శిలనె శిల్పము సేసినావు!

శ్రీసాయినాథాయనమః 

శిలను శిల్పము చేసినావు
శిలనె శిల్పము సేసినావు,  సాయీశ నీవు
చైతన్యము చక్క నింపావు ;
వెదురు గతినే మార్చినీవు , బాబా.....
వెదురుగతినే మార్చి నీవు , 
వేణువుగ శృతి జేసినావు |2|                                          |శిలనె శిల్పము సేసినావు|

అల్పజ్ఞులము మమ్ము బాబా,
ఒడిదీసి కరుణించినా... వు,
సర్వజ్ఞుడవు నీవు బాబా,
నీబడిలొ బలప మిడినా... వు ,
కులము లేని మాన వతనూ ...
నీవు గురుకులమునా బలికినావు,
మనుజులా విడదీయు మతములా..నిరసించి | 2|
మానవతనే... పెంచినా... వు
మాలొ ... మానవతనే పెంచినా... వు                             |శిలనె శిల్పము సేసినావు|

చిరుగులా అంగిలో నీవు,
బాబ కలిమినే గెలిచినా... వు
చిలుముగొట్టము బట్టి నీవు
మాయ, పొరలనే విడగొట్టినా ...వు
వింతలా వీభూతి పంచి
బాబ, సత్యమొకటిగ చాటినా ...వు  
దయను ధర్మముల నిలజూపి బాబ | 2|  
రాజుగ అలరుచున్నావు,
రా... రాజుగా  అలరుచున్నా....వు                               |శిలనె శిల్పము సేసినావు|

శ్రీసాయి కరుణాకిరణాలు అందరిపై ప్రసరించుగాక!
అందరికి శుభమగుగాక!
ఓంసాయి శ్రీసాయి జయ జయ సాయి!


Comments

  1. " అడవిలోని విలువలేని వెదురు, వేయిరాగములు పలుకు మేలి వేణు వగుట, సాయిచేతి చలువేగదా! "

    ReplyDelete

Post a Comment

Popular posts from this blog

శ్రీ సాయి అష్టకము (Sri Sai Ashtakam with English translation )

సాయి మంగళం! ( ఆరతి సాయిబాబా!)

Commonality in the messages of Jesus Christ and Shirdi Sai Baba!