అమ్మ ఒడి
అమ్మ ఒడి
శ్రీసాయినాథాయనమః
జైసాయిమా!
పాఠక మహాశయులెల్లరకు అంతర్జాతీయ మాతృదినోత్సవ శుభాకాంక్షలు!
పాఠక మహాశయులెల్లరకు అంతర్జాతీయ మాతృదినోత్సవ శుభాకాంక్షలు!
తల్లివిలువ వెలకందనిది !
" అమ్మలగన్నయమ్మ మువ్వురమ్మల మూలపుటమ్మ..."
ఆదిపరాశక్తి అమ్మలకు అమ్మ, లక్ష్మీ పార్వతి సరస్వతీ దేవీమూర్తులకు అమ్మ. సాయినాథులు తమను ఆదిపరాశక్తిగా చెప్పియున్నారు ( శ్రీసాయిసచ్చరిత్ర, 3వ అధ్యాయము ). అనగా సాయిదేవులు మాతృమూర్తి యని నెరుగవలెను. దయాసాగర మాతృమూర్తికి శతకోటి ప్రణామాలు!
సాయిబాబా మజీదుకు ద్వారకామాయి అని పేరుపెట్టారు. మాయి అంటే తల్లి యని అర్ధం. ద్వారకామాయిలో ప్రవేశించిన వారిని తల్లిలా ప్రేమిస్తుందని,రక్షిస్తుందని బాబా భావం కావచ్చు. బాబా చరిత్ర చదివిన వారికీవిషయం తేటతెల్లం కాగలదు. నాలుగవ దత్తావతారులైన శ్రీ అక్కల్కోట స్వామి గురుప్రేమను తల్లిప్రేమకు వెయ్యిరెట్లుగా అభివర్ణించారు. సాయిబాబా తామే పరాశక్తిగా చెప్పియున్నారు. జగన్మాతను సృష్టి కారిణి, సృష్టి పోషిణి, సృష్టి ఉద్ధారిణి, భయనివారిణి , భవభయహారిణిగా శాస్త్రాలు పేర్కొన్నాయి. ఈవివరణ సాధారణ అవగాహనకు అంత సులభము కాదు. కాని బాబావిషయంలో పెక్కుభక్తులకు అనుభవైకవేద్యం. శ్రీసాయిసచ్చరిత్రములోని సాయి కరుణామృతమును వివరించు కొన్నిముఖ్య సంఘటనలను వివరించుకొందాము. ఆ ద్వారకామాయి తల్లి దీవెన,రక్షణ అందరికి లభించాలని ప్రార్థిద్దాం,ఆ కరుణామయి తల్లిఒడిలో సేదదీరుదాం!
" ఊరడిల్లుము! నీ ఆతురతను పారద్రోలుము; నీ కష్టములు గట్టెక్కినవి. ఎంతటి పీడ , బాధలున్నవారైనను ఎప్పుడైతే ఈమసీదు మెట్లెక్కుదురో వారి కష్టములన్నియు నిష్క్రమించి సంతోషమునకు దారి తీయును. ఇచ్చటి ఫకీరు మిక్కిలి దయార్ద్ర హృదయుడు. వారీరోగమును తప్పక బాగుచేయును. ఆ ఫకీరు అందరిని ప్రేమతోను దయతోను కాపాడును. " భీమాజీ పాటిలు క్షయనివారణ , 13వ అధ్యాయము
" నీవిప్పుడు కూర్చున్నదే ద్వారకామాయి. ఎవరైతే ఆమె ఒడిలో కూర్చునెదరో వారిని ఆమె కష్టములనుండి యాతురతలనుండి తప్పించును. ఈ మసీదుతల్లి చాల దయార్ద్రహృదయురాలు. ఆమె నిరాడంబర భక్తులకు తల్లి. వారిని ఆపదలనుండి తప్పించును. ఆమె ఒడి నాశ్రయించినవారి కష్టములన్నియు సమసి పోవును. ఎవరామె నీడను ఆశ్రయించెదరో వారికి ఆనందము కలుగును. " బాలాసాహెబ్ మిరీకరును సర్పగండమునుండి కాపాడుట, 22వ అధ్యాయము
" భయపడవద్దు,ఏమాత్రము చింతించకు. ఈదయామయుడైన ఫకీరు నిన్ను తప్పక రక్షించును. ఇంటికిపోయి ఉరక కూర్చుండుము. బయటకు పోవద్దు. నాయందు విశ్వాసముంచుము. భయపడకుము. ఆందోళన పడవద్దు." శ్యామాను పాము కాటునుండి రక్షించు వేళ ,
23వ అధ్యాయము.
" ఎవరైతే ఈమసీదుకు వచ్చెదరో వారెన్నడు ఈజన్మలో ఏవ్యాధి చేతను బాధపడరు. కనుక హాయిగా నుండుడు. కురుపుపై ఊదీని పూయుడు. ఒక వారమురోజులలో నయమగును.దేవునియందు నమ్మకముంచుడు. ఇది మసీదుకాదు,ద్వారవతి.ఎవరైతే ఇందు కాలుమోపెదరో వారు ఆరోగ్యమును ఆనందమును పొందెదరు. వారి కష్టములు గట్టెక్కును. " డాక్టరు మేనల్లుని రాచకురుపు బాధావిముక్తి సందర్భములో, 34వ అధ్యాయము.
