సాయిస్వప్నము

శ్రీసాయినాథాయనమః 
సాయి స్వప్నము 
స్వప్నమైనది సాయి స్వప్నమైనది
బ్రహ్మ ముహూర్తవేళ స్వప్నమైనది

వేలభాను కాంతులేమొ నింగినిండెను
మంద మలయ పవనమేమొ హాయిగొలిపెను
సాయిపాద కమలమేమొ కనులనిలచెను
మనసు నాట్యమయూరియై జగము మరచెను                   || స్వప్నమైనది ||

ధుని ధునిలో పొగలేమో పలుచనాయెను
జలదివ్వెల జిలుగులేమొ రెపరెపాడెను
గురుదేవుల తేజమేమొ కనుల దోచెను
చిరునవ్వుల చిన్మయుడే ముందు నిలచెను                      || స్వప్నమైనది ||

భస్మముతొ సద్గురువు కొలువు దీరెను
భక్తులతొ ద్వారకమయి పొంగిపోయెను
హారతుల జాగరణల హోరు పెరిగెను
మందగతుల తనువేమొ చిందువేసెను                             || స్వప్నమైనది || 

కరుణాకటాక్షంబుల సాయి జూచెను
వరదాభయ ముద్రతో ప్రీతిగొల్పెను
కాలమటులె  సాయిలీల ఆగెనాగెను
కనులటులే మైమరపున సజలమాయెను                        || స్వప్నమైనది ||

అచేతనం సచేతనం ఏకమాయెను
పిపీలకం హిమాలయం తాను  నిండెను
నదిగమనం  సాగరమున ధన్యమాయెను
గురుసన్నిధె ఈ  జన్మకు భాగ్యమాయెను                        || స్వప్నమైనది ||  

శ్రీసాయి కరుణాకిరణాలు అందరిపైప్రసరించుగాక !
అందరికి శుభమగుగాక!
ఓంసాయి శ్రీసాయి జయ జయ సాయి!




Comments

  1. స్వప్నసందేశాలు సాయిబాబా బోధలోని భాగమే, భక్తులకు సౌభాగ్యమే!

    ReplyDelete

Post a Comment

Popular posts from this blog

శ్రీ సాయి అష్టకము (Sri Sai Ashtakam with English translation )

సాయి మంగళం! ( ఆరతి సాయిబాబా!)

Commonality in the messages of Jesus Christ and Shirdi Sai Baba!