సాయినాథ్ జగన్నాథుడే!

శ్రీసాయినాథాయనమః 

సాయి జగన్నాథ్

పూరి జగన్నాథుడే  షిరిడిలోని దేవుడు
తనివితీర చూడరే  మిగుల సుందరాంగుడు
సాయినాథ్ సాయినాథ్, సాయిసాయి జగన్నాథ్
సాయినాథ్ సాయినాథ్, సాయిసాయి జగన్నా... ధ్

భక్తకోటి నుద్ధరింప , బ్రహ్మరథము కదిలెనులే
రథచక్రపు రాపిడిలొ  గత కర్మలె చూర్ణములే
మాజీ...దు  మావడిలొ , తిరుగలి వడి తిరిగెనులే 
సాయిదే...వు స్పర్శతోడ , పీడలెల్ల పొడిపొడిలే
సాయినాథ్ సాయినాథ్, సాయిసాయి జగన్నాథ్
సాయినాథ్ సాయినాథ్, సాయిసాయి జగన్నా... ధ్                ||పూరి జగన్నాథుడే||  

బలభద్ర  సుభద్రలతొ , జగన్నాథు వెడలెనులే
శోభయాత్ర తిలకించి , లోకాలే పులకింప
చావడి సంబరమదియె  కలిలొ వైకుంఠము
భక్తుల ఎద పొంగులొ , భువిలొ వై..కుంఠము
సాయినాథ్ సాయినాథ్, సాయిసాయి జగన్నాథ్
సాయినాథ్ సాయినాథ్, సాయిసాయి జగన్నా... ధ్               ||పూరి జగన్నాథుడే||  

అన్న చెల్లి మమతలతొ , కన్నయ్య కదలెనులే
వరములెన్నొ గుప్పింప, భక్త కడలి ముందు నిలువ
ఆత్మీయుల వలయములొ  , సాయి భాను తేజములే...
ఆశీసుల వెల్లువలె , నింగితాకు సంబరములె 
సాయినాథ్ సాయినాథ్, సాయిసాయి జగన్నాథ్
సాయినాథ్ సాయినాథ్, సాయిసాయి జగన్నా... ధ్             ||పూరి జగన్నాథుడే||  
 |

శ్రీసాయి కరుణాకిరణాలు అందరిపై ప్రసరించుగాక!
అందరికి శుభమగుగాక!
ఓంసాయి శ్రీసాయి జయ జయ సాయి!





Comments

  1. Life is a celebration with the Grace of Divine Sadhguru; Jai Sainath! Jai Jagannath!

    ReplyDelete

Post a Comment

Popular posts from this blog

శ్రీ సాయి అష్టకము (Sri Sai Ashtakam with English translation )

సాయి మంగళం! ( ఆరతి సాయిబాబా!)

Commonality in the messages of Jesus Christ and Shirdi Sai Baba!