బాబా మాటలు
శ్రీసాయినాథాయనమః
బాబా మాటలు
"...సరే, యిట్లు చేయుడు. పిండిని తీసికొనిపోయి గ్రామపు సరిహద్దులుపైని చల్లుడు." అ : 1
" జ్ఞానోదయమునకుగాని, ఆత్మసాక్షాత్కారానికిగాని మొట్టమొదట పాపములను, కోరికలను తుడిచి వేయవలెను." అ : 1
వాడు నిమిత్తమాత్రుడే,వాని యహంకారము పూర్తిగా పడిపోయినపిమ్మట, నేను వాని మనస్సులో ప్రవేశించి నా చరిత్రను నేనే వ్రాసికొందును. నా కథలు బోధలు విన్న భక్తులకు భక్తి విశ్వాసములు కుదురును. అధ్యాయము 2
నేను చేత కలము పట్టుకొనగనే
సాయిబాబా నా యహంకారమును పరిహరించి
, వారి కథలను వారే వ్రాసికొనిరి.
ఈ గ్రంధము రచించిన
గౌరవము సాయిబాబాకే చెందునుగాని నాకు గాదు. భగవంతుని
అనుగ్రహము మూగవానిని మాట్లాడజేయును, కుంటివానిని పర్వతము దాటించును. సచ్చరితామృతము
వ్రాయుట, తయారు చేయుట బాబాయొక్క
కటాక్షము చేతనే సిద్ధించినవి. నేను
నిమిత్తమాత్రుడుగనే యుంటిని. అధ్యాయము
3
"మీరెక్కడున్ననూ
, ఏమి చేయుచున్ననూ నాకుతెలియునని బాగుగా జ్ఞాపకముంచుకొనునుడు. నీనందరి హృదయముల
పాలించు వాడను. అందరి హృదయములలో
నివసించువాడను. నేనుప్రపంచమందుగల చరాచర జీవకోటి నావరించి
యున్నాను . ఈ జగత్తును నడిపించువాడను
, సూత్రధారిని నేనే ". అధ్యాయము 3
సాయిబాబాకు
భగవన్నామ స్మరణయందును , సంకీర్తనమందును మిక్కిలి ప్రీతి. నామ సప్తాహానంతరము
కాకాకు విఠలు దర్శనము . అధ్యాయము 4
అది తమ గురుస్థానమనియు , వారి సమాధి యచ్చట గలదు గావున దానిని కాపాడ వలయుననియు చెప్పెను. అశ్వత్థ ఉదుంబర వృక్షములవలె నీ వేపచెట్టును పవిత్రముగా చూచుకొనుచు బాబా ప్రేమించువాడు. అధ్యాయము 5
బాబా యా పాదుకలను స్పృశించి, అవి భగవంతుని పాదుకులని నుడివెను. వానిని వేపచెట్టు మూలమున ప్రతిష్టింపుడని యాదేశించెను. అధ్యాయము 5
"నేను
వేదపురాణాది సద్గ్రంధములు చదువునప్పుడు నా సద్గురుమూర్తియే యడుగడుగునకు
జ్ఞప్తికి వచ్చుచుండును; నాసద్గురువైన శ్రీసాయిబాబాయే శ్రీరాముడుగా,శ్రీకృష్ణుడుగా నా ముందు నిలిచి,
తన లీలలను తానే వినిపింప
జేయునట్లు తోచును. నేను భాగవత
పారాయణకు పూనుకొనగనే శ్రీసాయి యాపాదమస్తకము కృష్ణునివలె గాన్పించును. భాగవతమో , ఉద్ధవగీతయో తామే పాడుచున్నట్లుగ అనిపించును.
ఎవరితోనైన సంభాషించునప్పుడు సాయిబాబా కథలే ఉదాహరణములుగా నిచ్చుటకు
జ్ఞప్తికివచ్చును. నాకై నెను ఏదైన వ్రాయతలపెట్టినచో, యొకమాటగాని
వాక్యముగాని వ్రాయుటకు రాదు. వారి యాశీర్వాదము
లభించిన వెంటనే రచనా ధార యంతులేనట్లు
సాగును." రచయిత హేమద్పంత్. అధ్యాయము
6
" నా భక్తుని యింటిలో అన్నవస్త్రములకు ఎప్పుడూ లోటుండదు. నాయందే మనస్సు నిలిపి , భక్తిశ్రద్ధలతో మనఃపూర్వకముగా నన్నేయారాధించువారి యోగక్షేమములను నేను జూచెదను. ఎల్లప్పుడును నన్నే జ్ఞప్తియందుంచుకొనుము." సాయిబాబా. అధ్యాయము 6
బాబా వారితో కలసి నవ్వుచూ,
సంభాషించుచూ సంచరించుచున్నప్పటికీ, వారినాలుకపై "అల్లామాలిక్ " యను మాట యెప్పుడూ
నాట్యమాడుచుండెడిది. అధ్యాయము 7
మానవదేహముతో సంచరించుచున్నప్పటికీ,
వారిచర్యలను బట్టి జూడ వారు
సాక్షాత్తు భగవంతుడనియే చెప్పవలెను. వారిని జూచిన వారందరు
వారు షిరిడీలో వెలసిన భగవంతుడనియే యనుకొనుచుండిరి. అధ్యాయము
7
బాబాను దర్శించిన మాత్రమున ప్రజలు శుభములు పొందేవారు. రోగులు ఆరోగ్యవంతు లగుచుండిరి. దుర్మార్గులు సన్మార్గులుగా మారుచుండిరి. అనేకులకు కోరికలు నెరవేరుచుండెను. అధ్యాయము 7
"బిడ్డ మండుచున్న కొలిమిలొ బడెను. వెంటనే నాచేతిని కొలిమిలోనికి దూర్చి ఆ బిడ్డను రక్షించితిని. నా చేయి కాలితే కాలినది. అది నాకంత బాధాకరము కాదు. కానీ బిడ్డ రక్షింపబడుట నాకానందము కలుగజేయుచున్నది." సాయిబాబా. అధ్యాయము 7
చంకలో కోడిగుడ్లంత పరిమాణముగల నాలుగు ప్లేగు పొక్కులను జూపుచు, " నా భక్తులకొరకు నే నెట్లు బాధపడెదనో చూడుము. వారికష్టములన్నియు నావే!" . సాయిబాబా. అధ్యాయము 7
"మన
నలుగురము కలసి భజన చేసెదము.
పండరీ ద్వారములు తెరచినారు. కనుక ఆనందముగా పాడెదము
లెండు!" నానాసాహెబు పండరి వెడలునప్పుడు బాబా
పక్కవారలతో చెప్పిన
మాటలు. అధ్యాయము 7
"శ్రద్ధా
భక్తులతో ఎవ్వరేని పత్రముగాని పుష్పముగాని ఫలముగాని లేదా నీరుగాని యర్పించినచో
దానిని నేను గ్రహించెదను" (భగవద్గీత
9అ 26శ్లో)
అధ్యాయము 9
" తల్లి!
ఏమయిన తినవలెనను ఉద్దేశముతో బాంద్రాలో మీ యింటికి పోయినాను
. తలుపు తాళము వేసియుండెను. ఎలాగుననో
లోపల ప్రవేశించితిని . కాని అక్కడ తినుట
కేమి లేకపోవుటచే తిరిగి వచ్చితిని" బాబా
ఆత్మారాము తార్ఖడు భార్యతో: అధ్యాయము 9
"నీవు
ఇంటివద్ద బయలు దేరునప్పుడు ఆత్మారాముని
భార్య నాకొరకు నీ చేతికి
మిఠాయి ఇవ్వలేదా?" గోవింద్
బలరాం మాన్కర్ తో బాబా: అధ్యాయము
9
"నా భక్తులు నన్నెటుల భావింతురో, నేను వారి నావిధముగనే అనుగ్రహింతును." అధ్యాయము 9 (గీతావాక్యము 4-11)
"తల్లీ!
