Posts

దయా సాగర సాయి

Image
శ్రీసాయినాథాయనమః  దయా  సాగర  సాయి సాగరసాయి  నీ తీరంలో నేనొక సైకత రేణువునయ్యా  పొంగుచు పొరలుచు ఓ కెరటంలా  .. నీవే నాలో నిండుము సాయి సాగర సాయి , దయా సాగర సాయి ... మేరువు నీవుగ,  రాముడ వీవుగ    పాదపు   ధూళిగ     మారితి నయ్యా పండరి వాసుడ,   రంగడ వీవుగ    ఆర్తితొ   సక్కుగ   వేడితి    నయ్యా పొంగుచు పొరలుచు ఓ కెరటంలా  ..  నీవే నాలో నిండుము సాయి సాగర సాయి , దయా సాగర సాయి ...  రాగము నింపెడు శ్యాముడ వీవని నీదరి మురళిగ ఒదిగితినయ్యా అను , రాగము   నింపెడు   స్వామియె నీవని విరహపు రాధగ   సొలసితి నయ్యా పొంగుచు పొరలుచు ఓ కెరటంలా    నీవే నాలో నిండుము సాయి   సాగర సాయి , దయా సాగర సాయి ... ప్రేరణ  :  షిర్డి   అభిషేకవేళ   29-11-1996 శ్రీసాయి కరుణాకిరణాలు అందరిపై ప్రసరించుగాక! అందరికి శుభమగుగాక! ఓంసాయి శ్రీసాయి జయజయ సాయి!

సాయివైద్యా నీకు వందనం!

Image
శ్రీసాయినాథాయనమః  వైద్యునికి రోగినాడి తెలుసు గావున వేరు వేరు రోగులకు వేరు వేరు మందులు వారి అవసరాలను బట్టి వాడమని చెబుతారు. ఈవిషయంలో రోగి డాక్టరు సలహా పాటించటం తన  శ్రేయస్సుకొరకేగదా! అలాగే సద్గురువులకు తమ భక్తులకేది  మేలో, ఏది కీడో బాగుగ తెలుసు. కొందరికి  ఆరోగ్యమవసరం, కొందరికి మానసిక ప్రశాంతత అవసరం,కొందరికి డబ్బు అవసరం, మరికొందరికి విద్య, ఉద్యోగాలు అవసరం. మరికొందరికేమో ఆధ్యాత్మికస్థితిలో ప్రగతి, సహాయం అవసరం. అందరికి ఒక్క అవసరముండదు, ఉపయోగపడదుకూడా . శ్రీ సాయి, సమర్థ సద్గురులు గాన ఆయనకు వేరు వేరు భక్తులకు ఏమి అవసరమో, ఎంతఅవసరమో బాగుగా తెలియును. ఒక్కోసారి మనంకోరుకునే కోరికలు మనకు మంచిని చేయవచ్చు, చెడునూ కలుగజేయవచ్చు.  బాబాను సేవించిన వివిధ భక్తులను వేరువేరువిధముల అనుగ్రహించారు. దాసగణుకు కీర్తనసేవ, భాగోజీ షిండేకి తమ పాదసేవ, శ్యామాకు, తాత్యాకోతేపాటీలుకు తమ అవసరాలదీర్చే సేవ ఇలా వేరు వేరు విధముల దీవించారు. కొందరిని కోటీశ్వరుల జేశారు. కాని పేదరికంలో ఉన్న  భక్త మహాల్సాపతికి  ఎలాంటి ధనసహాయం చేయలేదు.హంసరాజు అనే భక్తుడు ఇవ్వదలచిన ధనసహాయమును తిరస్కరింప...

సాయినామశక్తి(The divine power of Sai's name.)

