శ్రీసాయి సచ్చరిత్ర సంషిప్త గానామృతము -7 (మూలము: శ్రీసాయి సచ్చరిత్రము.)
శ్రీగణేశాయనమః,శ్రీసరస్వత్తైనమః,సమర్ధసద్గురు శ్రీసాయినాథాయనమః.
ముందుమాట!
ముందుమాట!
శ్రీసాయిలీలలను గానరూపంలో పాడుకో దలచువారికొరకు ఈ శ్రీ సాయిలీలలు గేయ రూపంలో వ్రాయడమైనది. సమయాభావముచే శ్రీసాయిచరిత్ర పూర్తిగా చదువుటకువీలుకానిచో , ఈ రచన చదువుటచే అధ్యాయ సారమును గ్రహింపవచ్చును. అధ్యాయముల భావ,సందేశముల బట్టి వాటి వాటి నిడివి మారినది. మొట్టమొదటిగా చరిత్ర పారాయణజేయువారు శ్రీసాయిసచ్చరిత్ర మూలగ్రంథ మును ఒక పర్యాయము పారాయణ జేసి ఆపై ఈ గేయామృతము చదివిన విషయ గ్రహణము సులభము కాగలదు. సప్తాహ పారాయణకు వీలుగ,మూలగ్రంధమువలె ఏడు భాగములుగ విభజించడమైనది. శ్రీసాయి కరుణా కటాక్షములు పాఠక భక్తులకు పరిపూర్ణముగా లభించుటకు మనఃస్ఫూర్తిగా ప్రార్ధిస్తున్నాను.
ఏడవభాగము (అధ్యాయములు 45-51)
నలుబది ఐదవ అధ్యాయము
బహుకాలము బాబసేవ కాక ప్రేమతొ జేసినా
గురునిపై గురినిలచునా? సందేహము కాక కాయె
మరుదినమున పాఖడే సరిగబంపె వారిగలువ
నేర్పుతోడ సందియము సాయిదీర్చె ముదము మిగుల
!
సాయిదేహము లేదను సందియము యేల?
మేలిగురువు దొరకె మనకన్యమేల?
ఎన్నిజనమల పున్నెమో సాయిదొరకె,
సాయిచరణాల శరణు శరణు యనరె !
నలుబదియారవ అధ్యాయము
దండిజ్ఞానులను వారల దాపురావు
కొండయహముతో నిండిన చూడరావు
గండపెండెర పండితుల గానరావు
భక్తహృదయంబుల నీవు వీడలేవు!
కాక , నానల పుత్రుల వేడుకల వేళ
శ్యామను బంపె బాబ తనకు బదులు
ముందుపలికియె గయలొ తాను నిలచె
భక్తి ఎచటనొ సాయి యచట నుండు!
గయలొ
బాబా!
మనోవాక్కాయకర్మల శ్రీసాయి గురుచరణంబుల ప్రణమిల్లుటయె భక్తులు
గురుకృపపొందు సమీపమార్గము. సాయి నీకొరకు సప్తసముద్రముల యావల
ఏరూపముతొ ముందునడుస్తారో యూహాతీతము. సాయిదేవ ప్రియభక్తులు దీక్షితు,
చందోర్కరులు
తమ పుత్రుల ఉపనయ, వివాహ శుభ కార్యములకు సాయిదేవ
నాహ్వానింప
వారితో బాబ,
" ఇదిగో శ్యామ మీకై వెడలు
మీగృహంబుల విందులు సేయు
కాశి ప్రయాగ యావల యావల
మేమాతనితొ జతగలిసెద " మనె.
సాయియనుమతితొ శ్యామవెడలెను
అప్పకోటి తన తోడు కలియగ
నాగపూరు, గ్వాలియరు నగరుల
విందులుసేసె బాబ దీవెనలందగ
ఇరునగరుల తగు దక్షిణలంది
వారిరువు కాశి నగరు జేరిరి
విశ్వేశ్వర సేవలొ రెండుమాసములు
అయోధ్యనగరిలో మూడువారములు
మిగుల ప్రియముగ ఇరువురు గడపిరి
తగుమరియాదల మిగుల పొందిరి
ఆపై గయ పయనము సాగెను
ధర్మశాలలొ రాత్రి శయనము
ప్లేగుభయముతొ
శ్యామ యుండగ
గయ పురోహితుడు వారి జేరెను
భయము వలదులే, ప్లేగులేదులే
అటులబలికి తనవాడ జేర్చెను.