నాకు కడుపునిండ గొంతువరకు భోజనము పెట్టినావు. నా
జీవశక్తులు సంతుష్టి చెందినవి." బాబా
ఆత్మారాము తార్ఖడు భార్యతో: అధ్యాయము 9
శిరిడీ
స్త్రీలు పామరులైనప్పటికి, వారికున్న స్వల్ప భాషా జ్ఞానముతోనే
ప్రేమతో బాబాపై పాటలను కూర్చుకొనిపాడుకొను చుండిరి. వారికీ అక్షరజ్ఞానము
శూన్యమైనప్పటికి వారిపాటలలో నిజమైన కవిత్వము గానవచ్చును.
యదార్ధమైన కవిత్వము పాండిత్యమువల్ల రాదు. అది యసలైన
ప్రేమవలన వెలువడును. అధ్యాయము 10
" బానిసలకు బానిసనగు నేను మీకు ఋణగ్రస్తుడను. మీ పాదములు దర్శించుట నా భాగ్యము." అధ్యాయము 10
మీ మనస్సును సాయిబాబా కర్పింపుడు , వారి కథలు వినుడు. వారు తప్పక మనల అనుగ్రహించగలరు. మన పూర్వజన్మ సుకృతముచే మనకు సాయిబాబా పాదముల నాశ్రయించు భాగ్యము లభించినది. అధ్యాయము 10
వర్ణింపనలవికాని
సచ్చిదానంద స్వరూపము షిరిడీలో సాయిబాబా రూపమున అవతరించెను. అధ్యాయము
11
అతని నిష్కల్మష భక్తి నన్ను కట్టిపడవేసినది . డాక్టరు పండితుగూర్చి బాబా; అధ్యాయము 11
" నేనెప్పుడూ మీ యోగక్షేమములనే అపేక్షించెదను. నేను మీ సేవకుడను. నేనెప్పుడూ మీ వెంటనే యుండి పిలిచిన పలుకుతాను. నేనెప్పుడూ కోరేది మీ ప్రేమను మాత్రమే!" అధ్యాయము 11
" అల్లా యొప్పుకొననిచో నేనేమి చేయగలను? అల్లా మియ్యా కటాక్షము లేనిచో యీ మసీదులో పదము పెట్టగలుగు వారెవ్వరు? హాజీ సిద్దిఖ్ ఫాల్కే గూర్చి అ:11
" ఆగు, నీ తీవ్రతను తగ్గించు, నెమ్మదించు."; " దిగు దిగు శాంతించుము" బాబా తుఫాను,ధునిమంటల నియంత్రించుట; అ : 11
వారి ఇచ్ఛ లేనిదే భక్తులు
వారివద్దకు రాలేకుండిరి. వారివంతు రానిదే వారు బాబాను
స్మరించువారు కారు, వారిలీలలు ఎరుగుట
కూడా తటస్తించదు. ఎవ్వరును తమ యిష్టానుసారము
షిరిడీ పోలేకుండిరి, బాబా యాజ్ఞ వరకే
షిరిడీలో నుండగలిగిరి. కాబట్టి సర్వము బాబా
ఇష్టము పైననే ఆధారపడి యుండెను. అ
: 12
"గేరు
తయారుగ నుంచుడు. ఈనాడు కాషాయ వస్త్రమును
ధరించెదను." అ
:12
తన ఇష్టదైవమగు శ్రీరాముడు ఆ గద్దెపై గాన్పించుటచే
వారిపాదములపైబడి నమస్కార మొనర్చితినని డాక్టరు
బదులిడెను. అ :12
" ఎల్లప్పుడు
సాయి సాయి యని స్మరించుచుండిన
సప్తసముద్రములు దాటించెదను. పూజా తంతుతో నాకు
పనిలేదు. షోడశోపచారములు గాని అష్టాంగయోగములుగాని నాకు
అవసరము లేదు. భక్తియున్నచోటనే నా
నివాసము. " అ
:13
"... నీ కష్టములు గట్టెక్కినవి.
ఎంతటి పీడ, బాధలున్నవారలైనను ఎప్పుడైతే
ఈ మశీదు మెట్లెక్కుదురో
వారికష్టములన్నియు నిష్క్రమించి సంతోషమునకు దారి తీయును. ఇచ్చటి
ఫకీరు మిక్కిలి దయార్ద్ర హృదయుడు. వారీ రోగమును తప్పక
బాగుచేయును." అ
: 13
ప్రతినిత్యము సాయిలీలలు వినినచో, నీవు శ్రీసాయిని చూడగలవు. నీ మనస్సున వారిని రాత్రింబవళ్లు జ్ఞప్తియందుంచుకొనుము. అ :13
" దిగులు
పడకు! నీ కీడు రోజులు
ముగిసినవి. అల్లా నీ మనస్సులోని
కోరిక నెరవేర్చును."
బాబా రతంజీ వాడియాతో అ : 14
" నీ
అతిథికి టీ కప్పులలో విరివిగా
చక్కెర వేసి యిమ్ము!" జోగ్
తో బాబా అ
: 15
" నా ముందర భక్తితో మీరు చేతులు చాచినచో వెంటనే రాత్రింబవళ్లు మీ చెంతనే యుండెదను. నా దేహము నిచ్చట నున్నప్పటికి సప్తసముద్రముల కవ్వల మీరు చేయుచున్న పనులు నాకు తెలియును. ప్రపంచమున మీకిచ్చవచ్చిన చోటుకు పోవుడు. నేను మీ చెంతనే యుండెదను." అ : 15
"నీ
పేరాసను, లోభమును పూర్తిగా వదలనంతవరకు
నీవు నిజమైన బ్రహ్మమును చూడలేవు.
ఎవరి మనస్సు ధనమందు సంతానమందు
ఐశ్వర్యమందు లగ్నమైయున్నదో , వాడా యభిమానమును పోగొట్టుకోనంతవరకు
బ్రహ్మము నెట్లు పొందగలడు? పేరాసయు
బ్రహ్మజ్ఞానమును ఉత్తర దక్షిణ ధ్రువముల
వంటివి. "
ధనికునితో
బాబా. అ
: 16-17
భక్తుల
మనసులలో నుండెడి యాలోచనలన్నియు బాబా
గ్రహించెడివారు. అంతియేగాక, చెడ్డయాలోచనల నణచుచు , మంచి యాలోచనల ప్రోత్సహించువారు.
హేమాద్రిపంతు మనస్సును కనిపెట్టి బాబా వానిని వెంటనే
లేపి, శ్యామావద్దకు పోయి అతనివద్దనుండి 15 రూపాయలు
దక్షిణ తీసుకొని , అతనితో కొంతసేపు మాట్లాడిన
పిమ్మట రమ్మనెను. అ : 18-19
భక్తుడెంత మనోనిశ్చయముతో పట్టుదలతో నుండునో, బాబా యంత త్వరగా వానికి సహాయపడును. ఒక్కొక్కప్పుడు బాబా భక్తులను కఠిన పరీక్ష చేసిన పిమ్మట వారికి ఉపదేశము నిచ్చును. అ : 18-19
" రాత్రింబవళ్లు
నిద్రాహారములు లేక నేను వారివైపు
దృష్టిని నిగిడ్చితిని. వారిని చూడనిచో నాకు
శాంతి లేకుండెను. వారిధ్యానము వారిసేవ తప్ప నాకింకొకటి
లేకుండెను. వారే నాయాశ్రమము. నా
మనస్సు ఎల్లప్పుడు వారియందే నాటుకొని యుండెడిది. ఇదియే వారడిగిన దక్షిణలో
ఒక పైస. సంతోష స్తైర్యములతో
గూడిన ఓరిమి " సబూరి" యనునది రెండవ పైసా.
