షిరిడీ దేవర క్షీరసాగరా !

శ్రీసాయినాథాయనమః 

"సాయిబాబా జీవితచరిత్ర  సముద్రమువలె విశాలమైనది, లోతైనది. అందరును దీనియందు మునిగి భక్తిజ్ఞానములను మణులను వెలికితీసి కావలసినవారికి పంచిపెట్టవచ్చును".
శ్రీసాయిసచ్చరిత్రము: 2 వ అధ్యాయము 

షిరిడీ దేవర క్షీరసాగరా!

షిరిడీ దేవర క్షీరసాగరా
హృదయముమీదే రత్నగర్భయా,
శోధనచేసెడి సాధక కోటికి
తరగని కరగని బాహుపెన్నిధయా

అశ్రీతజీవికి ఛాయనిత్తువు
ఆర్తిని బాపి సేదదీర్తువు
అక్షయపాత్రగ ఆదరింతువు
కల్పవృక్షముగ సం కల్పము దీర్తువు                    || షిరిడీ దేవర క్షీరసాగరా ||

ధర్మం నీదరి పూర్ణమైనది
నాల్గుపాదముల గోవైయున్నది
మురళికి పరుగిడు  ధేనువేయది
కామ్యసిద్ధుల కామ, ధేనువేయది                         || షిరిడీ దేవర క్షీరసాగరా ||

భక్తులబాధలు బాబానీలో
బడబానలమై  నిబిడియున్నను
వారల రక్షణ దీక్షనె బూని
దక్షతనీవే సం, రక్షింతువు                                   || షిరిడీ దేవర క్షీరసాగరా ||

దాసులవసతుల లేమిలేదులే
సంపదరాసుల పొంగుపొంగులే
బాబాచక్షుపై చక్షువు నిలిపిన
లక్ష్మీచిందులె  , చంగుచంగులే                            || షిరిడీ దేవర క్షీరసాగరా || 


సాయినిమనమున మననము సేసిన
జపముతొ తపముతొ మథనముజేసిన
నవనీతుండై పదము కదుపులే
కరుణామృతమును మిగులపంచులే                   || షిరిడీ దేవర క్షీరసాగరా ||

శ్రీసాయి కరుణాకిరణాలు అందరిపై ప్రసరించుగాక!
అందరికి శుభమగుగాక!
ఓంసాయి శ్రీసాయి జయ జయ సాయి!



Comments

  1. దేవతలు, రాక్షసులు తమకు కావలసిన అమృతము లభించువరకు సముద్రమథనమును కొనసాగించినటుల, సాయిభక్తులు తమకు పరమశాంతిలభించువరకు, సాయిబాబా తమతమ హృదయసీమలలో స్థిరపడువరకు , శ్రీ సాయి జీవిత గాథలను సాగరమును మధింపవలయును, అనగా మరల మరల భక్తిశ్రద్ధలతొ చదివి అవగాహన పెంపొందించుకొనవలెను . చిన్నచిన్న అనుభవములనెడి బహుమతులతొ రాజీపడరాదు.

    ReplyDelete

Post a Comment

Popular posts from this blog

శ్రీ సాయి అష్టకము (Sri Sai Ashtakam with English translation )

సాయి మంగళం! ( ఆరతి సాయిబాబా!)

Commonality in the messages of Jesus Christ and Shirdi Sai Baba!