మనసెరిగిన సాయి , ఓ గురువార అనుభవము !

ఓంశ్రీసాయినాథాయనమః 

సాయిబాబా సర్వాంతర్యామి,సర్వహృదయవాసి. మన ఆశలు, ఆశయాలు,కోరికలు,భయాలు,బాధలు,ప్రాణాంతకాలు అన్నీ ఆయనకెరుకే ! దగ్గర దూరాలతో పనిలేదు. ఉన్నవారు,లేనివారనే తారతమ్యం లేదు. ఆయనకు వాడాలోని హేమాద్రిపంతు వాదన తెలుసు,పండరీపురంలో తనను గూర్చి లాయర్ జేసిన నిందారోపణ తెలుసు,చోల్కర్ షిరిడీ ప్రయాణానికి  డబ్బులు మిగుల్చుటకై చక్కెరలేని తేనీరు త్రాగిన విషయం తెలుసు,వణిలోని పూజారి కాకాజీవైద్య షిరిడి వెళ్లదలచు తపన తెలుసు,ఇంతేకాదు నోరులేని కుక్క ఆకలి తెలుసు,గోడపైనున్న బల్లి కిచ కిచ కూత తెలుసు. అలాగే భక్తుల అంతరంగాలన్ని ఆయనకు తెరచిన పుస్తకాలే. ఇది గత చరిత్ర కాదు, నడుస్తున్న వాస్తవం. సాయి మనవిన్నపాలకు స్పందిస్తారు, సరైనవాటిని సమకూరుస్తారు. ఏదిమంచిదైతే అదే చేస్తారనే విశ్వాసం కలిగియుండటం భక్తులకెంతో శ్రేయస్కరం.

పైవిషయానికి దగ్గర సంబంధం కలిగిన ఓ చిన్న అనుభవాన్ని ప్రస్తావిస్తాను. ఆరోజు సెప్టెంబర్ మాసం ఒకటో తారీఖు గురువారం, 1994. అపుడు హైదరాబాద్ శ్రీనగర్ కాలనిలో ఉండేవాళ్ళం. ఇంటికి దగ్గరున్న పంజాగుట్ట లోని ప్రసిద్ధ షిరిడీసాయి గుడికి వీలైన ప్రతి గురువారం వెళ్ళేవాడిని. యధావిధిగా ఆరోజుకూడ గుడికి వెళ్ళాను. సాయంకాలం ఆరతి సమయమగుటచే ఎంతో రద్దీగా ఉంది. భక్తులు హాలు బయటి ప్రాంగణంలో కూడా దర్శనానికి నిలబడి ఎదురు జూస్తున్నారు. కొద్దిసేపటికి క్యూ కదిలి హాలులోకి ప్రవేశించాను. రద్దీవలన వాలంటీర్లు దర్శనానికి తగిన సమయమీయక తొందరపెట్టి భక్తుల నెట్టేస్తున్నారు. కాసేపటికి  బాబా మూర్తికి దగ్గరకు వచ్చాను. ఇంకా నాముందు నలుగురైదుగురు వేచి ఉన్నారు.

ఇంతలో నాలో ఓచిన్న వింత ఆలోచన వచ్చింది. బాబా పాదనమస్కారం తర్వాత ఆయన ముఖాన్నొకసారి స్పృశించాలని. అంత రద్దీలో నా ఆలోచనకు అర్ధం లేదేమో యనిపించింది. కోరిక ఆలోచనగానే మిగిలిపోతుందేమో ననుకొన్నాను. క్యూలో నావంతు వచ్చినపుడు బాబావిగ్రహానికి పాదాభివందనం జేసి ముందుకు సాగబోతున్నాను. ఇంతలో ఓచిన్న విశేషం, విషయం చిన్నదైనా అది నాకు విశేషంగా తోచింది. అచటనిలబడ్డ వాలంటీర్ నాకు ఓపెద్ద తెల్లపూలమాలిచ్చి, బాబామెడలో వేయమన్నాడు. మరెందుకాలస్యం? వెంటనే పూలమాలవేసి, బాబాముఖాన్ని ప్రేమతొ స్పృశించి , వాలంటీరుకు కనులతోనె కృతజ్ఞతలు తెలిపిముందుకు కదిలాను. అది  మల్లెమాలో మరే పూలమాలో గుర్తులేదు.  ఆ ఘటన యాదృచ్చిక మనిపించలేదు. మెరుపు వేగంతో బాబానుండి వచ్చిన ఆసిసుగా తలుస్తాను. ఈ ఘటన  పిమ్మట నాలో కలిగిన స్పందనకు అక్షరరూపమె క్రింది భావగేయము.

