శ్రీ సాయి మహిమ
(శ్రీ సాయినారాయణ బాబా, సాయిఅనుగ్రహము పొందిన మహాపురుషులు. ముంబయికి సమీపంలో పాన్వెల్ లో బాబాదేవాలయం నిర్మించి ఎందరో భక్తులను సాయిమార్గంలో నడిపిస్తున్నారు. వారు సుప్రసిద్ధ శ్రీసాయిమహిమాస్తోత్రమును హిందీభాషలొ రచించారు. పెక్కు నారాయణబాబా భక్తులు ఈ మహిమాన్విత స్తోత్రాన్ని 12 గంటల పారాయణ జేసి పెక్కుఅనుభూతుల పొందుచున్నారు. నేనుకూడ పెక్కుసారులు ఈ పారాయణా కార్యక్రమములొ పాల్గొన్నాను. తెలుగు పాఠకుల కుపయుక్తముగ నుండుటకై శ్రీసాయిమహిమను బాబా అనుగ్రహ, ప్రేరణలచే తెలుగులోనికి అనువదించడమైనది. పాఠకులు శ్రద్ధతో పఠించి బాబా కృపను పొందుటకై మనఃస్ఫూర్తిగా ప్రార్ధిస్తున్నాను.)
శ్రీ సాయి మహిమ
దోహా
ఆది ఆధారము తెలియక సాయి నాథుని
అధినాథు
డంటున్నది పాతాళము
నాథు
నాథు డంటున్నది
జగన్నాథుడంటున్నది
భూలోకము
అంతము,నీ అంతము నెరుగక
అనంతనాథు
డంటున్నది స్వర్గము
అలాంటి
పరమశక్తికి ప్రణతులిడు తున్నారు
బ్రహ్మ,విష్ణు,మహేశ్వరులు
నాథునాథులందరికి
ఎకనాథుడంటున్నారు
నవనాథులు
ఆ ఎకనాథునంటున్నది ఈలోకము
జై జై సాయీనాథ్ !
శ్రీ
సచ్చిదానందసద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై!
మహిమ
1 శ్రీసాయీ బాబా రావో
బాబా నీవే
దాత మాకు విధాతా
నీవే ఈశుడ ఈసాయులకు అటులిటు
నామము అయితివి సాయి
హిందువులకు రాముడ వీవే సాయీరామని జగమంటున్నది
మజీదునందు అల్లా నీవే నానకు నీవే గురుద్వారమున
మహిమల బాబ జగతిలొ
వెలసెను లీలలు
యాతని కెవరికి తెలియును
2 తెలియదు నెవరికి నీ బాల్యములె
పదునారేండ్ల ప్రాయము వరకు
జగదోద్ధారణ చేయుటకొరకే వెలసితివీవు
షిరిడీ నేలపై
ద త్తునియటుల జేసిరి నిన్ను కబీరు,గోపాల,జావర గురువులు
లాలన పాలన కృష్ణుని
యటుల సత్యదీక్షను పూర్తిగ నిడిరి
దీక్షను,శిక్షను పూర్తిగ పొంది సాయీబాబా,
బాబా యాయెను
సాయీ ,శ్రీరాముండే
సాయీ , జీసస్ దైవంబే
సాయీ , అల్లా,అల్లా అల్లా సాయీ
,నానక్ ,నానక్ నానక్
సాయట జగతిలొ వ్యాపించెనులే మహిమలబాబా
జగతిలొ వెలసెను
లీలలు యాతని కెవరికి
తెలియును.
3 వేపమూలమే నీదు ఆశ్రమము
లెండీవనమే నీదు
ఉద్యానము
చిరుగుల
అంగియె నీదు వస్త్రము శిరమునకాయెను
చిరుతలపాగ
సటక కమండలములు చేతుల యలరె రూపము
మీది అతిమనోహరము
మధుర
వాక్కులు మురళీధరునివి కన్నులు మీవి ప్రేమతొ నిండెను
హృదయము
మీది దయతో పొంగెను గండశిలయే
సింహాసనము
ఇటు కటులాయెను తలగడ మీకు మహిమల
బాబా జగతిలొ వెలసెను
లీలలు
యాతని కెవరికి తెలియును.
4 చాందు భాయి పాటీలు
వచ్చెను బాలునిబాబా
సాయీ చెంతకు
తప్పిన
గుఱ్ఱమునిచ్చెను సాయి నీరూ నిప్పుల చిలుము
గాల్చెను
మల్సాపతిని
జ్ఞానిగ జేసి గీతోపదేశము నానాకొసగెను
బాయిజబాయి నుద్ధరణ
బొందెను నీకిడి భోజనము నిత్యము , నిత్యము
దాసుల
దాసుడు దాసగనుండు నిన్ను స్తుతించిన కీర్తనకారుడు
అబ్దుల్లా
బహు సేవ జేసెను తనువును
మనమును మీకర్పించెను
మహిమల
బాబా జగతిలొ వెలసెను లీలలు యాతని కెవరికి
తెలియును.
