గురుపాదవందనము ( My experience at Gurusthan , Shirdi)
శ్రీసాయినాథాయనమః
షిరిడీలో గురుస్థానం వద్ద నా అనుభవం !
సమయం ఓరోజు ఉదయం నవంబర్ 2011 గా గుర్తు. కాకడ ఆరతి అనంతరం, సమాధిమందిరం నుండి గురుస్థానం వైపుగా బయటకు వచ్చాను. కొద్దిగా మసక చీకటి. ఇంకా అభిషేక పూజకు ఓగంట సమయముంది. ఈలోపు గురుస్థానం చుట్టూ 108 సార్లు ప్రదక్షిణం చేయాలని సంకల్పం కలిగింది. అంతలోనే మనసులో ఓ.. సందేహం, బాబా అందరికి అడిగినవి విస్తారని విన్నాను, మరి నాకేమీ యివ్వలేదే? అలాంటి అనుమానం తోనే వేపచెట్టు చుట్టూ ప్రదక్షిణలు మొదలు పెట్టాను. షుమారు పది పన్నెండు పరిక్రమణల అనంతరం జరిగిన వింత వింటే మీరందరు చాల అబ్బురపడతారు. కావున సాయిబంధువులతో నా ఆశ్చ్యర్యాన్ని, ఆనందాన్ని పంచుకొంటాను. ప్రక్కనకూడ 10,15 మంది భక్తులు కూడ ప్రదక్షణల చేస్తున్నారు. అంతలోనే దూరం నుండి ఓవ్యక్తి నావైపు నడవటం గమనించాను. దగ్గరకు రాగానే చూస్తే, యూనిఫామ్ లో ఉన్న గురుస్థానం సెక్యూరిటీ గార్డ్. చేతిలో పీచుతో కూడిన కొబ్బరికాయ. చాల ప్రేమతో నాచేతిలో పెట్టాడు. ప్రక్కవారి వంకకూడ చూడలేదు. హృదయపూర్వకంగా అతనికి కృతజ్ఞతల తెలుపుచూ ఆకొబ్బరికాయను సాయిప్రసాదంగా స్వీకరించాను.నాకు కలిగిన సందేహానికి, అనుభవానికి మధ్య షుమారు 10,15 నిముషాల వ్యవధికి మించదు. గురుస్థానం సెక్యురిటి గార్డుకి నా అనుమానం,అనుభవం రెండూ తెలియక పోవచ్చు! కాని నేనిప్పటికీ ఆ క్షణాల మరువలేదు. మరి మీరేమంటారు? సాయిలీల కాదంటారా? ఆ ఎండిన నారికేళం యిప్పటికీ నావద్దే ఉంది. మంచి హృదయంతో అడుగు, తక్షణమే సమాధానమిస్తానన్న సాయిమాట ఎంత సత్యవంతమోకదా! ఆలీల ప్రేరణాగీతాన్ని చదివిగాని, పాటగా పాడిగాని ఆనందించగలరు! సర్వులకు శుభమగుగాక!
ఓంసాయి శ్రీసాయి జయజయ సాయి!
There was hardly a gap of 10-15 minutes between my doubt and experience of the gift of coconut. The security guard may not be aware of my doubt and experience, but still I remember the minutes of that prize and surprise. What do you think readers, is it not a miracle of Sai? Still I keep the surprise coconut with me. How truthful are Baba's words , " Ask with a pure heart, I grant in no time."
Below is the inspirational rhyme of that event.
