సాయి నీదు స్మరణే నిత్య కళ్యాణము

శ్రీసాయినాథాయనమః 

సాయి నీదు స్మరణే  నిత్య కళ్యాణము

సాయి నీదు స్మరణే  నిత్య కళ్యాణము
పావన తీర్థము  పచ్చతోరణము
సాయి  సాయి నీవె  చైతన్య రూపము
మా  ఇంట దోగాడు  ఆనందదీపము, ఆ…  నంద తిలకము

సిరిగంగ పొంగులె   నీవున్న గ్రామంబు
శ్రీవాణి నిలయంబె  నీవున్న గేహంబు
ఆది శక్తికి నెలవు నీదు మహిమల క్రమము
  దివ్యశక్తికే వందనము వందనము                                ||సాయి నీదు స్మరణే||

సాయంటే  చాలులే సమకూరు సౌఖ్యాలు
కామధేను కల్పవృక్షాలే  పరిఢీల్లు 
శామంతకము గూడ సాయింట సరిజేరు
శతభాను తేజునకు వందనము వందనము                       ||సాయి నీదు స్మరణే|| 

సాకేతమై యొప్పు సాయున్న  ఏపురము
ద్వారకయె దిగివచ్చు సాయన్న మరుక్షణము
కైలాసమదికాదె సాయి ఆసన స్థలము
బహుదైవ  బాదుషకు   వందనము వందనము                 ||సాయి నీదు స్మరణే||

శ్రీసాయి కరుణా కిరణాలు అందరిపై ప్రసరించుగాక!
అందరికి శుభమగుగాక !
ఓంసాయి శ్రీసాయి జైజై సాయి!





Comments

Popular posts from this blog

సాయి మంగళం! ( ఆరతి సాయిబాబా!)

Commonality in the messages of Jesus Christ and Shirdi Sai Baba!

శ్రీ సాయి అష్టకము (Sri Sai Ashtakam with English translation )