సాయిస్వప్నము
శ్రీసాయినాథాయనమః
సాయి స్వప్నము
స్వప్నమైనది
సాయి స్వప్నమైనది
బ్రహ్మ
ముహూర్తవేళ స్వప్నమైనది
వేలభాను
కాంతులేమొ నింగినిండెను
మంద మలయ పవనమేమొ హాయిగొలిపెను
సాయిపాద
కమలమేమొ కనులనిలచెను
మనసు
నాట్యమయూరియై జగము మరచెను || స్వప్నమైనది ||
ధుని
ధునిలో పొగలేమో పలుచనాయెను
జలదివ్వెల
జిలుగులేమొ రెపరెపాడెను
గురుదేవుల
తేజమేమొ కనుల దోచెను
చిరునవ్వుల
చిన్మయుడే ముందు నిలచెను || స్వప్నమైనది ||
భస్మముతొ
సద్గురువు కొలువు దీరెను
భక్తులతొ
ద్వారకమయి పొంగిపోయెను
హారతుల
జాగరణల హోరు పెరిగెను
మందగతుల
తనువేమొ చిందువేసెను || స్వప్నమైనది ||
కరుణాకటాక్షంబుల
సాయి జూచెను
వరదాభయ
ముద్రతో ప్రీతిగొల్పెను
కాలమటులె సాయిలీల
ఆగెనాగెను
కనులటులే
మైమరపున సజలమాయెను || స్వప్నమైనది ||
అచేతనం
సచేతనం ఏకమాయెను
పిపీలకం హిమాలయం తాను నిండెను
పిపీలకం హిమాలయం తాను నిండెను
నదిగమనం
సాగరమున ధన్యమాయెను
గురుసన్నిధె ఈ జన్మకు భాగ్యమాయెను || స్వప్నమైనది ||
స్వప్నసందేశాలు సాయిబాబా బోధలోని భాగమే, భక్తులకు సౌభాగ్యమే!
ReplyDelete