలను సద్గురు భక్తిలేక
బాబ థక్కరు మోహము బాయబల్కె
స్పూర్తి
దాతయె సాయిల శంకయేల
శేషపాన్పది
సాయికి చావిడచట
క్షీర సాగర వాసమె షిరిడినేల
భక్తులందరి సంబర బాబ యాత్ర
బాలగోపాల లీలల బృందహేల
పట్టుబట్టల నిచ్చెడి బాబయుండ
దేవు చింపిరిగుడ్డల దొంగిలించె
ఉగ్రుడాయెను సాయట యూహనెరిగి
పోతి పఠనము నేర్పెను
ప్రేమమీర
కర్మ భక్తుల జ్ఞానపు గీత సాయి
గీతభాష్యమె జీవన కావ్యమాయె
గీత శ్లోక భాష్యమె కరుణ బల్క
నాన సాహెబు దర్పమె నాశనంబు
సాయి నలుడట భీముడు పాకమందు
బాబ చేయట గరిటయె భాండమందు
రాజ రాజుతొ తినుటయె రాచవిందు
లేరు లేరులె సాయితొ లీలలందు
కోర్కెలెల్లను దీర్చెడి ఘనుడు సాయి
భక్తులందరి బాధల పొందునోయి
మృత్యువెరిగెను తానట ముందుగానె
దేహమొదలెను తాత్యకై దీనబంధు
పాంచభౌతిక దేహపు బాబ తొలగ
సూక్ష్మదేహపు సాయియె శక్తిమయుడు
మందిరంబున శల్యమె మాటలాడు
చిన్మయుండట సాయియె చింతయేల
సాయి రూపుల చూపుల సెందురుండు
సాయి చీకటి బాపెడి దినకరుండు
సాయి తల్లియు తండ్రియు సాయమందు
సాయి సద్గురు సద్గతి శిరమునిండు
సాయిలీలల పఠనమె సాయమౌను
సాయిలీలల శ్రవణమె శాంతమిడును
సాయిలీలల నడచుట సౌఖ్యమేను
సాయిలీలల గాలుల స్వర్గమేను
సాయిలీలల పదములె సాగిరాగ
సాయిపాదపు రేణును శ్యామనయ్య
సాయి యూహలొ నేనొక సేవకుండ
సాయి దీవెన కాయగ సర్వవేళ!
భక్తి శ్రద్దల శ్రీసాయి శతకము పఠించు వారల సదా కాపాడుటకు , ఆయురారోగ్య సౌభాగ్య, మనఃశాంతుల ప్రసాదించుటకు శ్రీసాయినాథుని హృదయపూర్వకముగా ప్రార్ధిస్తున్నాను. సాయి లీలలు చదవండి, చదివించండి, సాయి కృపకు పాత్రులుకండి!
సమర్థ సద్గురు శ్రీ సాయినాథ్ మహారాజ్ కి జై!
శ్రీసాయి కరుణాకిరణాలు అందరిపై ప్రసరించుగాక!
అందరికి శుభమగుగాక!
ఓంసాయి శ్రీసాయి జయజయ సాయి!
Your feedback greatly helps for improvement of the blog , please write your opinion in the comments section below and share if you like. ( మీ సలహా మిగుల విలువైనది, క్రింది కామెంట్స్ సెక్షన్ లో మీ అభిప్రాయము తెలియపరచగలరు. నచ్చితే తెలిసినవారితో పంచుకోండి.)
For more posts also please visit SaishaktiTelugu.Blogspot.com
ధన్యవాదములు. బ్లాగ్ బావుంది. బాబాగారి గురించి చాలా వివరంగా రాసారు.
ReplyDeletehttps://www.youtube.com/watch?v=yBc0A3hH4hU
ధన్యవాదములు. బ్లాగ్ బావుంది. బాబాగారి గురించి చాలా వివరంగా రాసారు.
ReplyDeleteనేను 2010 మే నెలలో ఫస్ట్ టైం షిర్డీ వెళ్ళినప్పుడు బాబా కనిపించారు. దర్శనం తర్వాత మధ్యాహ్నం 3 గంటలు అయ్యింది. ఆంధ్ర హోటల్ కి వెళ్ళాను ఫుడ్ అయిపొయింది. మండుటెండ. ఏం చెయ్యాలో తెలియడం లేదు. ట్రైన్ టైం కూడా దగ్గర పడింది. హోటల్స్ కోసం వెతుకుతున్నా. అంతలో అచ్చంగా బాబా డ్రెస్ లో ఒక మధ్య వయ్యసాయన కనపడి మరాఠీలో చెప్పాడు. సాయి బాబా ప్రసాదం వుంది 10 రూపాయలే చెపాతీలు , కొద్దిగా అన్నం, సాంబారు పెడతారు వెళ్లి తినండి అన్నాడు. కొద్దిగా అర్థం అయ్యింది. రండి చూపిస్తా అని తీసుకుని వెళ్లి చూపించాడు. ఆ మండుటెండలో నేను, నా ఫ్రెండ్స్ కష్టబడి నడుస్తుండే, అసలు చెప్పులే లేకుండా అతను చక చకా నడుచుకుంటూ వచ్చాడు. ప్రసాదాలయం దగ్గరకు వెళ్ళాక, "అక్కడే కౌంటర్ ఉంటుంది. 10 రూపాయలు ఇచ్చి టోకెన్ తీసుకోండి అని దారి చూపించాడు. థాంక్స్ చెబుతామని వెన్నక్కి చూస్తే అక్కడ ఎక్కాడా ఆయన లేరు. రోమాలు నిక్కబొడుచుకున్నాయి. అర్థం అయ్యింది ఆయన ఎవరో కాదు బాబానే అని. ఈ అనుభవం నేను ఎప్పటికీ మర్చిపోలేను
=రవికుమార్ పెదిరెడ్ల
Original Photos of Saibaba
https://www.youtube.com/watch?v=yBc0A3hH4hU
బ్లాగ్ నచ్చినందులకు మీకు ధన్యవాదములు, షిర్డీలో మీకు కలిగిన అనుభవం బాబా నిత్యసత్యులని మరోసారి ఋజువు చేస్తుంది, అనుభవం పొందిన మీరు అదృష్టవంతులు!
Delete