5 వేపచేదును తీయగజేసి సిద్ధిని
మొదటనె చూపిరిగా
నూనెను
పొందక జలములతోనే ఉత్తమ దీవెల వెలిగించిరిగా
వేప ఆకులను ధుని విభూతిని ఎల్లర
కెప్పుడు పంచిరిమీరు
అద్భుతశక్తి
వాటి కంతటిది దుఃఖమంతటను పారద్రోలెలే
ఐదు గృహంబుల భిక్ష గ్రహించి అందరికట
పంచితిరీ
వింతగ
అచట పంచితిరీ శేషము ఎపుడు మిగులు
చుండెలే
దీనులు
ఆర్తులు మీ సహచర్యులు గుడ్డీ
కుంటి ,శూద్రులు రోగులు
వారికీ
మీరె ప్రియమిత్రులులే తల్లీ తండ్రి గురుపరమాత్మలే
మహిమల
బాబా జగతిలొ వెలసెను లీలలు యాతని కెవరికి
తెలియును
6 కుష్టురోగి భాగోజి షిండే అరుదెంచెను
సాయీచెంతకు
జీవన
మంతయు సేవగ్రహించి ఆతని రోగము హరియించిరిగా
అమ్లపిత్త
రోగము తోడను బహుపీడితులు బూటీయే
ధునివిభూతితొ స్వాస్థత
కూడెను బూటీ రోగ ముక్తుడాయెను
అతిసార
పీడితుడు కాక మహాజని చెంతకు
రాగ
స్వాస్థత
గూర్చిరి మీరచట వేరుశనగ పప్పులతోటి
బహుపీడితుడు
శ్యామా యచట బవాసీరు రోగముచే
దయాసాగరులు
సాయిదేవులు వ్యాధిని అంతను హరి యించిరిలే
పదునాలుగేండ్ల అజీర్ణ
వ్యాధితొ దత్తోపంతు పీడితుడే
హార్థా
వాసి దుఃఖమునటగని ఆతని దుఃఖ ముక్తుని
జేసిరి
భీమాజిపాటిలు
మహానుభావులు నారాయణగ్రామపు
క్షయరోగి
ఆ భయానక రోగమునుండి దూరముజేసిరి
జగదీశ్వర సాయి
మహిమల
బాబా జగతిలొ వెలసెను లీలలు యాతని కెవరికి తెలియును
7 ఆజానుబాహుగ అవతరించిరి జగతికి ఆశిసు అందించుటకు
ముల్లోకములు
ఆశిసు పొందెను ఆజానుబాహులు సాయిదేవుల
విశ్వమంతటిని
రక్షించుటకు రేయింబగలు జాగృతులే
తమనిదురను,సుఖమును త్యాగముజేయుచు
సేవను
మిగుల జేయుచుండిరి షిరిడీ క్షేత్రమునుండే బాబ
జగతికి
యెంతో సేవ సల్పిరి ఆతనిమించిన త్యాగధనులు
సృష్టిలొ
ఎవరు జని యింపరుగ ద్వారకామాయి మజీదుమా
గురుకులమంటి
జ్ఞానాశ్రమము జ్ఞానుల కలయిక
కూటమియే
సతతము
సాయీశునిచెంత దేశ విదేశముల వచ్చెడి
వారు
జ్ఞానము
భక్తిని పొందిరిగా పూర్ణజ్ఞానులు
సాయిదేవులు
ఎల్లర
కంతయు నిత్తురులే భగవద్గీతకు వివరణ నిచ్చిరి
డీపిటి
కలెక్టర్ నానాకు విష్ణుసహస్ర నామము నేర్చిరి
కాకాసాహెబు
దీక్షితులు నాథభాగవత పఠనము సేసిరి
సాయిసులతొ
హేమాడ్ పంత్ దీక్షిత్,జోగ్,బీవీ దేవులు
జ్ఞానేశ్వరి
జ్ఞానము పొందిరి గురుచరిత్ర చేయించిరి పఠనము
సాయినాథులు
సాఠేతో ఉపనిషత్తుల అర్థము చెప్పిరి
తమప్రేమికులకు
బాబాయే ఖురాను శాస్త్రపు అర్థమునెరిగెను
సాయిసునుండి
అబ్దుల్లా సాయీ ప్రియులు మౌలవి
ఫాతిహా
పఠనము చేసిరి మహిమల బాబ జగతిలొ వెలసెను
లీలలు
యాతని కెవరికి తెలియును.