పురోహితగృహము మిగుల సుఖంబు
చిత్రవిచిత్రము బహు విచిత్రము
గృహమధ్యంబులొ సాయిచిత్రము
శ్రీగురుచిత్రము గృహము పవిత్రము !
శ్యామా స్మృతిలొ సాయిపలుకులు
శ్యామా
కన్నుల జలజల ధారలు
మేనికి పులకలు , రుగ్ధ
కంఠము
యదుపు దప్పెను యాతని దేహము
ఎటుల యెటుల బాబ చిత్రమటుల?
ద్వాదశవర్షంబుల
పూర్వము
పురోహితుజేరె షిరిడి నగరము
శ్యామనుండి సుందర చిత్రము
బాబ దీవెనల తానుపొందెను.
కన్నులముందా శ్యామనిలబడ
యుల్లము ఝల్లన, పురోహితు మ్రాన్పడె !
సేవలు సేవలు మిగుల జేసెను
గజారోహణమె శ్యామకు గూర్చెను
బాబ వాక్కులె నిత్యము నిత్యము!
బాబ వాక్కులె సత్యము సత్యము!
సాయితత్వము యెదలొ నింపుటే
సర్వజనులకు శుభము శుభములే !
నలుబది యేడవ అధ్యాయము
భాషలెన్నొ నెరిగిన బాంధవుడు
భావమదియె మూలము భాషకాత్మ
ఆత్మలందరి
యలరిన అంతరాత్మ
జనమ జనమల నేస్తము సాయిదేవ !
పాముకప్పల వైరము వీడ బలికి
నిండుప్రాణంబులనిచ్చె మండూకమునకు
జన్మ జన్మల గాచెడి జోగిసాయి
జాగుయేలను శరణు సాయివేడ!
పాము కప్పల యద్భుత గాధ !
బాబూ వినరా కథరా, బాబా చెప్పిన కథరా,
పామూ కప్పల కథరా , ఇది జన్మల కర్మల కథరా !
ఓ ఉదయంబు బాబ వెడలెను
వాహ్వాళి
నిమిత్తము ఓ నది తీరము
అగంతుడొకడు బాబ జేరెను
చిలుముబీల్చ సంభాషణ సాగెను
మండూక రోదన యంత వెల్వడె
భయ విహ్వల మరణ వేదనల
సర్పము నోట కప్పజిక్కెను
కర్మఫలంబని బాబ పల్కెను
ఆగంతుకుడట ముందుకుసాగి
కాలనాగుచెర కప్పను గాంచెను
బాబ చెంతకు తా బరుగెత్తెను
కప్పయాయువిక లేదని బలికెను
అటులెటులౌనని బాబా పలికిరి
చిలుముబీల్చి శీఘ్రముగ కదిలిరి
వీరభద్ర చెన్నప్పల నచ్చట
కాలనాగు పెదకప్పగ జూసిరి.
పచ్చాత్తాపము
చెందు బసప్పా!
క్రౌర్యము ద్వేషము వీడు భద్రప్పా!
జన్మలు చెల్లె ప్రియముగ మసలుము,
యనుచు బాబ బహూహితముల బలికిరి
కప్పకు చెర విడె సర్పము మరలె
ఆ సంబోధన యవి వినినంతనె.
వీరభద్ర చెన్నప్పల గాధల
బాబ బలికిరి యతిమధురంబుగ
అది పురాతన పుణ్యస్థలము
సాయీశునికి యతి సమీపము
శిధిల జీర్ణ శీవాలయముండెను
భక్తుల పూజల యాలంబనముగ.
