సాయిపూజ

శ్రీసాయినాథాయనమః 

" బాబా మనల్ని నియమాలతో, వ్రతాలతో నిరాహారాలతో తపస్సు చేయమనలేదు. శాస్త్రాలు చదవమనలేదు. హృదయమంతటితో తన్ను స్మరించి , సాయి చర్యలను, మాటలను, చూపును, నవ్వును అర్థం  చేసికొంటూ ధ్యానిస్తూ ( మననం చేస్తూ ) వాటిలో లయం కాగలిగితే చైతన్య ఘనత లేక బ్రహ్మసమరసత సిద్ధిస్తుంది అన్నారు.ఈ వివరణే మన సాధనకు మూలమని గ్రహించాలి."  సాయిసూక్తి-ఆచార్యవాణి, శ్రీమతి కమలారామచందర్.
సమయము,  సానుకూలతలున్నవారు వారికిష్టమైన రీతిలో  బాబా పూజ జేసికొనవచ్చును. అందులకు అవకాశములేనివారు మానసిక స్మరణ మాత్ర పూజచేసికొని అదే ప్రశాంత ననుభవింప వచ్చును. బాబా భావ ప్రియులు కావున వారి ఆశిస్సులు అందరిపైన  సమంగానే ఉంటాయి.     

సాయిపూజ 
చిత్తమందు సాయిదేవ భక్తితోడ మొక్కుదాము
శాయశక్తులన్నిమీర సాయిశక్తి కొలుచుదాము

గంగనీరు పట్టుదాము గోవుపాలు పిండుదాము
వెండివేది కందున సాయిదేవు నుంచుదాము
మంగళా స్నానాల బాబ సాయి చేయుదాము
మైమరచి నృత్యకేళ మరీ మరి సాగుదాము                                        || చిత్తమందు ||

పూవులెన్నొ కోయుదాము మాలలెన్నొ  వేయుదాము
భక్తిభావంబుతొ పూజలెన్నొ చేయుదాము
వెన్నముద్దలా...  నివేదనలె నిచ్చుదాము
దత్తరూపు సాయిదేవ చిత్తమందు నిలుపుదాము                                 || చిత్తమందు ||

దివ్వెల వెలిగించుదాము మురళిని మోగించుదాము
మనసులోని చీకటుల మరీ పారదోలుదాము
సుందరాకారు సాయిరూపు చూచుదాము
ఆరతులా పొంగులో...  సాయిలీల సాగుదాము                                    || చిత్తమందు ||


శ్రీసాయి కరుణా కిరణాలు అందరిపై ప్రసరించు గాక!
అందరికి శుభమగుగాక!
ఓంసాయి శ్రీసాయి జయజయ సాయి!



Comments

Post a Comment

Popular posts from this blog

సాయి మంగళం! ( ఆరతి సాయిబాబా!)

Commonality in the messages of Jesus Christ and Shirdi Sai Baba!

శ్రీ సాయి అష్టకము (Sri Sai Ashtakam with English translation )