8 గంట వేలాడెనులే
మజీదునందున మజీదు
మందిరము లేకమాయెలె
నమాజ్
పూజలు ఏకమాయెలే ముస్లిం హిందూ లేకమాయిరి
ఇదియే
అగ్ని పారశీయుల ద్వారకామాయే గురుద్వారము
అటులనె
బాబా సాయి పలుకుచు విభిన్నజాతుల
నేకము జేసిరి
మహిమల
బాబ జగతిలొ వెలసెను లీలలు యాతని కెవరికి
తెలియును
9 విశ్వ రూప దర్శనమిడిరి తమభక్తులకు సాయిదేవులు
పూర్ణఖండోబా
సాయినాథులు అంటున్నాడు మా ల్సాపతి
రామదాసీయులు
గాంచిరి యచట షిరిడీసునిలో శ్రీరాముని
పండరినాథుల దర్శనమిడిరి
దాసగణు మహారాజునకు
సృష్టి పాలకుల
విష్ణుని గాంచిరి న్యాయాధీశులు రేగే వారు
కైలాసపతి శివుని
జూసెను బాబాయందు మేఘా యచట
దశావతారముల దరశనమాయెను
ద్వారకామాయి మజీదు నందున
దర్శన మటుల నాథుల
గాంచి నాథుల విశ్వము, విశ్వసించెను
సాయి నాథుల సమ్మతించెను
మహిమల బాబ జగతిలొ వెలసెను
లీలలు యాతని
కెవరికి తెలియును.
10 అల్ప ఆయుషు ప్రాయమునందునె స్వేచ్ఛా మరణము బాబా పొందిరి
ఆదిశంకరుల యటులనె
బాబా తమదేహంబును త్యజించిరిగ
ధైర్య విశ్వాస
ప్రేమలతో ఆతని యందరు రక్షించిరిగ
సరిగా మూడు దినముల
పిమ్మట జాగృతులాయిరి సాయినాథులు
జాగృతిపొంది
జాగృతి పరచిరి ప్రతిమానవుని తమ వైపునకు
మహిమల బాబ జగతిలొ
వెలసెను లీలలు యాతని కెవరికి తెలియును
11 మల్సాపతి తాత్యాపాటిలు అతిసన్నిహిత ప్రియభక్తులే
నిదుర మెలకువ
నిత్యకృత్యముల మీ సాన్నిధ్యము నిత్యముంటిరి
లక్ష్మీబాయి మహాలక్ష్మి నిత్యసేవలో నుండెడిది
రూకలు తొమ్మిది
యామెకునిచ్చి పూర్ణభక్తిని యామెకు జూపిరి
విషపీడితుడు
శ్యామా వచ్చెను భయముతొ సాయీ బాబా చెంతకు
దూరముజేసిరి
విషము వెంటనే బోళా శంకర సాయీశ్వరులు
ప్రాణ రక్షణే
మండూకమునకు తనదు శత్రు ముఖమునుండి
అది యటు లాయెలె
బాబా ఆజ్ఞగ దాటగ వశమే వారిమాటల
మహిమల బాబా జగతిలో
వెలసెను లీలలు యాతని కెవరికి తెలియును
12 హెచ్ ఎస్ దీక్షిత్ ,ఎం బి రేగే విద్యావంతులు జ్ఞానులు చూడ
లేశము పొందక
దేశ విదేశముల బాబాచెంతకు వచ్చిరిలే
గజబల బాబాశక్తిని
గాంచి తమ్ముల తామే అర్పించిరిగా
మహారోగిగా తానరుదెంచెను
కాశీనాథ్ ఉపాసనీ
బాబా రోగ ముక్తుల
జేయ ఉపాసనీ మహరాజుగ మారేలె
బాబాప్రేమి భీతుడాయెను
హాజీ షిరిడీ చేరినంతనే
దీనదయాళు సాయినాథులు
దూరము జేసిరి హాజీ నంతట
మహిమల బాబా జగతిలొ
వెలసెను లీలలు యాతని కెవరికి తెలియును
13 నాగపూరు అతిధనవంతులు గోపాలరావు బూటివారు
కృష్ణ మురళీధర
కోవెలగ బూటివాడను నిర్మించిరిగ
"నిదురించెడి
నామందిరమదియె " బాబా యటులనె పల్కెడి వారలె
బాబా వాక్కులు
దేవుని మాటలు అటులనె జరుగును నిరతము,సతతము
పందొమ్మిదివందల
పదునెనిమిది దసరా దశమి శుభతిథి యందున
మంగళవార దివసమందున
ఎనుబదిరెండు వత్సర ప్రాయమున
మధ్యాహ్నపు రెండున్నర
గంటలకు షిరిడీ మా మజీదునందున
బాబా శాశ్విత
నిదురను పొందిరి లోకరక్షణకె నిదురను పొందిరి
కానీ బాబా సర్వవ్యాపకులు
ప్రతిక్షణంబులొ జాగృతులు
మజీదులోనే వ్యాపకులు
బాబా అంతట వ్యాపకులు
అందరి యెదలో
వ్యాపకులు మహిమల బాబా జగతిలొ వెలసెను
లీలలు యాతని
కెవరికి తెలియును.