" అ
: 18-19
" తాబేలు తన పిల్లలను కేవలము తన దృష్టితో పెంచునట్లు , నన్నుగూడ మాగురువు తమ దృష్టిచేతనే పోషించుచుండెడి వారు. ఓ తల్లీ ! నాగురువు నాకు మంత్రమేమియు నుపదేశించలేదు. నీ ఆలోచనలు, నీవు చేయు పనులు నాకొరకే వినియోగించుము. నా వైపు సంపూర్ణ హృదయముతో చూడుము. నేను నీ వైపు అట్లనే చూచెదను. " భక్తురాలు రాధాబాయితో బాబా అ : 18-19
" సదా
నా నిరాకార స్వభావమును ధ్యానింపుము.
మీరిది చేయలేనిచో రాత్రింబవళ్లు మీరు చూచుచున్న నాయీ
యాకారమును ధ్యానించుడు." అ
: 18-19
" ఏదైన
సంబంధముండనిదే యొకరు ఇంకొకరివద్దకు పోరు.
ఎవరుగాని ఎట్టిజంతువుగాని నీవద్దకు వచ్చినచో నిర్దాక్షిణ్యముగా వానిని తరిమివేయకుము. దాహము
గలవారికి నీరు, ఆకలిగొన్నవారికి అన్నము,
బట్టలులేనివారికి బట్టలు, నీయింటి వసారా
ఇతరుల విశ్రాంతికి వినియోగించినచో నిశ్చయముగా
భగవంతుడు ప్రీతి చెందును. ఋణానుబంధముచే
మనమందరము కలసితిమి. " అ
: 18-19
భక్తిప్రేమలచే
వారికి సర్వస్య శరణాగతి చేసినచో
వారు నీకు సహాయ పడెదరు.
సద్విచారముల ప్రోత్సహించెదరు. గురువారమంతయు రామస్మరణ చేయ దలచిన హేమాద్రిపంతు
మసీదులో ఎకనాథ్ మహారాజ్ రచించిన
" గురుకృపాంజను పాయో" యను ఓ
చక్కని పాటను వినెను. అ
: 18-19
" ఎంత ఆనందముగా నీవు సాటిసోదరుని తిట్టు చున్నావు? ఎంతోపుణ్యము జేయగ నీకీ మానవజన్మ లభించినది. ఇట్లు చేసినచో శిరిడీ దర్శనము నీకుతోడ్పడునా ?" అ : 18-19
బాబా ఉపదేశములకు పరిమితిలేదు.
వివిధ భక్తులకు వివిధ మార్గముల సూచించిరి.
కొందరికి స్వయముగా ఉపదేశము నిచ్చువారు. కొందరికి
స్వప్నములో నిచ్చేవారు. అ
: 18-19
ఒకరి కష్టము నింకొకరుంచుకోరాదు. కష్టపడువాని కూలి దాతృత్వముతోను ధారాళముగనివ్వవలెను. అ : 18-19
" తొందర
పడవద్దు. ఆ విషయములో ఎట్టికష్టమును
లేదు. తిరుగుప్రయాణములో విలేపార్లేలోని కాకాసాహెబు దీక్షితుని పనిపిల్ల సందేహమును తీర్చును." అ
: 20
" ఇచ్చటి
మార్గము అప్పా బోధించు నీతులంత
సులభముకాదు. నాన్ హేఘాట్ ఎనుబోతుపైన
సవారిచేయుటకంటె కష్టము! ఈఆధ్యాత్మిక మార్గము
మిగుల కఠినమైనది. దీనికి ఎంతో కృషి
అవసరము." అ
: 21
" ప్రజలెంత
టక్కరులు? వారు పాదములపై బడెదరు.
దక్షిణ నిచ్చెదరు. కానీ, చాటున నిందించెదరు.
ఇది చిత్రము గాదా?
" అ : 21
" నీవిపుడు
కూర్చున్నదే ద్వారకామాయి.
ఎవరైతే ఆమె ఒడిలో కూర్చొనెదరో
వారిని ఆమె కష్టములనుండి, యాతురతలనుండి
తప్పించును. ఈ మసీదు తల్లి
చాల దయార్ద్ర
హృదయురాలు. ఆమె నిరాడంబర భక్తులకు
తల్లి. వారిని ఆపదలనుండి తప్పించును.
వారికి ఆనందము కలుగును. "
అ : 22
" ఈనానా
ఏమనుచున్నాడు? నీకు మరణమున్నదని చెప్పుచున్నాడు
గదా? సరే! నీవు ఏమి
భయపడనక్కరలేదు. మృత్యువు ఎట్లు చంపునో చూచెదము
గాక! " అ : 22
"భగవంతుడు
సకల జీవులందు నివసించుచున్నాడు. అవి సర్పములుగాని, తేళ్ళుగాని
కానిండు. వారియాజ్ఞయైన గాని యెవరు యెవరినీ
యేమి చేయలేరు. కాబట్టి మనము కనికరించి
అన్నిజీవులను ప్రేమించవలెను. " అ
: 22
" నానా
ఎవరికైతే ఉల్లిని జీర్ణించుకొను శక్తి
కలదో వారే దానిని తినవలెను." అ
: 23
" ఓరి పిరికి
పురోహితుడా! పైకెక్కవద్దు! ఎక్కితివో ఏమగునో చూడు. పో,
వెడలిపొమ్ము, దిగువకు పొమ్ము."
అ : 23
" ఏమి
యాలోచించుచుంటివి? నరుకుము!" అ : 23
" నీ
అమృతము వంటి పలుకే మాకు
చట్టము. మాకింకొక చట్టమేమియు తెలియదు. నిన్నే యెల్లప్పుడు జ్ఞప్తియందుంచుకొనెదము.
మీ రూపమును ధ్యానించుచు రాత్రింబవళ్లు
నీ యాజ్ఞలు పాటింతుము. అది
ఉచితమా? కాదా?
యనునది మాకు తెలియదు. దానిని
మేము విచారించము. అది సరియైనదా కాదా?
యని వాదించము. తర్కించము. గురువు ఆజ్ఞ అక్షరాల
పాటించుటయే మా విధి. మా
ధర్మము." అ
: 23
" అన్నాసాహెబుకు
తానొక్కడే తిను దుర్గుణమొకటి కలదు.
ఈనాడు సంతరోజు, శనగలు తినుచు ఇక్కడకు
వచ్చినాడు. వాని నైజము నాకు
తెలియును. ఈ శనగలే దానికి
నిదర్శనము. ఈ విషయములో నేమి
యాశ్చ్యర్యమున్నది?" అ
: 24
" కాని
నీవు తినుటకు ముందు నన్ను స్మరింతువా? నేనెల్లప్పుడు
నీ చెంత లేనా? నీవేదైనా
తినుటకు ముందు నా కర్పించు
చున్నావా? అ
: 24
మొదట భగవంతునికి అర్పించి ఆ భుక్త శేషమునే
మనము అనుభవించవలెను. అ
: 24
" దేవా!
