నీచేతి పైసను నేను!
శ్రీసాయినాథాయనమః
" దైవానుగ్రహంతొగాని మనము సాయిని జేరలేము. ప్రతిజీవి ఓ పైస. బాబా ప్రతి పైసాను శుద్ధిజేసి, ఆ...దైవానికి అప్పజెప్పాలట."
సాయి సూక్తి : ఆచార్యవాణి
సాయి సూక్తి : ఆచార్యవాణి
" నావద్దకు అన్నీ నొక్కుబోయినవి,సొట్టబోయినవి అయిన నాణెములు వస్తున్నాయి." సాయిబాబా
ద్వారకామాయిలో భోజనానంతరం సాయిబాబా భక్తులను వారివారి యిండ్లకు పంపి తరచుగా ఒక్కరే ఉండేవారు. బాబా ధ్యానస్థితిలో వేరేలోకంలోఉండేవారని తలచి అతికొద్దిమందితప్ప మిగతా భక్తులాయనను సమీపించేవారుకాదు. దాసగణుమహారాజు గారి కథనం ప్రకారం మధ్యాహ్నం 1,2 గంటల మధ్య సాయి తామొక్కరే ఉన్నపుడు తమకెదురు ఓ తెర కట్టి, వారివద్దనున్న చిన్నగుడ్డసంచినుండి పది,పదిహేను పాత నాణాలను తీసేవారు. మూడుపైసల, ఒకటి రెండు ,నాలుగు,ఎనిమిది అణాల,రూపాయి నాణాలవి. ఏమైనా మంత్రం చదివేవారో లేదోకాని , నాణాలను తమచేతివేళ్ళకొనలతో సున్నితంగా రుద్దుతూ ఉండేవారు. అవి పూర్తిగా అరిగిపోయి వాటిపైని ముద్రలుకొల్పేయేవి. " ఇది నానాది, ఇది బాపూది, ఇది కాకాది " అంటూ బాబా నాణాలరుద్దేవారు. ఎవరైనా వారిని సమీపిస్తే వారు చూడకుండా వాటిని సంచిలోపెట్టి దాచేవారు." శ్రీసాయిలీలామృతము, ఆచార్య భరద్వాజ

నీచేతిపైసనునేను!
శరణంటి శరణంటి
శరణంటి సాయి
నీ చరణ
కమలాల శిరముంచి సాయి
ఏ పూర్వ పున్నెమో నీవాడ
నేను
ఎన్నిపూజల
ఫలమొ పైసనయ్యాను
నీచేత…
పైస నయ్యాను
ఏమికోరీ నన్ను నీవు పిలిచావో
పిచ్చుకగ
ననుజేసి పాశమేసావు
పరుగు పరుగుల నన్ను షిరిడి
లాగావు
లీల మహిమల మత్తు… మత్తు
జల్లావు ||శరణంటి శరణంటి||
ఎందుకూ
కొరగాని ఓ పైస నేను...
ఎన్నెన్నొ జనమాల
మకిల నున్నాను
చిత్త బుద్ధుల నావి శుద్ధంబు
జేయి
నీ వేళ్ళ రాపిడితొ...
అద్దంబు జేయి ||శరణంటి శరణంటి||
వైకుంఠ
కైలాస బ్రహ్మ లోకాల,
ఆ... దైవంబు చిరునామ
తెలియాదు నాకు
చింత యేలను నేడు నీచెంతనేను...నీచేత నేను
మెరుగులద్దీ నన్ను...దైవంబుజేర్ప
! ||శరణంటి శరణంటి||
Oh Sai Baba , let my mind and senses be purified in Thy magic hands!
ReplyDelete