Posts

శ్రీసాయి సచ్చరిత్ర సంషిప్త గానామృతము -6 (మూలము: శ్రీసాయి సచ్చరిత్రము.)

Image
శ్రీగణేశాయనమః , శ్రీసరస్వత్తైనమః , సమర్ధసద్గురు   శ్రీసాయినాథాయనమః . ముందుమాట! శ్రీసాయిలీలలను  గానరూపంలో పాడుకో దలచువారికొరకు ఈ  శ్రీ సాయిలీలలు  గేయ రూపంలో  వ్రాయడమైనది. సమయాభావముచే శ్రీసాయిచరిత్ర పూర్తిగా చదువుటకువీలుకానిచో , ఈ రచన చదువుటచే అధ్యాయ సారమును గ్రహింపవచ్చును. అధ్యాయముల  భావసందేశముల బట్టి వాటి వాటి నిడివి మారినది. మొట్టమొదటిగా   చరిత్ర పారాయణజేయువారు  శ్రీసాయిసచ్చరిత్ర మూలగ్రంథ మును ఒక పర్యాయము  పారాయణ జేసి   ఆపై ఈ గేయామృతము చదివిన విషయ గ్రహణము  సులభము కాగలదు. సప్తాహ పారాయణకు వీలుగ,మూలగ్రంధమువలె ఏడు భాగములుగ విభజించడమైనది.  శ్రీసాయి కరుణా కటాక్షములు పాఠక భక్తులకు పరిపూర్ణముగా లభించుటకు  మనఃస్ఫూర్తిగా  ప్రార్ధిస్తున్నాను.  ఆరవభాగము   ( అధ్యాయములు 38-44) ముప్పదియెనిమిదవ అధ్యాయము పోతపోసిన బ్రహ్మతత్వమె సాయి శరణు వారల శీఘ్ర రక్షణయె సాయి నరునివేషపు నారాయణుడె సాయి మరులగొలుపు మురళి ధరుడుయే సాయి ! అన్నిదానముల అగ్రదానము అన్నదానమె అత...