Image
శ్రీసాయినాథాయనమః  శ్రీరామచంద్రులు కేవలము అయోధ్య వాసుల రక్షిస్తే,శ్రీరామనామము ముల్లోకాలను తరింపజేస్తుందట. అలాగే సాయిబాబా తమ భౌతిక రూపంలో ఉన్నపుడు వారి మహిమ షిరిడీ, ముంబయి , పూనా ప్రాంతాలవరకు మాత్రమే ముఖ్యంగా వ్యాపిస్తే,  బాబా మహాసమాధి అనంతరము సాయి నామ, సాయి రూప, సాయి భావ  శక్తి విశ్వమంతా వ్యాపించినది. మన జీవననావకు సాయి శక్తిని ఇంధనంగా,  సాయిని నావికునిగా మలచుకొందాము, ఒడిదుడుకుల జీవనవాహినిలొ పరమశాంతి పొందుదాము. సాయి  నామముతోడ నావసాగేనండి సాయి  నామముతోడ నావసాగేనండి కాసింత చోటుంది వచ్చి కూర్చోరండి భావ లహరులలోన వాహ్వళి  కెళదాము సాయిలీలలలోన తేలియాడెదము సాయిఓం, సాయిఓం, సాయిఓం !సాయిరాం, సాయిరాం, సాయిరాం!     ||సాయినామముతోడ|| నావికుడు సాయండి,చుక్కాని సాయండి సాయిభక్తితోడ మలచబడినాదండి అటునిటు వెడలదు  గురిదప్పి మరలదు గమ్యమొచ్చేదాక రమ్యముగ సాగేను సాయిఓం, సాయిఓం, సాయిఓం! సాయిరాం, సాయిరాం, సాయిరాం!     ||సాయినామముతోడ|| సుడులకూ  లొంగదు  తూఫాను చిక్కదు మార్గమధ్యమున మరిఎచట నాగదు దొంగలకు దొరకదు ...

శరణమయా సాయిశా !

Image
శ్రీసాయినాథాయనమః శ రణమయా   సాయీశా ! శ రణమయా   సాయీశా    శరణమయా శరణమయా సాయీశా   శరణమయా చేతనమీవె ... విశ్వచేతన మీవే మాతవు నీవె ... జగన్మాతవు నీవే సాక్షివి నీవె ... సర్వ సాక్షివి నీవే శిక్షకు డీవె ... మాకు రక్షకుడీవే                               || శరణమయా || కర్తవు నీవె ... సృష్టి కర్తవు నీవే కారణమీవె ... జగత్కారణమీవే రాజువు నీవె ... రాజరాజువు   నీవే గురుడవు నీవె ... పరమ గురుడవు నీవే                  || శరణమయా  ||        ఆత్మవునీవె  ...   అంతరాత్మవు   నీవే బ్రహ్మవు   నీవె  ...   పరబ్రహ్మవు   నీవే జోతివి   నీవె  ...   పరంజోతివి   నీవే శక్తివి    నీవె ...   పరాశక్తివి   నీవే                 ...

సాయినాథా నీకు నా నమస్కారము! (తుభ్యం నమామి సాయినాథాయ!)

Image
శ్రీసాయినాథాయనమః  సాయినాథా నీకు నా నమస్కారము! నీవే నారాయణుడవు, నీవే జగదీశ్వరుడవు, నీవే అనంతదేవ స్వరూపుడవు!     తుభ్యం నమామి సాయినాథాయ తుభ్యం నమామి సాయినాథాయ      తుభ్యం నమామి నారాయణాయ హేదీనబంధో తుభ్యం నమామి తుభ్యం నమామి జగదీశ్వరాయ తుభ్యం నమామి సాయినాథాయ తుభ్యం నమామి సాయినాథాయ తుభ్యం నమామి మధుసూదనాయ హేభాక్తప్రాణం  తుభ్యం నమామి తుభ్యం నమామి వాసుదేవాయ తుభ్యం నమామి సాయినాథాయ తుభ్యం నమామి సాయినాథాయ తుభ్యం నమామి కాలాతి తాయ హేముక్తిదాతా తుభ్యం నమామి  తుభ్యం నమామి అవధూతాయ తుభ్యం నమామి సాయినాథాయ తుభ్యం నమామి సాయినాథాయ తుభ్యం నమామి అనంతాయా హేకృపాసాగర్ తుభ్యం నమామి తుభ్యం నమామి జోగిరాజాయ తుభ్యం నమామి సాయినాథాయ తుభ్యం నమామి సాయినాథాయ తుభ్యం నమామి సచ్చిదానందాయ హేదయసింధూ తుభ్యం నమామి తుభ్యం నమామి జగన్నథాయ తుభ్యం నమామి సాయినాథాయ తుభ్యం నమామి సాయినాథాయ తుభ్యం నమామి దత్తాత్రేయాయ హేకల్పవృక్షం తుభ్యంనమామి తుభ్యం నమామి పరమేశ్వరాయ తుభ్యం నమామి సాయినాథాయ తుభ్యం నమామి సాయినాథాయ తుభ్యం నమామి సిద్ధిదాతాయ హే శాంతాకారం తుభ...

