కార్తీక దీపమా!

శ్రీసాయినాథాయనమః 

కార్తీక దీపమా!
కార్తీక దీపమా...., కౌస్తుభమణి హారమా ...
దేవా నాదైవమా.., సాయీపురుషోత్తమా

ద్వాపరయుగ రాజమా ... , ద్వారకమయి వాసమా
దీనుల కడు నేస్తమా ..., సాయీపురుషోత్తమా
వందనమిది వందనమిది  సాయీపురుషోత్తమా                          || కార్తీక దీపమా...||

పండరిపుర తేజమా..., పాండురంగ రూపమా
నవనీత హృదయమా...,సాయీపురుషోత్తమా
వందనమిది వందనమిది  సాయీపురుషోత్తమా                          || కార్తీక దీపమా...||

కరుణాంత రంగమా ..., కైలాస  జంగమా
గంగా తరంగమా...,సాయీపురుషోత్తమా
వందనమిది వందనమిది  సాయీపురుషోత్తమా                          || కార్తీక దీపమా...||

శ్రీసాయి కరుణాకిరణాలు అందరిపై ప్రసరించుగాక
అందరికి శుభమగుగాక!
ఓంసాయి శ్రీసాయి జయ జయ సాయి!


Comments

  1. సాయిఉపదేశాలు వర్తమానకాలానికి వెలుగుజూపే కార్తీకదీపాలు!

    ReplyDelete

Post a Comment

Popular posts from this blog

శ్రీ సాయి అష్టకము (Sri Sai Ashtakam with English translation )

సాయి మంగళం! ( ఆరతి సాయిబాబా!)

Commonality in the messages of Jesus Christ and Shirdi Sai Baba!