తెలియగ తరమే!

శ్రీసాయినాథాయనమః 
తెలియగ తరమే   తెలుపగ తరమే
చల్లని కన్నుల వెన్నెల వాడు
చిక్కుల దీర్చెడి చక్కని వాడు
ఎంతయు వెదకిన చిక్కని వాడు
సాయే సాయే చల్లని వాడు

వాడ లొ మేఘుని చేరిన వాడు
ద్వారము మూసిన దూరిన వాడు
అక్షింతలనే జల్లినవాడు
ద్వారకమాయిని వీడని వాడు

కుక్కగ రొట్టెను పొందిన వాడు
కట్టెతొ దెబ్బలు తప్పని వాడు
మార్జాలముగ మారినవాడు
చీమల దోమల నిండినవాడు

ఉపాసని కీ తెలియనివాడు
భిక్షుని రూపుగ నిలచిన  వాడు
ఖండోబాగుడి   శివుడే వాడు
చూడగ చూడగ అంతయు వాడు

దేవూ నింటిలొ సాధువు వాడు
హోళీ పండుగ చిత్రము వాడు
బాంద్రా గదికే పరుగిడు వాడు
ఆకలి కడుపు తొ మరలిన వాడు

దూరము దూరము జేరెడి వాడు
తీరము తీరము జేర్చెడి వాడు
ముందుగ గయకే సాగిన వాడు
పండిత గృహమున పటమే వాడు

అడ్డపు  బల్లపై యూగిన వాడు
జీవన నావకు తెడ్డుయె వాడు
అల్లరి గొల్లరి కన్నయ వాడు
పిల్లల పాపల గాచేడి వాడు

రాముడు వాడు రాహిము వాడు
జగతికి మూలపు చేతన వాడు
చూడగ చూడగ నీలో వాడు
చూడగ చూడగ నాలో...  నేడు

తెలియగ తరమే తెలుపగ తరమే
సాయీ  లీలల తెలుపగ తరమే ! 
సాయీ లీలల మునిగిన ఫలమే !!

శ్రీసాయి కరుణాకిరణాలు అందరిపైప్రసరించుగాక!
అందరికి శుభమగుగాక!
ఓంసాయి శ్రీసాయి జయ జయ సాయి!


Comments

  1. " సాయి శక్తి , సాయి ఉనికి నెరుగుట మిగుల జటిలము! "

    ReplyDelete

Post a Comment

Popular posts from this blog

సాయి మంగళం! ( ఆరతి సాయిబాబా!)

Commonality in the messages of Jesus Christ and Shirdi Sai Baba!

శ్రీ సాయి అష్టకము (Sri Sai Ashtakam with English translation )