మేఘుని అంతరంగము


సాయిబాబా సర్వదేవ స్వరూపులు. శ్రీరామునిగ, శ్రీకృష్ణునిగ, శివాది  దేవతా రూపులుగా  భక్తుల కనుభవ మిచ్చిరి. మేఘా సాయికి అత్యంత ప్రియభక్తుడు. మిగుల అమాయకుడు, చదువుసంధ్యలెరుగనివాడు, ఎలాంటి మంత్రోపదేశములు తెలియనివాడు.  సాయినే తన యిష్టదైవ పరమశివునిగా నమ్మి  తన జీవితంలొ చివరి క్షణం వరకు సాయిని సేవించాడు. అలాంటి స్వభావముగల మేఘా ఓరోజు బాబాకు అభిషేకం చేయ ద్వారకామాయిలొ నిలబడి బాబాను తన సేవ స్వీకరింప వేడుకొనగ, బాబా కేవలం తన తలవరకు మాత్రమే అభిషేకం చేయమని పలికారు. మేఘా పరవశమున " హరగంగే " యనుచు బాబా శరీరమంతటిపై నీళ్లుపోయగ , ఆశ్చ్యర్యముగ బాబా తలమాత్రమే తడిసి, శరీరమంతయు పొడిగామిగిలెను.  పిమ్మట మేఘాచె త్రిశూల చిత్రము గీయింపజేసి, పూనానుండి ఓ భక్తుడు తెచ్చిన శివలింగాన్ని బహూకరిస్తారు బాబా. ఈవివరాలన్ని హేమాద్రిపంతు రచించిన శ్రీసాయిసత్చరిత్ర 28 అధ్యాయములొ పొందుపరచబడినవి. సద్గురు అనుగ్రహానికి కావలసిన గుణములెల్ల మేఘునిలొ పరిపూర్ణముగ ఉండుటవలన, బాబా యాతని అనుగ్రహించి చివరకు ముక్తి నిచ్చారు.  సాయి భక్తులెల్లరకు మేఘా ఓ ఆదర్శంగా కలకాలం గుర్తుంటాడు. మేఘా కథయె, దిగువ వ్రాసిన భావానికి ప్రేరణ. చివరకు మేఘాకు మాటలురాని అనుభూతిని, పరమశాంతిని బాబా ప్రసాదించారు. దీనికోసమేగద మనందరి  ప్రయత్నము.   
      
మేఘుడ నేను
మేఘుడ నేను ఎరుగగ లేను
సాయీ సాయి, నీ మహిమలను
నీ సన్నిధినే పెన్నిధి సేసి... ||2||
ద్వారక మాయిలొ నిలిచితి నేను                    || మేఘుడ నేను ||

హరుడవు నీవే , గురుడవు నీవే
హితుడవు సఖుడవు సర్వము నీవె
అన్యుల మరచి,  నిన్నే తలచి ||2||
ద్వారక మాయిలొ నిలిచితి నేను                    || మేఘుడ నేను ||


యవనుని గా...నిను తలచి నానని
కినుక వహించి పలుకరింప..వొ
అలుకవీడి నను ఆదరింపవ.. ||2||
ద్వారక మాయిలొ నిలిచితి నేను                    || మేఘుడ నేను ||


దూరదూరముల పదముల నడచితి
గంగ కలశము ప్రియముగ దెచ్చితి
దళపుష్పంబుల అర్చన సేయగ...||2||
ద్వారక మాయిలొ నిలిచితి నేను                     || మేఘుడ నేను ||


సాయీ సాయీ  చాలీ...హాయి,
శివునిగ నాలో... నిలిచితి వోయి!



సాయి కరుణా కిరణాలు అందరిపై ప్రసరించుగాక! 
అందరికి శుభమగుగాక!
ఓం సాయి శ్రీ సాయి జై జై సాయి! 








Comments

  1. సాయిబాబా శివ స్వరూపులు. శివునిగా దలచు మేఘాకు శివరూపుగ అనుభవమిచ్చారు.

    ReplyDelete

Post a Comment

Popular posts from this blog

శ్రీ సాయి అష్టకము (Sri Sai Ashtakam with English translation )

సాయి మంగళం! ( ఆరతి సాయిబాబా!)

Commonality in the messages of Jesus Christ and Shirdi Sai Baba!