నీవిక్కడనే ప్రశాంతముగా కూర్చొని, భక్తుల నాందోళనపాలు చేసెదవు.
వారు వ్యాకులులగుటతో, వారి నిచట కీడ్చుకొని
వచ్చెదవు. " అ
: 25
" సేటుకు
పిచ్చి యెత్తినది. అతని గృహమందేలోటు లేదని
వ్రాయుము. తనకున్న సగము రొట్టెతో
సంతుష్టి చెందుమని వ్రాయుము. లక్షలార్జించుటకు ఆయాసపడవద్దని చెప్పుము. " అ
: 25
" సమాధి
చెందినప్పటికి నా సమాధిలోనుంచి నా
యెముకలు మాట్లాడును. మీ క్షేమమును కనుగొను
చుండును. అవి మీకు ధైర్యమును
విశ్వాసమును కలిగించును. మనఃపూర్వకముగ నన్ను శరణుజొచ్చినవారితో నా
సమాధికూడ మాట్లాడును. వారనెన్నంటి కదలును. నేను మీవద్ద
నుండనేమోయని మీరాందోళన పడవద్దు. ఎల్లప్పుడు నన్నే జ్ఞప్తియందుంచుకొనుడు. అప్పుడే మీరు
మిక్కిలి మేలు పొందెదరు."
అ : 25
" మామిడిచెట్ల
వయిపు పూతపూసియున్నప్పుడు చూడుము. పువ్వులన్నియు పండ్లు
అయినచో , నెంత మంచి పంట
యగును? కాని యట్లు జరుగునా?
" అ : 25
" ఎక్కడైనను
నెప్పుడైనను నాగురించి చింతించినచో నేనక్కడనే యుండెదను." దాముతో బాబా. అ : 25
" మా
శరీరమును మనస్సును నీ స్వాధీన మందుంచుకొనుచు
నీ యిష్టము వచ్చినటుల చేయుము.
మా చెంచెల మనస్సు నీ
పాదముల చెంత విశ్రాంతి పొందుగాక.
" అ : 26
" ఏమైనను
కానిండు. పట్టు విడువరాదు. నీ
గురునియందే యాశ్రయము నిలుపుము." అ
: 26
" బాపూ
! అంతకుముందు 2 రూపాయ లిచ్చియుంటిని. ఇప్పుడు
3 రూపాయలిచ్చుచున్నాను. వీనిని మీ పూజామందిరములో
బెట్టుకొని పూజింపుము. నీవు మేలు పొందెదవు.
" అ
: 26
" గతజన్మ
పాపపుణ్యములను నీవు అనుభవించక తప్పదు.
కర్మానుభవము పూర్తి కాకున్నచో ప్రాణత్యాగము
నీకు తోడ్పడదు. నీవింకొక జన్మమెత్తి బాధ అనుభవింపవలెను. చచ్చుటకు
ముందు కొంతకాలమేల నీ కర్మ ననుభవించరాదు." అ
: 26
" ఓ
రామదాసీ! ఎందులకు చికాకు పడుచున్నావు?
శ్యామా మనవాడు కాడా? నీ
వా పుస్తకమును అంతగా నభిలషించుట వింతగా
నున్నది. నిజమైన రామదాసికి మమతకాక
సమత యుండవలెను." అ : 27
" గతజన్మలో
నీమె ఒక వర్తకుని యావు.
తరువాత క్రమముగ జన్మలెత్తి తుదకు
ఒక బ్రాహ్మణుని కుటుంబములో జన్మించెను. కావున ఆమె పళ్ళెమునుండి
యింకను కొన్ని ప్రేమయుతమగు ముద్దలను
తీసుకొననిండు." అ : 27
" రాజారామ్ యను మంత్రమును ఎల్లప్పుడు
జపించుము. నీవిట్లు చేసినచో నీ
వితాశయమును
పొందెదవు. నీకు మేలగును." అ
: 27
" నా
మనుష్యుడు ఎంత దూరమున నున్నప్పటికి,
1000 క్రోసుల దూరమునున్నప్పటికి పిచ్చుక కాళ్లకు
దారము కట్టి యీడ్చినటుల అతనిని
షిరిడీకి లాగెదను." అ : 28
" టక్కరివాడు!
దారిలో భజన చేయును. నన్నుగూర్చి
ఇతరులను విచారించు చుండును.
ఇతరుల నడుగనేల? " అ : 28
" ఓ
మేఘా! ఈచిన్న యుపకారము చేసి
పెట్టుము. శరీరమునకు తల ముఖ్యము. కావున
తలపైనే నీళ్లు పోయుము." అ
: 28
" ప్రవేశించుటకు
నాకు వాకిలి అవసరములేదు. నాకు
రూపము లేదు. నేనన్నిచోట్ల నివసించుచున్నాను.
ఎవరైతే నన్నే నమ్మి నా
ధ్యానమునందే మునిగియుందురో వారిపనులన్నియు సూత్రధారియై నేనే నడిపించెదను." అ
: 28
" చూడు
శంకరుడు వచ్చినాడు. జాగ్రత్తగా పూజింపుము. " అ : 28
" ఆమెకు
బాబా శ్రీరామునివలే గాన్పించెను. కాని ఇతరులకు మామూలు
సాయినాథునివలె గాన్పించెను. అ : 29
" నాయందు
నమ్మకముంచి జాతకములు, వాని ఫలితములు, సాముద్రిక
శాస్త్రముల పలుకు లొక ప్రక్కకు
ద్రోసి తనపాఠముల చదువుకొనుమని చెప్పుము. తప్పక ఉత్తీర్ణుడగును. " అ
: 29
ఇతరులు
మనలను విడిచిపెట్టినప్పటికి బాబా మాత్రము మనలను
విడువడు. వారి కృపకు పాత్రులైనవారు
కావలసినంత శక్తి , జ్ఞానము, నిత్యానిత్య
వివేకములను పొందెదరు. మా తప్పులన్నియు క్షమించి
సాయి మా యారాటము లన్నియు
బాపుగాక. అ
: 30
ఈ కథలను చదువుటకు కావలిసినది
యంతులేని ప్రేమ, భక్తి, వివాదము
కాదు. అ : 30
యోగి సంకల్పించనిదే వారిని చూడగలుగు వారెవరు? అతని ఆజ్ఞలేక చెట్టు ఆకు గూడ కదలదు. అ : 30
" మీరెవ్వరు
? ఎచటినుండి వచ్చినా " రని కాకాజీ యడిగెను.
" మాది షిరిడీ, నేను సప్తశృంగికి
మ్రొక్కు చెల్లించుట కిక్కడకు వచ్చినా" నని శ్యామా యనెను.
అ : 30
" ఏమి
ఈ అద్భుత శక్తి!
బాబా ఏమియు పలుకలేదు. ఉత్తరప్రత్యుత్తరములు
కూడ జరుగలేదు. ఆశీర్వచనములనైన పలుకలేదు. కేవలము వారి దర్శనమే
సంతోషమునకు కారణమయ్యెను. " కాకాజీ వైద్య ; అ : 30
బాబా స్వప్నములకు కాలనియమము లేదు. పగటి స్వప్నములో
కుశాల్చందును షిరిడీకి రమ్మనిరి. అ : 30
ఎవరినైనను
మనము పిలిచినచో వచ్చువారికొరకు కావలిసినవన్నియు మనము సమకూర్చెదము. పంజాబీ
రామలాల్, బాబాను స్వప్నమందు గని
, దుకాణములో
బాబా ఫోటో జూసి, షిరిడీకి
వెళ్లి అచ్చటనే తన యంత్యకాలమువరకుండెను. అ
: 30
" ఈ
పనికిమాలిన సన్యాసిని తరిమి వేయుడు "
బాబా; అ
: 31
" కోరికలు
లేనివాడవై రేపటినుండి భాగవతమును పారాయణము చేయుము." బాబా; అ
: 31
" నీ
చంచల మనస్సు నిలకడకై నిన్నిచటకు
బంపితిని. నీ విచట జూచిన
నా రూపము షిరిడీలో జూసిన
నా రూపముతో సమానముగనున్నదో లేదో
నిర్ధారింపుము. " బాబా ; అ : 31
" అయ్యో!
