అంతా నీదయ బాబ !
శ్రీసాయినాథాయనమః
అంతా నీదయ బాబ !
అంతా నీదయ బాబా అంతా నీవే బాబాచీకు చింతా ఏల నీవే నన్ను బ్రోవ
తల్లివి తండ్రివి నీవె నా... సఖుడవు గురుడవు నీవె
సాయి సాయని తలువ సాయము సేతువు నీవె || 2 ||
నా... సాగర సేతువు నీవె ||అంతా నీదయ||
మమతయు సమతయు నీవె నా... యోగము క్షేమము నీవె
మానుష రూపములోనె మహిమల దేవుడ వీవె || 2 ||
నా... మహిలో దేవుడ వీవె ||అంతా నీదయ||
ఎదలో కొలువుగ నీవె నా... కలిమియు బలిమియు నీవె
జలముతొ వెలుగుల జూపి జగమున జోతివి నీవె || 2 ||
నా... జీవన జోతివి నీవె ||అంతా నీదయ||
ఆసయు శ్వాసయు నీవె నా... మనసులొ వాసము నీవె
ధ్యానము ధ్యేయము నీవె ధరణిలొ దైవము నీవె || 2 ||
నా... ధారణ దైవము నీవె ||అంతా నీదయ||
Why should I fear when You are here!
ReplyDelete