గోపాలుని మురళి
శ్రీసాయికృష్ణాయనమః
గోపికలు, శ్రీకృష్ణ వేణుగానానికి పరవశులై, తమ వశం తప్పి తమ భర్తల, పిల్లల, గోవుల, గృహముల ఊసు మరచి శ్రీకృష్ణుని వైపుకు మైమరపున పరుగులు దీసినటుల శ్రీమద్భాగవత వాక్యం. అలాగే సాయినాథులుకుడా అంతటి సూదంటులు. తమ భక్తుల చిన్న పిచ్చుకల జేసి, కాళ్లకు పాశమేసి తమవైపుకు లాగుతారు. ఓసారి లాగబడిన పిమ్మట వారందరు అసహాయులే! శ్రీ షిరిడీ సాయి లీలావైభవానికి తనువుల, మనసుల మరచి, తలొగ్గవలసిందే!
గోపాలుని మురళి
వేయి వీణల మధుర మది ,గోపాలుని మురళి యది
గోపికల
విరహమది ,లీలమానుష రవళి
యది ….
గోవింద గోవిందా..... గోవింద గోపాలా,
గోవింద గోవిందా..... గోవింద గోపాలా
గోవింద గోవిందా..... గోవింద గోపాలా,
గోవింద గోవిందా..... గోవింద గోపాలా
వేణుగాన
పిలుపునకు వశములు పరవశములే
తనువులూ
మనసులూ గోపాలుని వశములే
గృహములందు
కాలుసేయి నిలువవు అయ్యయ్యో
బృందావన
విహారి పిలుపునకు అయ్యయ్యో
నది యదియె సాగరుని చేరకున్న
వరదాయే
ఆత్మయదియె
పరమాత్మను కూడకున్న వ్యధయేలే | వేయి వీణల
మధుర మది |
గోపిక
గోపిక కౌగిట నంద గోపాలమే
ఆ
... నందగోపాలమే ఆనందగోపాలమే
గోపికల
యెదలేమో ముకుందునితొ
మిళితములె
రాగరసాంబుధి
పొంగిన పున్నమి శుభవేళలొ
వెన్నెల
బృందావనిలొ గోపికలదే భాగ్యము
కృష్ణలీల
రాసక్రీడ తేలియాడు ప్రణయవేళ | వేయి వీణల మధుర
మది |
శ్రీసాయి కరుణాకిరణాలు అందరిపై ప్రసరించుగాక!
Sai is Lord krishna-Saibanisa
ReplyDelete