ఏరూపుడవని నేనెరిగెద నిను
మోహము శోకము బాపెడి దీపము
నాకిడు నాకిడు సాయి
ఆదియు నీవని అంతము నీవని
వింటిని వింటిని బాబా
వాదము వేదము నెరుగను నేనిట
ద్వారము తెరువుము బాబా
నీ ద్వారము తెరియుము దేవా
.....
| ఏరూపుడవని నేనెరిగెద
|
రాముడు
కృష్ణుడు రంగడు నీవను గాథలు
నేవిని బాబా
నీ ..గాథలు నేవిని బాబా
...
పరుగున
పరుగున పాదము పట్టగ వాడను
సేరితి బాబా
నీ వాడను చూడవె దేవా.... | ఏరూపుడవని నేనెరిగెద
|
కాకిగ వత్తువొ శునకమై
వత్తువొ లీలలు సిత్రము బాబా
నీ లీలలు
సిత్రము బాబా...
చిత్రపటంబుగ
గయనే జేరిన
శివుడవు శివుడవు బాబా
నా శిరమిదె, పరమిడు
బాబా ....
ఆ పరమా.. పదమిడు
దేవా...... | ఏరూపుడవని నేనెరిగెద
| శ్రీసాయి కరుణా కిరణాలు అందరిపై ప్రసరించుగాక!
అందరికి శుభమగుగాక!
ఓంసాయి శ్రీసాయి జయ జయ సాయి!
ఓంసాయి శ్రీసాయి జయ జయ సాయి!
" సాయీ నీరూపులనంతము, నిన్నెటుల గుర్తించగలను! "
ReplyDelete