తాత్యా మనకంటె ముందు వెళ్లిపోయెను.
అతనికి పునర్జన్మ లేదు." బాబా; అ : 31
" అడవుల
సంగతులు పూర్తిగా తెలియకుండ మీ ఇష్టము వచ్చినట్లు
తిరుగరాదు. అడవులలో సంచరించినచో మీవెంట
ఓ మార్గదర్శి యుండియే
తీరవలెను. భోజనముజేసి నీరు త్రాగండి."
బంజారా; అ : 32
" మీతెలివి
తేటలపై ఆధారపడి దారి తప్పితిరి.
చిన్నదానికిగాని పెద్దదానికిగాని సరియైన మార్గము జూపుటకొక
మార్గదర్శి యుండియే తీరవలెను. ఉత్తికడుపుతో
అన్వేషణము జయప్రదము కాదు." బంజారా; అ : 32
" నాతో
వచ్చుట కిష్టపడెదరా? మీకు కావలసినదేదో నేను
జూపెదను. నాయందు విశ్వాసమున్నవారికే జయము
గల్గును." బాబా
గురువు ; అ : 32
" తల్లిపక్షి
పిల్లపక్షులను జాగ్రత్తగా జూచునట్లు నన్ను వారు కాపాడిరి."
అ : 32
" నాగురువే
నాకు సమస్తముగా దోచు చుండెను. నా
యిల్లు నా ఆస్థి నా తల్లిదండ్రులు అంతయు
వారే. నా ఇంద్రియములన్నియు తమతమ
స్థానముల విడచి, నా కండ్లయందు
కేంద్రీకృతమయ్యెను; నా ద్రుష్టి గురువునందు
కేంద్రీకృతమయ్యెను. నా ధ్యానమంతము నా
గురువుపైననే నిల్పితిని." అ : 32
" ఉపవాసము
చేయవలసిన యవసరమేమి? దాదాభట్టు ఇంటికి పోయి బొబ్బట్లు
చేసి అతనికి పిల్లకు బెట్టి
నీవు కూడ తినుము." అ
: 32
" నా
సర్కారుయొక్క ఖజానా నిండుగా నున్నది.
త్రవ్వి ఈధనమును బండ్లతో తీసుకపొండు.
సుపుత్రుడైనవాడు ఈ ద్రవ్యమునంతను దాచుకొన
వలెను." అ
: 32
" నేనెక్కడికో
పోయెదను. మాయ నన్ను మిగుల
బాధించుచున్నది. ఐనప్పటికీ నావారికొరకు నేనుఆతురపడెదను." అ
: 32
నారాయణ మోతిరాం
జానీ, ఊది రాసిన చేయి తీసివేయగనే నొప్పి
తగ్గిపోయెను. అ : 33
నానాసాహెబు
తన భార్యను బిలచి ఊదిని
నీళ్లలో కలిపి కుమార్తెకిచ్చి
హారతిని పాడుమనిరి. కొద్దినిమిషములలో ప్రసవము సుఖముగా జరిగెనని
వార్త వచ్చెను. అ : 33
" శరీరమున్నన్నాళ్లు
బాబా బ్రతికి యుండిరా? శరీరము
పోయినదిగాన చనిపోయినారా? లేదు. ఎల్లప్పుడు జీవించియే
యున్నారు. బాబానొకసారి హృదయపూర్వకముగా ప్రేమించినచో వారెల్లప్పుడు మన ప్రక్కనే యుందురు." అ
: 33
" నేనీతనని
నాలుగు సంవత్సరములనుండి ఎరుగుదును." అనిరి. తీవ్రముగా ఆలోచించగా
బాలబువ సుతార్ కు, 4 సంవత్సరముల క్రిందట తాను బాబాఫోటోకు నమస్కరించినటుల జ్ఞప్తికి వచ్చెను. అ : 33
ఫకీరు అప్పాసాహెబు కులకర్ణి నుండి పదిరూపాయల నోటు
పుచ్చుకొని, తొమ్మిదిరూపాయలు తిరిగి ఇచ్చివేసి యక్కడినుండి
వెడలెను. అ : 33
యోగేశ్వరులందరు
ఏకాత్మభావముతో కార్యము లొనర్తురు. హరిభావ్
కర్ణిక్ నుండి నరసింగ మహరాజ్
రూపాయి దక్షిణ పొందిరి. అ
: 33
" ఎవరయితే
ఈ మసీదుకు వచ్చెదరో
వారెన్నడు ఈజన్మలో ఏ వ్యాధిచేతను
బాధపడరు." బాబా; అ : 34
" ఇంకను
నన్ను నమ్మవా? " డాక్టరుకు
3 రాత్రులు కంఠధ్వని వినిపించెను. అ : 34
" అతడేల
పది జన్మలవరకు బాధపడవలెను? పదిరోజులలో గతజన్మ పాపమును హరింపజేయగలను.
" అ
: 34
" మన
కష్టసుఖములకు మన
కర్మయే కారణము. అల్లాయే ఆర్చి
తీర్చువాడు. వాని నెల్లప్పుడు ధ్యానించుడు.
అతడే నీ క్షేమమును జూచును."
అ : 34
" దేవా!
ఏమి నీ యాట! మొట్టమొదట
తుఫానులేపి మాకు అశాంతి కలుగజేసెదవు.
తిరిగి దాని శాంతింపజేసి మాకు
నెమ్మది ప్రసాదింతువు." శ్యామా బాబాతో ; అ
: 34
" ఇది
తప్పనిసరిగా మా తండ్రి కంఠమే"
కాకామహాజని స్నేహితుడు పలికి, వెంటనే మసీదు
లోపలికివెళ్ళి, తన మనోనిశ్చయమును మరచినవాడై,
బాబా పాదములకు నమస్కరించెను.
అ
: 35
బాబా
" నీకిచ్చుటకు మనమున నిష్టము లేకుండెను.
కాన నిన్నడుగలేదు. కాని , ఇప్పుడు నీకిష్టమున్నయెడల
ఇవ్వవచ్చు" ననెను. అ : 35
బాబా
" నీవు దానిని తీసివేయుము; మనకు
మధ్యనున్న యడ్డును తీసివేయుము. అప్పుడు
మన మోకరికొకరు
ముఖాముఖి చూచుకొనగలము, కలిసికొన గలము!" అ
: 35
బాబా తన మనస్సును గనిపెట్టి
గింజలుగల ద్రాక్షపళ్ళను గింజలులేనివానిగా మార్చివేసెను. ఏమి ఆశ్చ్యర్యకరమైన శక్తి!
కాకామహాజని యజమాని; అ : 35
" అతని
మనస్సుకు నిలకడలేకుండెను. అతని స్థితి కనిపెట్టి
కనికరించి నేను నీ కిష్టము
వచ్చినచోట నీ నమ్మకము పాదుకొల్పుము.
