This blog is a humble floral tribute to the Holy Samadhi of Shri Shirdi Saibaba. The blog includes prayers, bhajans, songs, experiences of devotees, stories of Saibaba, Saibaba as compared to other Divine incarnations and saints, Sri Sai Satcharitra in brief poetic melody etc.
సాయిదేవుని చల్లని చూపులు !
Get link
Facebook
X
Pinterest
Email
Other Apps
శ్రీసాయినాథాయనమః
సాయి చరిత్రకు హృదయంలాంటి ప్రత్యేక కథనుగూర్చి అవలోకిద్దాము. ఇది శ్రీసాయిసచ్చరిత్ర 18-19 అధ్యాయములలొ చాల విపులంగా చెప్పబడినది, ఎక్కువుమంది పాఠకులకు తెలిసినదే. సంగమనేరునుండి రాధాబాయి యనే ఓముసలమ్మ షిరిడి జేరి బాబా ఉపదేశమిచ్చేవరకు ఉపవాసముండదలచి మూడురోజులు తనబసలోనే అన్నపానీయాలు మానివేసినది. సన్నిహిత భక్తుడు శ్యామా బాబా కీవిషయం తెలుప, బాబా ఆమెను పిలిపించి చాల మధురంగా యిలా మాట్లాడారు. " ఓ తల్లీ!, ఉపదేశమిచ్చుట మా సంప్రదాయము కాదు. కేవలము గురునిపై భక్తే ముఖ్యం. నేను నాగురుని 12 సంవత్సరాలు మిగుల శ్రద్ధ, సహనాలతొ సేవించాను. దేహశక్తులన్నిటిని కన్నులలో జేర్చి, నిద్రాహారాలు మాని రేయింబవళ్లు వారిపై దృష్టినిలిపే వాడిని. నామనసెప్పుడు వారియందే నాటుకొనియుండేది. కాని వారు నాకెలాంటి ఉపదేశమివ్వలేదు. వారు తమదృష్టి చేతనే నన్ను కాపాడుచుండెడివారు. తాబేలు తన పిల్లలను కేవలము తన చూపులతొ పెంచినట్లు, నన్నుగూడ మాగురువు తమ దృష్టితోడ పోషించెడివారు. కనుక నీవుకూడ నీ ఆలోచనలు పనులు నాకోసమె వినియోగించుము, నావైపు సంపూర్ణహృదయంతో చూడుము. నేను నీవైపు అటులనే జూసెదను. ఈ మజీదులో నేనెపుడు సత్యమునే పలికెదను." ఈమాటలకు ఆమె తృప్తిచెంది బాబాకు నమస్కరించి ఉపవాసము విరమించినది.
కావున భక్తులు మిగుల శ్రద్ధ, సహనాలతొ గురునిసేవించుటే గురుకృప, అనుగ్రహము పొందుటకు చక్కటిమార్గంగా చెప్పబడినది. ఈ భావనే ఈక్రింది ప్రేరణాగీతానికి మూలము. మంచిభావనలతొ గురుని సేవించుట ఎంతో శ్రేయస్కరముకదా !
కన్నులతొ మనసు మనసు
కన్నులతొ మనసు మనసు కలిపి కలిపి చూడరమ్మ
సద్గురుని పాదముపై గురిని గురిని మోపరమ్మ
శ్రీసాయినాథాయనమః శ్రీసాయిఅష్టకము బ్రహ్మ మురారి శివాద్భుత రూపం , భువిలో వెలసిన దత్త స్వరూపం భక్తుల పాలిట కల్పవృక్షం , తత్ప్రణమామి గురూసాయినాథం మహల్సపతి అట చూసిన రూపం , మహిలో మహిమల చూపిన రూపం ద్వారక మాయిని వెలసిన రూపం , తత్ప్రణమామి గురూసాయినాథం కఫ్ని ధరించిన మానుష రూపం , కలరా బాపిన కరుణా రూపం కామితార్థము లొసగే రూపం , తత్ప్రణమామి గురూసాయినాథం తిరుగలి గిరగిర త్రిప్పిన రూపం , గోధుమలందున విసిరిన రూపం వ్యాధుల బాధల బాపిన రూపం , తత్ప్రణమామి గురూసాయినాథం ధుని వెలిగించిన దయగల రూపం , భువిలో కర్మల గాల్చిన రూపం లీలల ఊదీని పంచిన రూపం , తత్ప్రణమామి గురూసాయినాథం జలముతో వెలుగుల జూపిన రూప...
God is One! Sri Sainathaya Namah! Wishing Merry Christmas and Happy New Year 2019 to all the readers! Jesus Christ and Shirdi Sai Baba, both are believed to be Divine Incarnations, came on earth at different times to restore the human values and establish God's Kingdom on this planet. In this current post an attempt is made to retrospect and compare in brief, their ever truthful messages. I request the readers to pardon for any of my unintentional mistakes. Jesus Christ travelled in the regions of Galilee; town to town, preached, healed the sick, became popular with people, great crowds followed Him.One day Jesus went up a mountain side and spoke to His disciples and crowds.The sermon on the mountain outlines the right ways for us to approach God and to deal with other people. Below is a brief summary of His sermon.(Ref: 'Jesus' movie) Love your enemies. Do good to those who hate you. Bless those who curse you and pray for people who mistreat...
" Look at me with love and faith, I will look at you with mercy and compassion! " Sai Baba said.
ReplyDelete