బ్రహ్మానందముతోడ మేలుకో.!

శ్రీసాయినాథాయనమః 

కాకడ ఆరతి వేళాయె గురుదేవ!

కాకడ ఆరతి వేళాయె గురుదేవ
బ్రహ్మానందముతోడ మేలుకో... 
ద్వారకమా... యుడా,  షిరిడీ..  దేవర
భక్తుల కరుణింప మేలుకో

బ్రహ్మ స్వరూపక, బ్రహ్మాండ నాయక
బ్రహ్మ ముహూర్తము మేలుకో ....
ఆనంద సాగర, అద్వైత అవధూత
నీ ద్వారమున మమ్ము ఏలుకో .....                        ||కాకడ ఆరతి వేళాయె||

ఆయోధ్య రాముడ , ఆనంద ధాముడ
మహిమల గురువరా  మేలుకో...
మురళి గానాలోల , సరళ భక్త పాల
నీ ద్వారమున మమ్ము ఏలుకో .....                        ||కాకడ ఆరతి వేళాయె||

పండరి పురవాస, పాండురంగా  దేవ
పండిత గణులొచ్చె మేలుకో... 
అండ దండల బాబ , కొండంత దయబాబ
నీ ద్వారమున మమ్ము ఏలుకో .....                       ||కాకడ ఆరతి వేళాయె||

కైలాస గిరివాస, శిఖ చంద్ర మౌళీశ
బోళాశంకర బాబా మేలుకో...
యోగిరాజా వర , దీన దురితా దూర
నీ ద్వారమున మమ్ము ఏలుకో .....                       ||కాకడ ఆరతి వేళాయె||

త్రిలోక పాలక, త్రిమూర్తి రూపక
అత్రి అనసూయ పుత్ర మేలుకో ....
త్రిగుణతీతా దేవ , చిత్తశాంతి దాత
నీ ద్వారమున మమ్ము ఏలుకో .....                       ||కాకడ ఆరతి వేళాయె||

ప్రభాత శుభవేళ , ప్రాగ్దిశ వెలుగులె
పరమగురు వర  మేలుకో...
మునిజన సేవిత, ముల్లోక మోహిత
నీ ద్వారమున మమ్ము ఏలుకో .....                       ||కాకడ ఆరతి వేళాయె||

దేవాది దేవులు, రాజాధి రాజులు
వచ్చి యున్నారయ్య  మేలుకో....
మహిళలు బాలలు, బారులు దీరారు
నీ ద్వారమున మమ్ము ఏలుకో .....                        ||కాకడ ఆరతి వేళాయె||

బంగారు కలశాన  గంగోదకము నిండె
రంగ రంగ రాయ మేలుకో...
కుసుమాల రాశులు , పరిమాళ ఘుమఘుమలు
నీ ద్వారమున మమ్ము ఏలుకో .....                        ||కాకడ ఆరతి వేళాయె||

వెన్నముద్ద లివియె, ముద్దుల గోపాల
శ్రద్ధ వేచున్నాము మేలుకో....
నిదురింక చాలయ్య  లేలెమ్ము, లేవయ్య
నీ ద్వారమున మమ్ము ఏలుకో .....                        ||కాకడ ఆరతి వేళాయె||
                             

శ్రీసాయి కరుణాకిరణాలు అందరిపై ప్రసరించుగాక!
అందరికి శుభమగుగాక!
ఓంసాయి శ్రీసాయి జయ జయ సాయి!



Comments

  1. "సాయిబాబా నిర్ణిద్రులు, సదా అప్రమత్తులు. మనహృదయాలలో నిద్రాణమైన సాయివిశ్వచైతన్యమును జాగృతపరచి మనము మేల్కొనడమే సాయిబాబాకు మనము చేసెడి కాకడ ఆరతి."

    ReplyDelete

Post a Comment

Popular posts from this blog

శ్రీ సాయి అష్టకము (Sri Sai Ashtakam with English translation )

సాయి మంగళం! ( ఆరతి సాయిబాబా!)

Commonality in the messages of Jesus Christ and Shirdi Sai Baba!