సాయిబాబా సింగారము!
శ్రీసాయినాథాయనమః
సాయి సింగారము
బంగారు సాయిబాబా సింగారము చూడరె
రంగ రంగ వైభోగమె పాండురంగ తేజమే
మేలి మేలి వస్త్రాలు ధవళకాంతి వస్త్రాలు
కనులకేమొ మిరుమిట్లు గొలుపు గొలుపు వస్త్రాలు
సాయిదేవు ఒంటిపైన జారాడు వస్త్రాలు
చక్కనైన వస్త్రాలు చూడ చక్కని వస్త్రాలు
ఘుమ ఘుమలా పరిమళాలు గుడినిండా పరిమళాలు
సాయిదేవ గళమునిండె కుసుమహార పరిమళాలు
మత్తు మత్తు పరిమళాలు చిత్తమలరు పరిమళాలు
మైమరపెడి పరిమళాలు మురళీధర పరిమళాలు
సాయిచంద్ర మెడ నిండె సూర్య చంద్ర హారాలు
సాయిదేవ శిరమునలరె మకుటమున రతనాలు
నీలిసాయికనుల మెరిసె వేల వేల కిరణాలు
నీలమణి కాంతులవియె సాయి కరుణ కిరణాలు
రాజులకు రాజులే సాయి మహరాజులే
స్వర్ణసింగాసనమున దర్బారు నిలచె చూడరె
కన్నులకది పండుగె కోటి సూర్య శోభయే
కోటిసూర్య శోభతో సాయి మారాజులే
శ్రీసాయి కరుణాకిరణాలు అందరిపైప్రసరించుగాక!
అందరికి శుభమగుగాక!
ఓంసాయి శ్రీసాయి జయ జయ సాయి!
" నీలమణి కాంతులు, సాయి కరుణ కిరణాలు! "
ReplyDelete