ఎందుకిట్లు భ్రమించెదవు? ఒకేచోటు నాశ్రయించుకొని నిలకడగా
నుండు" మని చెప్పితిని. అ
: 35
" నేను
ఒక రూపాయి దక్షిణ ఎవరివద్దనుంచిగాని
తీసికొనినచో దానికి పదిరెట్లు ఇవ్వవలెను.
దక్షిణ యిచ్చుచున్నచో వైరాగ్యము పెరుగును. " అ
: 35
" భయపడకుము.
ఇది మనదికాదు. ఇది సాయి యాహారమే.
అన్ని పాత్రలు గుడ్డలతో పూర్తిగా
కప్పివేయుము. వానిలో కొంచెము ఊది
వేయుము. గుడ్డ పూర్తిగా తీయకుండా
వడ్డన చేయుము. సాయి మనలను
కాపాడును." బాలాజీ నెవాస్కరు తల్లి
మాటలు. అ
: 35
తీవ్రముగా
ప్రార్ధించినచో యధా ప్రకారము ఫలితమును
పొందవచ్చును. అ
: 35
" ఇదియేమి?
ఇద్దరు కలిసి వచ్చిరి. ఒకరి
దక్షిణ యమోదించితివి. రెండవ వానిది తిరస్కరించితివి.
ఎందులకీ భేదభావం? " బాబాతో శ్యామా ; అ
: 36
" శ్యామా!
ఎందులకో నీకేమియును తెలియదు. నేనెవరివద్ద ఏమియు తీసికొనను. మసీదుమాయి
బాకీని కోరును. బాకీయున్నవాడు చెల్లించి,
ఋణవిమోచనమును పొందును. " బాబా;
అ : 36
" శ్యామా!
72 జన్మలనుంచి నీవు నాతో నున్నప్పటికి
నేను నిన్ను గిల్లలేదు. ఇన్నాళ్లకు
గిల్లగా నీకు కోపము వచ్చుచున్నది."
బాబా; అ : 36
" ఆమెకు
12 మాసములలో సంతానము
కలుగును." శ్యామాతో బాబా; అ
: 36
సాయి సముద్రము వలె గంభీరులు. పురుషులను
అన్నదమ్ములవలె, స్త్రీల అక్కచెల్లెన్డ్రవలె చూచుకొనెడివారు.
వారి సాంగత్యమున మనకు కలిగిన జ్ఞానము
మనము మరణించువరకు నిలుచుగాక!
వారి నామము నెల్లప్పుడు ప్రేమించెదము
గాక! అ
: 37
1910 డిసెంబరు
10వ తేదినుండి చావడిలో భక్తులు పూజ
హారతులు జరుప మొదలిడిరి.
అ : 37
చావడి సమయమున బాబా ముఖము
స్థిరమైన ద్విగుణీకృత ప్రకాశము తోడను, సౌందర్యము తోడను
వెలుగుచుండెను. అ
: 37
జడమగు చిలుము ధన్యమైనది. మొట్టమొదట
అది యనేక తపఃపరీక్షల కాగవలసి
వచ్చెను. తుదకు అది బాబా
ముద్దుకు హస్త స్పర్శకు నోచుకొన్నది. అ
: 37
" నన్ను
కాపాడుము. నీకిష్టమున్నచో వెళ్లుము గాని రాత్రి యొకసారి
వచ్చి నాగూర్చి కనుగొనుచుండుము." అ
: 37
" పవిత్ర
ఆత్మయను ద్రవసారమును బ్రహ్మమనెడి యచ్చులో పోయగా దానినుండి
యోగులలో నలంకారమగు సాయి వెడలెను."
అ : 38
దానములన్నిటిలో
అన్నదానమే ప్రధానమైనది. అన్నిపుణ్యములలో అన్నదానమెక్కువ. అ
: 38
బాబా తన కఫనీని పైకెత్తి
చేతిని నిర్భయముగా మరుగుచున్న డేకిసాలో బెట్టి కలుపు చుండెడివారు.
అ : 38
ఒక ఏకాదశినాడు దాదాకేల్కరుకు కొన్ని రూపాయలిచ్చి కొరాల్బాకు
పోయి మాంసము కొనితెమ్మనెను.
అ : 38
గురుసేవకు
ముఖ్యముగా కావలసినది
అక్షరాల గురు ఆజ్ఞను పాటించుటే. అ
: 38
" నా
సహవాసము ఇన్నాళ్లు చేసియు నిట్లేల చేసితివి?"
నానాతో బాబా. అ
: 38
అది యట్టి రుచి, ప్రేమ,
శక్తి గలిగిన యాహారము. అ : 38
" దాని
నంతయు త్రాగుము. నీకిక మీదట ఇట్టి
యవకాశము దొరకదు." అ
: 38
అతడు గిన్నెడు మజ్జిగను ప్రసాదముగా త్రాగెను. కాని మనకు కావలిసినంత
యమృతమును బాబా లీలల రూపముగా
నిచ్చెను. అ
: 38
షిరిడీ
నుండు స్త్రీలు ధన్యులు. బాబాయందు వారిభక్తి నిస్సంశయముగా పరిపూర్ణమైనది. బాబామహిమను వారు స్నానము చేయునప్పుడు,
విసురునప్పుడు, రుబ్బునప్పుడు, ధాన్యము
దంచునప్పుడు , తదితర గృహకృత్యములు చేయునప్పుడు
పాడుచుండెడివారు. వారి భక్తి ప్రేమలు
పావనములు. వారు చక్కని పాటలు
పాడుచుండెడివారు. అవి పాడినవారికి , విన్నవారికి
మనఃశాంతి కలుగజేయు చుండెను. అ : 39
నానాసాహెబు
చాందోర్కరు తన పాండిత్యమునకు గర్వించుచుండెను.
అ : 39
భక్తుడు
ఎగురువునైనను శ్రీకృష్ట్నునిగా భావించును.
అ : 39
గురువు
భాషాపరంగా బోధించు బోధయు అజ్ఞానమే
! అనుభవపరముగా అంతఃకరణములో కలుగజేయు జాగరణము నిజమైన
గురు బోధ. అ : 39
" బాబా
నావద్దకు వచ్చి ఒకమందిరముతో సహా
వాడాను నిర్మింపుము. నేనందరి కోర్కెలు నెరవేర్చెద
ననెను." బూటీతో శ్యామా, అ
: 39
" వాడా
పూర్తియైనపిమ్మట మనమే దానిని ఉపయోగించుకొనవలెను.
మనమందర మచ్చటనుందము.
అందరు కలసి మెలసి యాడుకొందము." అ
: 39
మురళీధరుని
కొరకు నిర్ణయించిన స్థలమునందు బాబాను సమాధి చేయుటచే
బాబాయే మురళీధరుడనియు, బూటీవాడయె సమాధిమందిరమని గ్రహింపవలెను. అ : 39
" నన్నే
గుర్తుంచుకొనువారిని నేను మరువను. నాకు
బండిగాని టాంగాగాని, రైలుగాని, విమానముగాని అవసరము లేదు. నన్ను
ప్రేమతో బిలుచువారి యొద్దకు నేను పరుగెత్తిపోయి
ప్రత్యక్షమయ్యెదను." జోగుతో బాబా అ : 40
" హా!