" ఈపాదములు ముదుసలివి,పవిత్రమైనవి. ఇక నీకష్టములు తీరిపోయినవి. నాయందే నమ్మకముంచుము. నీ మనోభీష్టములు నెరవేరును." సపత్నేకరును ఆశీర్వదించి పుత్రసంతానము కలిగించుట, 48వ అధ్యాయము
అమ్మఒడి
దొరికెనులే అమ్మ ఒడి
ద్వారకామాయి
యది
ద్వారకామాయియది
ఆపదా... హారిణది
నా నడకల తొలుతబడి
నా పలుకుల మొలకనుడి
నా పిలుపుల వినెడిగుడి
ద్వారకామాయి
యది || దొరికెనులే అమ్మ ఒడి ||
గురుదేవుల
గురుకులమది
నందబాల
గోకులమది
దీపమాల
శోభితమది
ద్వారకామాయి
యది || దొరికెనులే అమ్మ ఒడి ||
రాజరాజ
మందిరమది
యోగిరాజ
సుందరమది
కోటిసూర్య
యోగంబది
ద్వారకామాయి
యది || దొరికెనులే అమ్మ
ఒడి ||
సాయితేజ
నందనమది
మాయమోహ
ధ్వంసకమది
లోక లోక పాలకమది
ద్వారకామాయి
యది || దొరికెనులే అమ్మ
ఒడి ||
శ్రీసాయి కరుణా కిరణాలు అందరిపై ప్రసరించుగాక!
Amma Odi – A Mother’s Lap
Salutations to Sri Sainatha
Jai Sai Ma!
Loving greetings to all on the occasion of International Mother’s Day.
A mother’s value can never be measured.
“Mother of all mothers,
the primal Mother,
the root of all creation…”
Adi Parashakti is the Mother of all mothers—
the Mother of Lakshmi, Parvati, and Saraswati themselves.
Sri Sai Nath has declared that He Himself is Adi Parashakti
(Sri Sai Satcharitra, Chapter 3).
Thus, we must understand Sai Baba as the Divine Mother incarnate.
To that ocean of compassion,
to that Mother-form of Sai,
we offer countless prostrations.
Sai Baba named the Masjid Dwarkamai.
The word “Mai” means Mother.
Baba’s intent may be that all who enter Dwarkamai
are loved, protected, and cared for like children by a mother.
Those who have read Baba’s life will clearly recognize this truth.
Sri Akkalkot Maharaj, the fourth incarnation of Dattatreya,
described the Guru’s love as a thousand times greater than a mother’s love.
Sai Baba Himself proclaimed His identity as Parashakti.
The scriptures praise the Universal Mother as
the Creator of the world,
the Sustainer of creation,
the Liberator of souls,
the Remover of fear,
and the Destroyer of worldly bondage.
These truths may not be easily grasped by the intellect,
but for countless devotees of Sai Baba,
they are directly experienced realities.
Let us recall a few sacred incidents from Sri Sai Satcharitra,
revealing the nectar of Sai’s compassion.
May the blessings and protection of Mother Dwarkamai reach everyone.
Let us find rest, refuge, and peace
in Her compassionate lap.
Sai’s Words of Motherly Assurance
“Be calm. Drive away your restlessness.
Your sufferings have come to an end.
Whoever climbs the steps of this Masjid,
no matter how great their pain may be,
their troubles depart and happiness dawns.
This Fakir is overflowing with compassion.
He will surely cure their illness.
He protects all with love and mercy.”
(Chapter 13)
“This place where you sit is Dwarkamai.
Whoever sits in her lap
is freed from suffering and anxiety.
This Masjid-Mother is exceedingly compassionate.
She is a true mother to the humble and devoted.
She saves them from dangers.
All troubles dissolve for those who take refuge in her lap.
Whoever rests in her shade is filled with joy.”
(Chapter 22)
“Do not fear. Do not worry at all.
This compassionate Fakir will surely protect you.
Go home and sit quietly.
Do not step outside.
Place your faith in me.
Be fearless. Be at peace.”
(Chapter 23)
“Whoever comes to this Masjid
will not suffer from illness in this very life.
Remain at ease.
Apply the sacred Udi to the wound.
Within a week it will heal.
Have faith in God.
This is not merely a Masjid—it is Dwarka itself.
Whoever steps here attains health and happiness.
Their troubles are crossed over.”
(Chapter 34)
“These feet are aged and sacred.
Your sufferings have now ended.
Place your faith in me alone.
Your heart’s deepest wish shall be fulfilled.”
(Chapter 48)
Amma Odi – Devotional Song
At last I have found
the Mother’s lap —
It is Dwarkamai,
yes, Dwarkamai,
the remover of all distress.
The first step of my journey,
the first word of my speech,
the shrine that listens to my every call —
that is Dwarkamai.
(I have found the Mother’s lap)
The Gurukul of the Divine Master,
the Gokulam of the Eternal Child,
resplendent with rows of sacred lamps —
that is Dwarkamai.
(I have found the Mother’s lap)
A palace fit for emperors,
the beauty of the King of Yogis,
radiant with the power of a million suns —
that is Dwarkamai.
(I have found the Mother’s lap)
The abode of Sai’s divine splendor,
the destroyer of illusion and delusion,
the protector of all worlds —
that is Dwarkamai.
(I have found the Mother’s lap)
Prayer
May Sri Sai’s rays of compassion
spread over all beings.
May everyone be blessed with peace, health, and auspiciousness.
Om Sai Sri Sai Jaya Jaya Sai 🌸🙏



Bow to Sri Sai, the most compassionate and loving Mother!
ReplyDelete