Posts

Showing posts from October, 2018

గోపాలుని మురళి

Image
శ్రీసాయికృష్ణాయనమః  గోపికలు,  శ్రీకృష్ణ వేణుగానానికి పరవశులై, తమ వశం తప్పి  తమ భర్తల, పిల్లల, గోవుల, గృహముల ఊసు మరచి  శ్రీకృష్ణుని వైపుకు మైమరపున పరుగులు  దీసినటుల శ్రీమద్భాగవత వాక్యం. అలాగే సాయినాథులుకుడా అంతటి సూదంటులు. తమ భక్తుల చిన్న పిచ్చుకల జేసి, కాళ్లకు పాశమేసి తమవైపుకు లాగుతారు. ఓసారి లాగబడిన పిమ్మట వారందరు అసహాయులే!  శ్రీ షిరిడీ సాయి లీలావైభవానికి తనువుల, మనసుల మరచి, తలొగ్గవలసిందే! గోపాలుని మురళి వేయి వీణల మధుర మది , గోపాలుని మురళి యది గోపికల విరహమది , లీలమానుష   రవళి యది …. గోవింద    గోవిందా..... గోవింద   గోపాలా, గోవింద    గోవిందా..... గోవింద   గోపాలా వేణుగాన పిలుపునకు వశములు పరవశములే తనువులూ మనసులూ గోపాలుని వశములే గృహములందు కాలుసేయి నిలువవు అయ్యయ్యో బృందావన విహారి పిలుపునకు అయ్యయ్యో నది యదియె సాగరుని చేరకున్న వరదాయే ఆత్మయదియె పరమాత్మను కూడకున్న వ్యధయేలే               ...

అమ్మ ఒడి

Image
అమ్మ ఒడి శ్రీసాయినాథాయనమః  జైసాయిమా! పాఠక మహాశయులెల్లరకు అంతర్జాతీయ మాతృదినోత్సవ  శుభాకాంక్షలు! తల్లివిలువ వెలకందనిది ! " అమ్మలగన్నయమ్మ మువ్వురమ్మల మూలపుటమ్మ..." ఆదిపరాశక్తి అమ్మలకు అమ్మ, లక్ష్మీ పార్వతి సరస్వతీ దేవీమూర్తులకు  అమ్మ. సాయినాథులు తమను ఆదిపరాశక్తిగా చెప్పియున్నారు ( శ్రీసాయిసచ్చరిత్ర, 3వ అధ్యాయము ). అనగా సాయిదేవులు మాతృమూర్తి యని నెరుగవలెను. దయాసాగర మాతృమూర్తికి శతకోటి ప్రణామాలు!    సాయిబాబా మజీదుకు ద్వారకామాయి అని పేరుపెట్టారు. మాయి అంటే తల్లి యని అర్ధం. ద్వారకామాయిలో ప్రవేశించిన వారిని తల్లిలా ప్రేమిస్తుందని,రక్షిస్తుందని బాబా భావం కావచ్చు. బాబా చరిత్ర చదివిన వారికీవిషయం తేటతెల్లం కాగలదు. నాలుగవ దత్తావతారులైన శ్రీ అక్కల్కోట స్వామి గురుప్రేమను తల్లిప్రేమకు వెయ్యిరెట్లుగా అభివర్ణించారు. సాయిబాబా తామే పరాశక్తిగా చెప్పియున్నారు. జగన్మాతను  సృష్టి కారిణి, సృష్టి పోషిణి, సృష్టి ఉద్ధారిణి, భయనివారిణి , భవభయహారిణిగా  శాస్త్రాలు పేర్కొన్నాయి. ఈవివరణ సాధారణ అవగాహనకు అంత సులభము కాదు. కాని బాబావిషయంలో పెక్కుభక్తులకు అనుభవైకవేద్...

అద్భుత అనుభవము.(నేడు శ్రీఎక్కిరాల భరద్వాజగారి జన్మదినోత్సవము)

Image
శ్రీసాయినాథాయనమః  పాడవే కోయిలా  పాడవే  కోయిలా , సాయిభావగీతికా... ||2||  షిరిడిసాయి సర్వకారి రామకృష్ణ రూపధారి  భావమెటుల మనసుమెలుగ అనుభవంబె యటులని          || పాడవే కోయిలా.. .||  ద్వారకమయి పాపహారి పాదుకలే పుణ్యకారి  అడుగిడినా శిరమొంచిన   చిక్కుతొలగు వెనువెంటని....                                             || పాడవే కోయిలా.. .||  సాయిసత్యవంతుడులే సాయి అప్రమత్తుడులే సామాధీ మొక్కినంత సమాధాన మౌనని .....                                                      || పాడవే కోయిలా.. .||  బాబాసమాధివద్ద శ్రీఎక్కిరాల  భరద్వాజ మాస్టరుగారికి జరిగిన అద్భుత అనుభవము. (నేడు పూజ్య శ్రీభరద్వాజ గారి జన్మదినమహోత్సవపురోజు!)   తమత...

బాబా మాటలు

Image
శ్రీసాయినాథాయనమః   బాబా మాటలు "...సరే, యిట్లు చేయుడు. పిండిని తీసికొనిపోయి గ్రామపు సరిహద్దులుపైని చల్లుడు."  అ : 1 " జ్ఞానోదయమునకుగాని, ఆత్మసాక్షాత్కారానికిగాని మొట్టమొదట పాపములను, కోరికలను తుడిచి వేయవలెను." అ : 1 వాడు నిమిత్తమాత్రుడే , వాని యహంకారము పూర్తిగా పడిపోయినపిమ్మట , నేను వాని మనస్సులో ప్రవేశించి నా చరిత్రను నేనే వ్రాసికొందును . నా కథలు బోధలు   విన్న భక్తులకు భక్తి విశ్వాసములు కుదురును .    అధ్యాయము 2 నేను చేత కలము పట్టుకొనగనే సాయిబాబా నా యహంకారమును పరిహరించి , వారి కథలను వారే వ్రాసికొనిరి . ఈ గ్రంధము రచించిన గౌరవము సాయిబాబాకే చెందునుగాని నాకు గాదు . భగవంతుని అనుగ్రహము మూగవానిని మాట్లాడజేయును , కుంటివానిని పర్వతము దాటించును . సచ్చరితామృతము వ్రాయుట , తయారు చేయుట బాబాయొక్క కటాక్షము చేతనే సిద్ధించినవి . నేను నిమిత్తమాత్రుడుగనే యుంటిని .   అధ్యాయము 3 " మీరెక్కడున్ననూ , ఏమి చేయుచున్ననూ నాకుతెలియునని బాగుగా జ్ఞాపకముంచుకొనునుడు . నీనందరి హృదయముల పాలించు వాడను . అందరి ...