ఈశ్వర రూప సాయి

Image
శ్రీసాయినాథాయనమః  ఈశ్వర రూప సాయి ఈశుని ప్రతిరూపం   సాయీశుని అవతారం షిరిడియే కైలాసం   గౌరీశుని ఆవాసం గంగను వలచి     శిరమున నిలిపెను భళి   భళి   శంకరుడు   భక్త శుభంకరుడు   గంగను పాదము   పొంగగ జూపెను అరెరే సాయిసుడు   అవనిలొ   పావనుడు                   || ఈశుని ప్రతిరూపం ||  ముల్లోకంబుల భిక్షను పట్టెను భళి భళి శంకరుడు   భక్తుల పాలకుడు షిరిడీ వీధుల  భక్ష్యము     లందెను అరెరే సాయిసుడు   కర్మల నాశకుడు                          || ఈశుని ప్రతిరూపం ||   లలాట ఫలక   విభూతి రేఖల భళి భళి ధవళేసుడు   ధవళాచల మందిరుడు ధుని వెలిగించి విభూతి పంచెను అరెరే సాయిసుడు   భవభయ నాశకుడు                     || ఈశుని ప్రతిరూపం ||  యోగముద్రలో మనసు ...

సంక్షిప్త శ్రీగురుచరిత్ర

Image
శ్రీదత్తాత్రేయాయనమః శ్రీసాయినాథాయనమః  శ్రీసాయిలీలల పఠించు  భక్తులెల్లరకు, వారి కుటుంబసభ్యులకు, మిత్రులు, శ్రేయోభిలాషులకు విజయదశమి శుభాకాంక్షలు. వారలందరిని   నిత్యసత్య సమర్ధసద్గురు శ్రీసాయినాథులు, శ్రీగురు దత్తస్వామి, ఆదిపరాశక్తి శ్రీజగన్మాత  ఆయురారోగ్య సౌభాగ్యములతొ సుఖశాంతులతొ సదా రక్షించుటకు హృదయపూర్వకంగా, సవినయముగా ప్రార్ధిస్తున్నాను.    సృష్టికర్తయైన భగవంతుడు తానుసృష్టించిన జగతిని ధర్మమార్గంలో నడుపుటకు తానే గురు రూపం దాల్చాడు. ఆగురురూపమే శ్రీదత్తాత్రేయుడు. శ్రీదత్తాత్రేయుడు కలియుగంలో ఇప్పటి వరకు  శ్రీపాద శ్రీవల్లభులుగ , శ్రీనృసింహ సరస్వతిగ , శ్రీమాణిక్యప్రభుగ ,శ్రీ అక్కల్కోట మహారాజుగ, శ్రీ షిరిడీసాయిబాబాగ  భారతావనిలో అవతరించారు. అన్నిదేశాలలోను, అన్నికాలాలలోను అవతరించిన మహనీయులందరు శ్రీగురురూపులుగా చెప్పబడుతుంది. శ్రీగురుచరిత్రలో   మొదటి రెండు అవతారములైన శ్రీపాదశ్రీవల్లభ, శ్రీనృసింహసరస్వతుల వారి  అవతారవిశేషాలు, మహిమలు చెప్పబడినవి. వీరు క్రీస్తుశకం 14,15 శతాబ్దములలొ అవతరించారు.  శ్రీసాయిబాబా లీలలకు, వ...