శిలవు కావయ్యా సాయి శివుడ వీవయ్యా

శిలవు కావయ్యా సాయి శివుడ వీవయ్యా
వందితుడవయ్యా సాయి స్పందితుడవయ్యా!

అంతరంగపు తలపులన్నీ నీదు కరమున  అమలకములు
భావసంద్రపు ఉహలన్నీ బాబమనమును చేరు అలలు
సాయి సాయని ప్రియము పలుక, సాయితత్వము మదిని నిలుప
రయము రయమున పరుగులిడుదువు, కనికరముతో అభయ మిడుదువు      || శిలవు కావయ్యా ||

చిత్తమందలి వృత్తులన్నీ నీదుజపముతో లుప్త లుప్తమె
జనమ జనమ దురితమెల్ల నీదు స్మరణచె దూరదూరమె
సాయినాధ వేదమలరా, సాయి చల్లని చూపు కలుగ
ఇహము పరము లన్ని గూర్తువు  యెడద గుడిలో విడిది సేతువు                   || శిలవు కావయ్యా ||

పురాణాల్లో భగవంతుడు భక్తులకై పరుగిడిన ఎన్నో సందర్భాలగూర్చి చదివాము, శ్రీకృష్ణ పరమాత్మ ఆర్తితో పిలిచిన ద్రౌపదిని ఆదుకొన్నాడని, ప్రహ్లాద, గజేంద్రుల రక్షణకై శ్రీమహావిష్ణు వైకుంఠమునుండి పరుగులెత్తాడని.ఆ ఘటనలు నిజం కావచ్చు, కాని అనుభవం పొందే  స్థితిలో  మనం లేము,  అనుభవం మనకు లేదు. బాబా క్షణకాలంలొ అలాంటి అనుభవం కలిగించారనిపిస్తుంది. ప్రస్తుత నావిషయానికి  అంతటి ప్రాముఖ్యత లేదు, అత్యవసరం కాదు. కాని  ఈ చిన్న ఘటనద్వారా ఆయనపై, నా విశ్వాసాన్ని 25 సవత్సరాలకుపైగా నిలిపారు, మామిడిపూత రాలకుండా చేసారు. ఇది సాధారణ విషయం కాదనిపిస్తుంది.   అనుభవానికి మించిన సత్యమేముంటుంది?  అలాగే ఓరోజు ఇంట్లో ఓ చిన్న దత్తస్వామి ఫోటో పెట్టుకోవాలని తలచి పంజాగుట్ట వెళితే, బాబా గుడికెదురు షాప్ లో అదేఫొటో, కేవలం ఒక్కటే ఉంది, ఆలస్యం చేయక వెంటనే కొన్నాను.

శ్రీసాయికరుణకిరణాలు అందరిపై ప్రసరించుగాక!
అందరికి శుభమగుగాక!
ఓంసాయి శ్రీసాయి జయజయ సాయి
పంజాగుట్ట బాబా దేవాలయము








“Be My Refuge, O Sai, Be My Shiva Divine” Be my shelter, O Sai, be my Shiva so kind, Be the One whom we worship, the One who responds to our cry. All the secrets of my heart rest in Your sacred hands, All the waves of my longing flow toward Baba’s gentle land. When I call Your holy Name, let Your love softly arise, Let the truth of Sai blossom and live in my mind. Swiftly You run to rescue with compassion so deep, Granting fearlessness, You guard Your devotee. Be my shelter, O Sai, be my Shiva so kind… All the restless thoughts within fade away by Your chant, Lifetimes of sins disappear by Your remembrance so grand. O Lord Sai, let wisdom bloom like a radiant flame, Let Your cool, compassionate glance pour peace like rain. You unite this world and the world beyond, And make my heart Your temple, where You eternally belong. Be my shelter, O Sai, be my Shiva so kind… ⸻ This translation is meant to be sung gently, with devotion, allowing the melody to carry the feeling of surrender,

Comments

  1. " If you seek my advice and help, it shall be given to you at once " Sai Baba assured His devotees, here is an example !

    ReplyDelete

Post a Comment

Popular posts from this blog

శ్రీ సాయి అష్టకము (Sri Sai Ashtakam with English translation )

సాయి మంగళం! ( ఆరతి సాయిబాబా!)

Commonality in the messages of Jesus Christ and Shirdi Sai Baba!