శ్రావణ పౌర్ణిమ
శ్రీసాయినాథాయనమః
సాయిసాయి సాయి పరమాత్మను చూసిన రోజు
నేడు శ్రావణ పౌర్ణిమ, రక్షాబంధన రోజు. ఇదేరోజు 1912 వ సంవత్సరమున షిరిడీలో గురుస్థానము వద్ద బాబా పవిత్రపాదుకల స్థాపన జరిగినది. భక్తుల హృదయాలలొ బాబా సర్వవ్యాపి. ఆయనకు దూరాలతొ, తీరాలతొ పనిలేదు. అందరి హృదయవాసి. స్మరణ మాత్ర ప్రసన్నులు బాబా! మానసికంగా షిర్డి యాత్రచేద్దాం. గురుస్థానము, ద్వారకామాయి, పవిత్ర సమాధిమందిరము దర్శించి పులకిద్దాం. పున్నమివెన్నెలలొ విహరిద్దాం. బాబాతో ఆడుదాం, పాడుదాం,ఆనందించుదాం!
సాయి సాయి పరమాత్మను
చూసినరోజు
సాయి షిర్థి
బృందావని నడచిన రోజు
పున్నమి రోజు.... జనమ ధన్యపు రోజు
నింబవృక్ష మూలంబును
చుట్టిన రోజు
సద్గురుని పాదుకలను
పట్టిన రోజు
వెన్నెల రోజు
.... మనసు పొంగిన రోజు ||సాయి||
ద్వారకమయి ద్వారంబును చేరినరోజు
ధుని ఊదీని భక్తితోడ
దాల్చినరోజు
మల్లెలరోజు.... సాయి మహిమల రోజు ||సాయి||
మురళీధర మందిరమున మొక్కిన రోజు
సాయిదేవ సమాధి
తల తాకిన రోజు
చల్లని రోజు.... సమాధాన మందిన రోజు ||సాయి||
తన్మయమున తనువు పులకరించిన రోజు
చిన్మయునితో కన్ను చెమ్మగిల్లిన రోజు
బంగరు రోజు.... బాబ లంగరు రోజు ||సాయి||
గులాబినై బాబ పాద మందిన రోజు
గులామునై సలామునే
చేసిన రోజు
పన్నీ.. రుగ, కన్నీ..టిని చిలికిన రోజు
తపనల రోజు....
సాయి తలపుల రోజు
Today is Sravana Pournami, on this day in 1912 Saibaba's Holy Padukas were installed at Gurusthan, Shirdi.
ReplyDelete