ఆలయోద్ధరణ చేయగ నెంచి
గ్రామవాసులతి ధనము గూర్చిరి
ధనికునొకని ధరమ కర్తగ జేసి
దేవాలయ పనుల నప్పగించిరి
అతడతి లోభి, దైవ విరోధి
ధనమును మింగి మిన్నకుండెను
ఆతని భార్యకు శివ స్వప్నమాయెను
గోపురమె నిలుప బహు లాభమగును యని
భార్యభావమును లోభివినగనె
స్వప్నమదియని త్రోసిపుచ్చెను
మహేశ్వరుడు మరలస్వప్నములొ
భక్తిభావముల దక్షిణ యడిగెను
తలిదండ్రులిడిన యాభరణంబులె
మేలుదక్షిణగ యామెదలచెను
వేయి రూకలకు నగలు తానిడి
బంజరునేల లోభి యొసగెను
పేదరాలొక
దుబాకీ నేలది
యతిస్వల్పధరతొ లోభిపొందినది
ఇటులాతండు భార్య, దుబాకీ
పరమేశ్వరులా మోసగించెను.
అవ్విధముగ యొప్పందము కుదరగ
బంజరునేల పూజారికి మిగిలెను
కాలగమనమున పెద ప్రళయము గలిగెను
మువ్వురి మరణము యచ్చెరువుగ జరిగెను
మరుజన్మంబున లోభి జనించె
మధురాపురమున వీరభద్రగా
యాతనిభార్య పూజారి శిశువుగా
గౌరినామముతొ మరలజనించె
చెన్నబస్సప్పగ దుబాకీ జన్మిడె,
ఆలయసేవక పరివారంబున
వచ్చుచు పోవుచు గౌరి పుజారులు
బాబాకెంతొ సన్నితులాయిరి.
యాచన జేయుచు అటునిటు దిరుగుచు
వీరభద్ర గౌరి గృహమేతెంచెను,
బాబాకృప వీరి పరిణయమాయెను
భద్రప్ప ధన దాహము తీరదాయెను!
ఆపై కొంతకాలానికి ,
ఆ బంజరు ధరయే నింగి తాకెను
లక్షరూకలకు విక్రయమాయెను
గౌరీ యాస్తి కధిపతి యాయెను
వీరభద్రకది కంటకమాయెను
గౌరీ బాబను శరణు వేడెను
హక్కుదారుగ తీర్పు పొందెను
వీరభద్రకు భాగమేలయని
చెన్నబస్సప్పకు కొంతయిమ్మనె
వైరులాయిరి వీరభద్ర, బస్సప్పలు
బసప్పను మడువ భద్రప్పేతెంచెను
బాబా శరణు బసప్ప వేడెను
బాబా రక్షణ అభయము పొందెను
భద్రప్ప బసప్పల జన్మలు మారెను
పాము కప్పలుగ మరుజన్మలు కలిగెను
సర్పము నోట కప్ప చెరవడ
బాబా కాచెను దైవలీలగ!
కర్మఫలములకు బహు జన్మలెత్తవలె
చేసిన రుణముల దీర్చుగొనవలె
లోభి యధోగతి పొందక మానడు
బాబాచరణమె శరణని నమ్మడు !
నలుబదియెనిమిది, తొమ్మిది అధ్యాయములు
రుచులనెరిగి రుచులజూపువాడు
ఆత్మజూసి ఆత్మజూపువాడు
పరమునెరిగి పరముజేర్చువాడు
అతడె సద్గురువనగ అన్యులేల ?
గురుని పరిహసించి జేరిన సపత్నేకర్
సాయికరుణకు బహుదూరుడాయె
తప్పునెరిగి పత్నితొ మరలవచ్చి
బాబ ఆసిసులంది పుత్రులొందె!
పలుకుతరమె సాయిలీలల మౌనంబె మేలు
మౌనమెటుల;
బాబ, భావనలె పురిగొల్ప
బిడ్డలజోగొట్టి నిదురింపునది తల్లి
గిల్లి
తమాషాలు జూచునది తల్లి
చిత్తము
చెప్పులపైన , భక్తిబాబాపైన
బొంబాయి హరికనోబా , జరీ తలపాగా
బాబ పరీక్షింపగ వచ్చి
, పాదరక్షలకు పరితపించె
వాడబాలుడు తేగ, లీలగాంచెలె
కనోబా!