14 సర్వ వ్యాపకులు,సర్వ జాగృతులు సాయి సతతము జాగృతులే
అందరు గాంచిరి
విశ్వమంతటా బాబా నిత్య జాగృతులే
సాయిబాబ సత్య
ఆత్ములు పూర్ణ ఆత్ములు,పరమాత్ములు
ఆ సాయినాథుల
దేహము కొరకై భేదభావములు పెల్లుబికినవి
"బాబా హిందువు"
హైన్దవులనిరి "గొప్పపీరు" ముస్లిము
లనిరి
నిర్ణయమేది జరుగకుండెను
బాదేహము హిందువులందిరి
బాబా బహు చింతితులే
భగవంతునిలా దుఃఖితులే
మహిమల బాబ జగతిలొ
వెలసెను లీలలు యాతని కెవరి తెలియును.
15 హిందూ,ముస్లిం,సిఖ్,క్రైస్తవులు అద్భుత సమాధిమందిర నిర్మాణము సేసిరి
బాబ సమాధికి
భేదము తెలియదు జాతిప్రాంతముల,నిమ్నోన్నతముల
శ్యామసుందర,నీప్రియ
అశ్వము మిగులమిమ్ముల ప్రేమించెడిది
శ్రద్ధా,భక్తి
ప్రేమలతో మీకు ప్రణతులిడు చుండెడిదీ
షిరిడీ వాసులు
గాంచిరి మిమ్ము సమాధి చెందిన పిమ్మట గూడ
అశ్రుధారల గురిపించుచు
సమాధికి ప్రణతులిడిరి కదా
బాబా వాక్కులు
సత్యవాక్కులు "సమాధినుండే నేను జాగృతుడ"
సాయే సాక్షులు
యిందులకు విశాల తమ మూర్తి రూపుతొ
అలాంటి శిల్పము
తాలిము జేసిరి ముంబయి నగరపు పుణ్య శిల్పియే
విగ్రహస్థాపన
జరిగెను పందొమ్మిదివందల యేబది నాలుగున
అహమదుబాదు బాబాప్రియులు
సాయిచరణానందుల చేతుల
బాబ జాగృతులు
జడ చేతనంబుల వారిని పొందిన జన్మలె ధన్యము
బాబను మించిన
భాగ్యము లేదుగ సాయిలేనిచొ శూన్యమె మనకు
సాయిసేవకులు
గురునారాయణ విరచితము అనంత మహిమల యీ అణుమహిమ
సాయికృపతొ తెలుగున
వ్రాసితి; శ్యామసుందరుడ,సాయిదాసుడను
నిత్యనిరంతర
మెవరు పఠింతురొ సర్వము పొందెదరు సాయికృపతొ
సాయికృపతో,సాయికృపతో
సర్వము పొందెదరు సాయికృపతొ
సాయికృపతో,సాయికృపతో ||5||
సర్వము పొందెదరు
సాయికృపతో ||2||
శ్రీసత్చిదానంద
సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై!
శ్రీసత్చిదానంద
సద్గురు సాయికరుణానంద్ మహారాజ్ కి జై!
శ్రీసత్చిదానంద
జగద్గురు బాలయోగి రాజ్ సాయినారాయణ మహారాజ్
కి జై!
శ్రీసాయి కరుణా కిరణాలు అందరిపై ప్రసరించుగాక!
అందరికి శుభమగుగాక!!
ఓంసాయి శ్రీసాయి జయజయ సాయి!
Your feedback greatly helps for improvement of the blog , please write your opinion in the comments section below and share if you like. ( మీ సలహా మిగుల విలువైనది, క్రింది కామెంట్స్ సెక్షన్ లో మీ అభిప్రాయము తెలియపరచగలరు. నచ్చితే తెలిసినవారితో పంచుకోండి.)
Comments
Post a Comment