My experience at Gurusthan (Shirdi)
Time, a day in November, 2011 as I remember. After the early morning Kakad Aarti, I came out of Samadhi mandir through the door towards Gurusthan. Still it was a little dark and an hour left before Sai Abhishek in the nearby Abhishek hall. So a thought came to my mind to do 108 times Pradakshina (circumambulation) around the holy neem tree at Gurusthan. Surprisingly at the same time a doubt popped up in my mind," I heard that Saibaba grants the wishes of those who come to Him, but He has not granted me any gift or such thing." With this doubt still lingering in mind I started doing circumambulations, around the neem tree. Now you will be surprised to know what happened after doing about 10-12 rounds. So I want to share my surprise and happiness with the members of Sai family. At the same time about 10-15 people were also making circumambulations. Meanwhile I observed a man coming towards me and as he came closer to me I found him to be a guard posted at Gurusthan holding a coconut (with fiber) in his hands. With much love and affection he put the coconut into my hands and left with out a word. He didn't even glance at others. With wholehearted gratitude towards him I received the coconut as a gift from Saibaba.There was hardly a gap of 10-15 minutes between my doubt and experience of the gift of coconut. The security guard may not be aware of my doubt and experience, but still I remember the minutes of that prize and surprise. What do you think readers, is it not a miracle of Sai? Still I keep the surprise coconut with me. How truthful are Baba's words , " Ask with a pure heart, I grant in no time."
Below is the inspirational rhyme of that event.
ఓ నింబవృక్షమా నీకే ప్రదక్షణం
ఓ నింబవృక్షమా నీదేను పున్నెము
నీ ఛాయసీమలో వెలసేను దైవము
భూగర్భమందున బాబ తపము సేసెను
ఆతపపు తావిలొ నీమొలక నిలిచెను
నీ చివురు నీడనే గో..సాయి కూడెను
ఆకుపసరులా రోగా..ల మాన్పెను || ఓ నింబవృక్షమా! ||
నిలువెల్ల గరళము అది నీకె సహజము
హరియించె దైవము నినునింపె మధురము
కురుపింతు వమృతం అది మాకె సుకృతం
దరిశింప ఏ క్షణం ధ్యానింప ఓ... క్షణం || ఓ నింబవృక్షమా! ||
వెలిగింప దీపము గురుపాద స్థానము
తొలగింతు భారము కలిగింతు భోగము
మముగావు రాజమా గురుసాయి పీఠమా
మా కల్పవృక్షమా ...నీకే ప్రదక్షిణం || ఓ నింబవృక్షమా! ||
Oh holy Neem , You are the blessed One
In Thy shade seated the Divine
In the cellar did Baba the penance
In the aura of penance Thy sprout raised
In the shade of Thy tender leaves Sai sheltered
With herbs and juices treated the diseases
Your entire body is bitter, it is Thy nature
Sai changed Thy nature, filled with nectar
Blessed are we as you shower nectar
As we visit and meditate at Thy center
As we light a lamp at Sandals of Gurusai
Unload burdens and enrich our lives
Oh king of protection, Seat of Gurusai
Oh wish fulfilling Kalpavriksha, To Thee our circumambulations!
Oh Holy Neem , To Thee Our circumambulations!
Oh holy Neem , You are the blessed One
In Thy shade seated the Divine
In the cellar did Baba the penance
In the aura of penance Thy sprout raised
In the shade of Thy tender leaves Sai sheltered
With herbs and juices treated the diseases
Your entire body is bitter, it is Thy nature
Sai changed Thy nature, filled with nectar
Blessed are we as you shower nectar
As we visit and meditate at Thy center
As we light a lamp at Sandals of Gurusai
Unload burdens and enrich our lives
Oh king of protection, Seat of Gurusai
Oh wish fulfilling Kalpavriksha, To Thee our circumambulations!
శ్రీసాయి కరుణాకిరణాలు అందరిపైప్రసరించుగాక!
అందరికి శుభమగుగాక!
ఓంసాయి శ్రీసాయి జయజయ సాయి!
May Sai Baba's Grace be with all!
May all good things happen to His devotees!
OmSai, SriSai, Jaya Jaya Sai!
Your feedback greatly helps for improvement of the blog , please write your opinion in the comments section below and share if you like. ( మీ సలహా మిగుల విలువైనది, క్రింది కామెంట్స్ సెక్షన్ లో మీ అభిప్రాయము తెలియపరచగలరు. నచ్చితే తెలిసినవారితో పంచుకోండి.)
Sairam i had similar leela in Samadhi mandhir and i got a Rose flower from Baba-Saibanisa
ReplyDeleteBaba knows our hearts and minds, fulfills our right wishes. His miracles are mind
Deleteblowing , sometimes surprisingly spontaneous! Thanks lot for sharing.