సోమదేవస్వామి హరిద్వారమఠవాసి
సాయి జూడగ వచ్చె మిగులప్రేమతోడ
ఎగురు జెండాలజూసి విస్తువోయె
బాబ
ఆడంబరునిగ మదినిదలచి
సాయికన్నులజూసి
స్తబ్ధుడాయే
మనసె మౌనమౌగ, శాంతచిత్తుడాయె!
మహిమగాంచి , సాయి భక్తుడాయె!
మనసుచంచలము , మర్కటనైజము
నాన ముగ్ధుడాయె, మహిళ మొగముజూసి
మదిలొ కలవరంబె , మరలజూడ దలచె,
నానతలపు నెరిగి బాబ హితముబలికె!
"సృష్టి సుందరంబు, దైవనిర్మితంబు
సంతసంబునె
పొందు , కనులవిందు
రూపులెనుక వాని రూపుజూడు
మనసు నలజడి తొలగు, కనుల గలుగు వెలుగు"!
ఏబది, ఏబదియొకటవ అధ్యాయములు
సాయిలీలల శ్రోతలు ధన్యులు
సాయిలీలల కథకులు ధన్యులు
సాయివెన్నెల గాథలు హాయిలే,
సాయిమల్లెల మాటలు పున్నమే!
కాకా దీక్షితు విద్యావంతులు
బాబనుజేరిన బడా పిచ్చుక
కుంటికాలుకు కుంటిమనసుకు
బాబ సన్నిధే ఔషధ మాయెలే
షిరిడీ పురములొ దీక్షితువాడ
దీక్షితు మదిలో షిరిడీబాబా
ఎన్నిజన్మలదొ
బాబతొ బంధము
బాబాసన్నిధె దీక్షితు భాగ్యము
బాబాసన్నిధే పుష్పక యానము
ఆతనియాత్మయె
బాబతొ యైక్యము !
టెంబె స్వామిజూడ సాయిసోదరుండు
పుండరీకుడు పొందె నారికేళంబు
దారి పగులగొట్టి తానుతినుటయె జూడ
సాయిసంకల్పంబది
వేరుగాదు
మాత్రుల, నిమిత్తమాత్రుల మనమె నిజము నెరుగ !
బాలారాము ధురంధరు ధన్యుడు
బాబాదర్బారు జేరిన పుణ్యుడు
చిలుము భాగ్యముతొ ఆయాసమె దూరము
చావడి సంబర వేళ , సాయిలొ రంగతేజము !
సాయిలీలల శ్రవణమె సర్వపాప హరణము
సాయిలీలల గానమె జనమ సార్ధక పథము
ధనము కలుగు, మిగుల జ్ఞానమలరు
డెందమందు కలుగు సంతసంబు
వాంఛితములు దీరు, సంపదలు గలుగు
శాంతి యలరు , తృప్తి మనసు పొరలు!
సాయిలేని యణువు లేదు, సాయివ్యాపి సర్వవ్యాపి!
సాయిరూప ధ్యానమె, సరిగ జేర్చు గమ్యము!
అహము అహము కరుగ వెలుగె
మిగులు
సాయి సాయీ తేజ హృదయమలరు!
సాయికి దాసుడు ఈ అణు శ్యాముడు
దయగలసాయి కరుణకు పాత్రుడు !
సాయి గానా మృతము భక్తిశ్రద్ధల చదువువార
సర్వవేళల గాయ సాయిదేవులు,
మనసు దలచి సాష్టాంగమిడుదు
సాయిచరణాల శరణు శరణు యనుచు!
శ్రీసాయి సచ్చరిత్ర సంషిప్త గానామృతము సంపూర్ణము
ఓం శ్రీ సాయినాథాయ నమః
సద్గురు శ్రీసాయినాథార్పణమస్తు!
శ్రీసాయి కరుణాకిరణాలు అందరిపై ప్రసరించుగాక!అందరికి శుభమగుగాక!ఓంసాయి శ్రీసాయి జయజయ సాయి!
సమర్ధసచ్చిదానంద సద్గురు శ్రీ సాయినాథమహారాజ్ కి జై!
శ్రీసాయి సంషిప్త సచ్చరిత్ర గానామృతము సమాప్తము. పాఠక భక్తులెల్లరకు శ్రీసాయి ఆశిసులు పరిపూర్ణముగ లభించుగాక!
ReplyDelete