సాయిబాబా హనుమ రూపులు!
శ్రీసాయినాథాయనమః
సాయిబాబా తాము
హనుమ రూపులుగ నిమోంకర్ పుత్రుడు సోమనాథునికి దర్శనమిచ్చారు. బాబాకు ఆంజనేయస్వామికి
యెన్నో పోలికలు కనపడతాయి. ఇద్దరు ఆజన్మ బ్రహ్మచారులు. ఇద్దరు ప్రభుసేవా తత్పరులు. బాబా
తమ గురువుకు సర్వమర్పిస్తే , హనుమ శ్రీరామచంద్ర ప్రభువుల దాసాగ్రగణ్యులు. ఇద్దరు బల,బుద్ధులలో సాటిలేనివారు. అణిమాది సిద్ధపురుషులు. లోక పూజితులు, చిరంజీవులు, నిత్యసత్యులు, పిలిస్తే పలికే దైవరూపులు. హనుమ బలము నెరుగలేము. భీముని పరీక్షింపదలచి దారికడ్డముగ తమ వాలముంచి, దానిని ప్రక్కకు
జరిపి వెళ్ళమన, భీముడా ప్రయత్నంలో విఫలుడైన కథ లోక ప్రసిద్ధము. అలాగే సీతాన్వేషణ సమయంలొ, సరసా యను
రాక్షసి పరీక్షలొ నెగ్గారు. ముందుగా అతిపెద్ద రూపునిగా పెఱిగి , తరువాత తమ బుద్ధిచాతుర్యంతో
అతిసూక్ష్మ రూపం ధరించి బయటకు వెడలారు.
బాబా బలంకూడ తెలియరానిది. షిరిడీవాసి బయ్యాజీ పాటిలు, తాను భీమబలుడనని గర్వంగా చెప్పుకుంటుండేవాడు. ఓరోజు బాబా పాదాలొత్తాక వారిని తనచేతులపై యెత్తి, ధునివద్ద దించాలని ప్రయత్నించాడు. పూర్వం ఎన్నో సార్లు అలా చేసాడు. కాని ఆరోజు బాబాను పైకి లేపలేకపోయాడు. బాబా పాటిలువంక జూసి ఓ నవ్వు నవ్వారు. భీమబలునికి గర్వభంగమైనది. అలాగే బాబా వేలాడు బల్లపై నిద్రించడం ఓ గొప్ప లీల. భక్తుడు డేంగలె సమర్పించిన అడ్డబల్లను మజీదు కప్పుకు సన్నని గుడ్డపీలికలతొ కట్టి , నలుప్రక్కల దీపాలుంచి శోభాయమానంగా నిదురించేవారు. మరి మునుపటి బాబా బరువు యేమైనది? బాబాలీలలు అనంతము కదా, ఎంతో పుణ్యం చేసినవారే బాబాసేవను పొందగలరనుట నిస్సందేహము కదా! ఎన్నిజన్మల ఫలమొ మనది, బాబాను స్మరించుకొంటున్నాము! ఈభావాన్ని గేయరూపంలొ పాడుకొందాము.

ముక్కోటిదేవతల పూజఫలమోగాని
ముక్కోటిదేవతల పూజఫలమోగాని
పెక్కు
పుణ్య నదుల స్నాన
ఫలమో గాని
ఈ సాయి నా ఎదుటే నిలచి
యున్నాడు
ఈ సాయి నా మదినే షిరిడి
చేసాడు
గంగధరుడే
సాయి అంతరంగడె సాయి
కాశి
తీర్థ ఫలమొ బిల్వార్చనల
బలిమొ
పరమశివునిగ
యెదను యేలుచున్నాడు
రాజు
రారాజుగ అలరుచున్నాడు |ముక్కోటి
దేవతల|
ద్వారకేశుడు
సాయి దారిచూపెడు
సాయి
లాలిపాటల
ఫలమొ వెన్నముద్దల
బలిమొ
ఈ మనసు హహము పై స్వారి చేస్తున్నాడు
రాజాధి
రాజుగ రంజిల్లు చున్నాడు |ముక్కోటి దేవతల|
కుశల
కర్ముడు సాయి హనుమ
రూపుడు సాయి
ఆకుపూజల
ఫలమొ తనదు
చాలీస బలిమొ
మలయ పవనా మటుల మసలు తున్నాడు
సీతరాముల
నిచట చూపు
చున్నాడు |ముక్కోటి దేవతల|
శ్రీసాయి కరుణాకిరణాలు అందరిపై ప్రసరించుగాక!
అందరికి శుభమగుగాక!
ఓంసాయి శ్రీసాయి జయజయ సాయి!
Your feedback greatly helps for improvement of the blog , please write your opinion in the comments section below and share if you like. ( మీ సలహా మిగుల విలువైనది, క్రింది కామెంట్స్ సెక్షన్ లో మీ అభిప్రాయము తెలియపరచగలరు. నచ్చితే తెలిసినవారితో పంచుకోండి.)
For more posts also please also visit SaishaktiTelugu.Blogspot.com
సాయిబాబా హనుమ రూపులు!
ReplyDeleteAugust 28, 2018
Sairam it is a very good comparisan-Saibanisa
ReplyDelete