వాగ్దానము జేసి, దగా చేసితి
ననుచున్నాడు. ఇద్దరితో కూడ నేను సంతర్పణకు
హాజరయితిని. కాని నన్ను పోల్చు
కొనలేకపోయెనని వ్రాయుము. అట్టివాడు నన్ను పిలువనేల? " జోగుతో
బాబా అ
: 40
1917 వ
సంవత్సరము హోళీ పండుగనాడు వేకువఝామున
హేమాడ్ పంతుకు స్వప్నంలో ఆనాడు
భోజనమునకు వారింటికి వచ్చెదనని చెప్పెను. అ : 40
" భోజన
స్థలము విడిచి పెట్టి మా
వద్దకు పరుగెత్తుకొని వచ్చితివి. కావున ఇదిగో నీవస్తువును
నీవు తీసుకొనుము. ఆ తరువాత వివరించెదము." ఆలీమహమ్మద్,
మౌలానా హేమాడ్ పంత్తో అ : 40
ఆ పటమును బాబా కొరకు వేసిన పీటపయి బెట్టి వండిన పదార్ధములన్నియు వడ్డించి, నైవేద్యము పెట్టిన పిమ్మట అందరు భుజించి సకాలమున పూర్తిజేసిరి. అ : 40
" నేను
నీకు జల్తారు సెల్లా నిచ్చుటకు
ఇచట కూర్చొనియున్నాను. ఇతరుల వద్దకు పోయి
దొంగిలించెదవేల? నీకు దొంగతనమునకు అలవాటు
పడవలెనని
యున్నదా ? " దేవ్ తో బాబా అ : 41
" నీ
వాతురపడవద్దు. నీ చావు చీటి
తీసివేసితిని! త్వరలో బాగుపడెదవు కాని,
తాత్యాకోతే పాటిలుగూర్చి సంశయించుచున్నాను. అతడు 1918 వ సంవత్సరము విజయదశమినాడు
మరణించును." అ : 42
" అనవసరముగా
విచారించెదవేల? కుక్క యాకలి దీర్చుట
నా యాకలి దీర్చుటవంటిది. ఎవరైతే
ఆకలితో నున్నవారికి భోజనము పెట్టెదరో వారు
నాకు అన్నము పెట్టినట్లే! " లక్ష్మీబాయి
షిండే తో బాబా అ : 42
" ఇటుక
కాదు, నా యదృష్టమే ముక్కలు
ముక్కలుగా విరిగిపోయినది. అది నా జీవితపు
తోడునీడ. దాని సహాయమువలననే నేను
ఆత్మానుసంధానము చేయుచుండెడివాడను. ఇరోజు అది నన్ను
విడచినది." బాబా భావము అ : 43-44
" నా
శరీరమును మూడు రోజులవరకు కాపాడుము.
నేను తిరిగి వచ్చినట్లయిన సరే,
లేనియెడల నా శరీరము నేదురుగానున్న ఖాళీ స్థలములో పాతిపెట్టి
గుర్తుగా రెండు జెండాలను పాతుము." మహాల్సాపతితో
బాబా అ
: 43-44
" ఎవరైతే
నన్ను ఎక్కువగా ప్రేమించెదరో వారు ఎల్లప్పుడు నన్ను
దర్శించెదరు. నేను లేక వానికి
జగత్తంతయు శూన్యము. నా కథలు తప్ప
మరేమియు చెప్పడు. నన్నే ధ్యానము చేయును.
నా నామమునే సదా జపించును.
" బాబా
అమృతతుల్యమగు మాటలు. అ
: 43-44
ఎవరు బాబా కీర్తిని ప్రేమతో
పాడెదరో, ఎవరు దానిని భక్తితో
వినెదరో, ఉభయులును సాయితో నైక్యమగుదురు.
హేమాద్రిపంత్ అ
: అ : 43-44
ఎవరయితే వారి యదృష్టముచే బాబా వంటి యాభరణమును పొందిరో, అట్టివారు నిరాశచెంది యేడ్చుట విచారకరమైన సంగతే. వారికి బాబాయందు నిశ్చలమైన విశ్వాసమే యున్నచో, వారు నిరాశ చెందనేల? అ : 45
వేయేల! హృదయపూర్వకముగా నీగురువును ప్రేమించుము. వారిని సర్వశ్య శరణాగతి వేడుము. భక్తితో వారిపాదములకు మ్రొక్కుము. అట్లుచేసినచో సూర్యునిముందు చీకటి లేనట్లు, నీవు దాటలేని భవసాగరము లేదు. అ : 45
మంచిగాని చెడ్డగాని, ఏది మనదో యది మన దగ్గర నున్నది. ఏది యితరులదో , యది యితరులవద్ద నున్నది. అ : 45
నీవు నీశక్తి వలన నిరాడంబర భక్తుల రక్షించెదవు. అంతరికముగను, అదృశ్యముగను ఆటంతయు నాడెదవు. కాని దానితో నీకెట్టి సంబంధము లేనట్లు గనిపించెదవు. నీవే పనులన్నియును నెరవేర్చుచున్నప్పటికి ఏమియు చేయనివానివలె నటించెదవు.నీజీవితమునెవరు తెలియజాలరు. అ : 46
బాబా ఎవరైన భక్తుని ఆమోదించినచో రాత్రింబవళ్లు అతని చెంతనేయుండి , యింటివద్దనుగాని,దూరదేశమునగాని వానిని వెంబడించు చుండును. భక్తుడు తన యిష్టము వచ్చిన చోటునకు పోనిమ్ము, బాబా అచ్చటకు భక్తునికంటె ముందుగా బోయి యేదో ఒక ఊహించరాని రూపమున నుండును. అ : 46
' వీరభద్రప్పా! నీ శత్రువు చెన్నబసప్ప కప్ప జన్మమెత్తి పశ్చాత్తాపపడుట లేదా? నీవు సర్పజన్మమెత్తినప్పటికిని వానియందు శత్రుత్వము వహించు యున్నావా? ఛీ,సిగ్గులేదా! మీ ద్వేషముల విడచి శాంతింపుడు.' అ : 47
భక్తితోను ప్రేమతోను మన్ననతోను ఇచ్చిన చిన్నచిన్న మొత్తములకు దైవ మిష్టపడును. అ : 47
ఎవరికైన ఏమైన బాకియున్న దానిని తీర్చివేయవలెను. ఋణముగాని శత్రుత్వశేషముగాని యున్నచో దానికి తగిన బాధ పడవలెను. అ : 47
" ఈ పాదములు ముదుసలివి,పవిత్రమైనవి. ఇక నీకష్టములు తీరిపోయినవి. నాయందే నమ్మకముంచుము. నీ మనోభీష్టములు నెరవేరును. అ : 48
" నానా! అనవసరముగా చికాకు పడుచుంటివేల? ఇంద్రియములను వాని పనులను జేయనిమ్ము. వానిలో మనము జోక్యము కలుగజేసికొనగూడదు. .... మన హృదయము స్వచ్ఛముగా నున్నంతవరకు నేమియు దోషములేదు. అ : 49
" ఆ విషయమై నీవేమాత్రము చింతింపనవసరము లేదు. ఆ నారికేళము నా సంకల్పము ప్రకారము నీకివ్వబడెను. తుదకు దారిలో పగులగొట్టబడెను. దానికి నీవే కర్తనని యనుకొననేల? అ : 50
" గత 60 తరములనుండి మనమొండొరులము పరిచయము గళవారము." అ : 50
సాయిని జ్ఞప్తియందుంచుకొని వారి శరణు పొందినచో వారు మన కోరికలన్నిటిని నెరవేర్చి మనము జీవితపరమావధిని పొందునట్లు చేసెదరు. అ : 51
ఈభయంకర సంసారసాగరమునకు సద్గురువు నావవంటి వారు. వారు మనలను సురక్షితముగా దాటించెదరు. అ : 51
శ్రీసాయికథలను అలవోకగా విన్నను ఆధ్యాత్మికజీవితమునందు శ్రద్ధ కలుగును. అ : 51
ప్రేమతో పారాయణము చేసిన పాపములు నశించును, జనన మరణ వలయంనుండి విముక్తి కలుగును. ఇతరులకు చెప్పుటవలన కొత్తసంగతులు తెలియును, వినువారల పాపములు తొలగును. సాయిసగుణోపాసన ద్వారా ఆత్మసాక్షాత్కారానికి మార్గము దొరగును. వారము రోజుల పారాయణముచే వారి యాపదలు నశించగలవు. కోరినవారలకు ధనము లభించును. వ్యాపారము వృద్ధిచెందును. ఇవి వారి భక్తిశ్రద్ధలపై ఆధారపడియున్నవి. జ్ఞానము,ధనము,ఐశ్వర్యములు లభించును. రోజుకో అధ్యాయ పారాయణముచే యపరిమితానందము కలుగును. జాగరూకకతో పారాయణము చేయవలెను. ఈగ్రంధమును గురుపూర్ణిమ నాడు,గోకులాష్టమి నాడు,శ్రీరామనవమి నాడు,విజయదశమి నాడు ఇంటివద్ద తప్పక పారాయణము చేయవలెను, పారాయణము చేసిన వారల కోరికలన్నియు నెరవేరును. రోగులు ఆరోగ్యమును పొందెదరు. అ : 51
సాయి పదాలు , గురూజీ శరత్ బాబూజి గారు రచించిన మధుర గీతాలు.
