మోక్షము!
శ్రీసాయినాథాయనమః మోక్షము నీకను దివ్వెల సాయి రూపము నిలుపు సాయిరూపము నిలిపి జ్ఞాన జోతుల పొందు జ్ఞాన జాతుల తోడ ఆత్మ రూపము జూడు, ఆత్మరూపము జూడ అదె నీకు మోక్షము నీపెదవి పలుకుల సాయిని స్మరియించు సాయిని స్మరియింప మాయ పొరలు తొలగు మాయపొరలూ తొలగా ఆత్మ రూపము కలుగు ఆత్మరూపము కలుగ అదె నీకు మోక్షము దీనజనులా యందు సాయిని సేవించు సాయిని సేవించి సామస్త మర్పించు సామస్త మర్పింప కరమ ఫలములు తొలగు కరమ ఫలములు తొలగ అదే నీకు మోక్షము గురుచరణ కమలాల మోకరిల్లుము నీవు మోకరిల్లీ నీవు అహమును హరియించు అహమదే హరియింప ఆత్మరూపమె వెలుగు ఆత్మరూపమె వెలగ అదె నీకు మోక్షము , అదె నీకు మోక్షము, అదె నీకు మోక్షము ! 01-01-1994 శ్రీసాయి కరుణాకిరణాలు అందరిపైప్రసరించుగాక! అందరికి శుభమగుగాక! ఓంసాయి శ్రీసాయి జయ జయ సాయి!