మొదటి శిరిడీ యాత్ర
ఓం శ్రీసాయినాథాయనమః !
కొద్ది క్షణాలు బాబా స్మృతులతో మనసంతా నిండిపోయేది. ఈనేల ఎంత పవిత్రమైనది. ప్రతి అణువు బాబా పాదస్పర్శచే అరువది సంవత్సరాలు పునీతమైనది. ఇచటి గాలి,నీరు ఎంతటి శక్తి సంతరించుకొన్నాయి. ఈ చిన్న పాతమజీదులోనేకదా దైవం మానుషరూపంలో నివసించినది. ఇదేకదా బాబా మహిమల మందిరము. ఇచటనేగదా బాబా సర్వ దేవీ,దేవతా, గురురూప దర్శనమిచ్చినది. ఎందరో రోగాలు,బాధలు పోగొట్టుకున్నది, మరెందరో సంతాన సౌభాగ్యాలందినది. ఇలాంటి ఆలోచనలతో మాటలకందని ప్రశాంతత మనసును కట్టివేసింది.
పవిత్ర గురుస్థానం, ద్వారకామాయి, సమాధి మందిరం మరల మరల దర్శించుకున్నాము. పెక్కుసార్లు ఆరతులు చూసాము, బాబా దర్శనము చేసికొన్నాము. ఇలా తెలియకుండా మూడు రోజులు, మూడు క్షణాల్లా గడచిపోయాయి. తిరుగు ప్రయాణం ఎంతో బాధాకరమనిపించింది. మా అమ్మాయి, అబ్బాయి చిన్నవాళ్లు, ఏడవడం మొదలుపెట్టారు. అలా బస్సులో వెనక్కు వెనక్కు చూస్తూ ముందుకెళ్ళాము.
మొదటిరోజు కలిగిన భావోద్వేగానికి ఈక్రింది భావన ఓ దర్పణం!
ఆనంద మానంద మానందం ...
సాయి నిలచిన నేల నేను తలచిన వేళ
తనువు పులకారించి పరవసించు వేళ
ఆనంద మానంద మానందం
బ్రహ్మానంద మానంద మానందం
ఆనంద మానంద మానందం
బ్రహ్మానంద మానంద మానందం
సాయి నడచిన నేల నేను తాకిన వేళ
మనసు పొంగీపొంగి నింగితాకిన వేళ
ఆనంద మానంద మానందం
బ్రహ్మానంద మానంద మానందం
ఇదియె ఇదియే చూడు ఖండోబ గుడి ఇదియె
సాయి ఆదీ స్పర్శ పావనంబిదియె
నింబ వృక్షామిదియె తొల్లి వాసా మిదియె
సాయి పాదుకలా మేలి వేదిక ఇదియె
మాజీదు మా ఇదియె ద్వారకా మాఇదియె
సాయిదేవుడూ ఎదిగీన ఒడి ఇదియె
మాయి దాపునా హనుమ గుడి ఇదియె
ఆపైన మరి చూడ అందాల చావడియె
జలముతో దీపాల వెల్లు వెల్లువలిచట
తిరుగలి తిరుగులో పాపాలు మసి ఇచట
రోగాలు శోకాలు దూర దూరా లిచట
సాయి దరబారులో రాజు పేదలు నిలువ
అన్న దానము లిచట సాయి అన్నియె నిచట
ఎన్నెన్నొ రూపాల పరమాత్మ సాయిచట
గంగయమునలసంగ బంగారు ధారిచట
గురుసాయి మరపులో జనమ ధన్యము నిచట
ఆనంద మానంద మానందం
బ్రహ్మానంద మానంద మానందం
శ్రీసాయి కరుణకిరణాలు అందరిపై ప్రసరించుగాక!
అందరికి శుభమగుగాక!
ఓంసాయి శ్రీసాయి జయజయ సాయి!
అందరికి శుభమగుగాక!
ఓంసాయి శ్రీసాయి జయజయ సాయి!
Our first Shirdi trip!
ReplyDelete