వేయేల! హృదయపూర్వకముగా నీగురువును ప్రేమించుము. వారిని సర్వశ్య శరణాగతి వేడుము. భక్తితో వారిపాదములకు మ్రొక్కుము. అట్లుచేసినచో సూర్యునిముందు చీకటి లేనట్లు, నీవు దాటలేని భవసాగరము లేదు. అ : 45
మంచిగాని చెడ్డగాని, ఏది మనదో యది మన దగ్గర నున్నది. ఏది యితరులదో , యది యితరులవద్ద నున్నది. అ : 45
నీవు నీశక్తి వలన నిరాడంబర భక్తుల రక్షించెదవు. అంతరికముగను, అదృశ్యముగను ఆటంతయు నాడెదవు. కాని దానితో నీకెట్టి సంబంధము లేనట్లు గనిపించెదవు. నీవే పనులన్నియును నెరవేర్చుచున్నప్పటికి ఏమియు చేయనివానివలె నటించెదవు.నీజీవితమునెవరు తెలియజాలరు. అ : 46
బాబా ఎవరైన భక్తుని ఆమోదించినచో రాత్రింబవళ్లు అతని చెంతనేయుండి , యింటివద్దనుగాని,దూరదేశమునగాని వానిని వెంబడించు చుండును. భక్తుడు తన యిష్టము వచ్చిన చోటునకు పోనిమ్ము, బాబా అచ్చటకు భక్తునికంటె ముందుగా బోయి యేదో ఒక ఊహించరాని రూపమున నుండును. అ : 46
' వీరభద్రప్పా! నీ శత్రువు చెన్నబసప్ప కప్ప జన్మమెత్తి పశ్చాత్తాపపడుట లేదా? నీవు సర్పజన్మమెత్తినప్పటికిని వానియందు శత్రుత్వము వహించు యున్నావా? ఛీ,సిగ్గులేదా! మీ ద్వేషముల విడచి శాంతింపుడు.' అ : 47
ఎవరికైన ఏమైన బాకియున్న దానిని తీర్చివేయవలెను. ఋణముగాని శత్రుత్వశేషముగాని యున్నచో దానికి తగిన బాధ పడవలెను. అ : 47
" ఈ పాదములు ముదుసలివి,పవిత్రమైనవి. ఇక నీకష్టములు తీరిపోయినవి. నాయందే నమ్మకముంచుము. నీ మనోభీష్టములు నెరవేరును. అ : 48
" నానా! అనవసరముగా చికాకు పడుచుంటివేల? ఇంద్రియములను వాని పనులను జేయనిమ్ము. వానిలో మనము జోక్యము కలుగజేసికొనగూడదు. .... మన హృదయము స్వచ్ఛముగా నున్నంతవరకు నేమియు దోషములేదు. అ : 49
" ఆ విషయమై నీవేమాత్రము చింతింపనవసరము లేదు. ఆ నారికేళము నా సంకల్పము ప్రకారము నీకివ్వబడెను. తుదకు దారిలో పగులగొట్టబడెను. దానికి నీవే కర్తనని యనుకొననేల? అ : 50
" గత 60 తరములనుండి మనమొండొరులము పరిచయము గళవారము." అ : 50
సాయిని జ్ఞప్తియందుంచుకొని వారి శరణు పొందినచో వారు మన కోరికలన్నిటిని నెరవేర్చి మనము జీవితపరమావధిని పొందునట్లు చేసెదరు. అ : 51
ఈభయంకర సంసారసాగరమునకు సద్గురువు నావవంటి వారు. వారు మనలను సురక్షితముగా దాటించెదరు. అ : 51
ప్రేమతో పారాయణము చేసిన పాపములు నశించును, జనన మరణ వలయంనుండి విముక్తి కలుగును. ఇతరులకు చెప్పుటవలన కొత్తసంగతులు తెలియును, వినువారల పాపములు తొలగును. సాయిసగుణోపాసన ద్వారా ఆత్మసాక్షాత్కారానికి మార్గము దొరగును. వారము రోజుల పారాయణముచే వారి యాపదలు నశించగలవు. కోరినవారలకు ధనము లభించును. వ్యాపారము వృద్ధిచెందును. ఇవి వారి భక్తిశ్రద్ధలపై ఆధారపడియున్నవి. జ్ఞానము,ధనము,ఐశ్వర్యములు లభించును. రోజుకో అధ్యాయ పారాయణముచే యపరిమితానందము కలుగును. జాగరూకకతో పారాయణము చేయవలెను. ఈగ్రంధమును గురుపూర్ణిమ నాడు,గోకులాష్టమి నాడు,శ్రీరామనవమి నాడు,విజయదశమి నాడు ఇంటివద్ద తప్పక పారాయణము చేయవలెను, పారాయణము చేసిన వారల కోరికలన్నియు నెరవేరును. రోగులు ఆరోగ్యమును పొందెదరు. అ : 51
శ్రీసాయి కరుణాకిరణాలు అందరిపై ప్రసరించుగాక!
అందరికి శుభమగుగాక!
ఓంసాయి శ్రీసాయి జయ జయ సాయి!
ఓంసాయి శ్రీసాయి జయ జయ సాయి!
సాయి పదాలు , గురూజీ శరత్ బాబూజి గారు రచించిన మధుర గీతాలు.
ప్రాతఃదర్శనమివ్వుముసాయి
http://www.srisainathunisarathbabuji.com/audios/download/telugu/sai-padaalu/pratah-darsanamivvumu-sai.html
కలయా నిజమా ఏది భాగ్యమో
http://www.srisainathunisarathbabuji.com/audios/download/telugu/sai-padaalu/kalayaa-nijamaa-emi-bhagyamo.html
భక్తజన హృదయాబ్జ భృంగమై
ఎవరు కన్నది ఎవరు విన్నది
http://www.srisainathunisarathbabuji.com/audios/download/telugu/sai-padaalu/evaru-kannadi-evaru-vinnadi.html
Comments
Post a Comment