శ్రీసాయి సచ్చరిత్ర సంషిప్త గానామృతము -1 (మూలము: శ్రీసాయి సచ్చరిత్రము.)
శ్రీగణేశాయనమః,శ్రీసరస్వత్తైనమః,సమర్ధసద్గురు శ్రీసాయినాథాయనమః
పాఠక సాయిభక్త పరివారానికి వినాయకచవితి శుభాకాంక్షలు!
ముందుమాట!
శ్రీసాయిలీలలను గానరూపంలో పాడుకో దలచువారికొరకు ఈ శ్రీ సాయిలీలలు గేయ రూపంలో వ్రాయడమైనది. సమయాభావముచే శ్రీసాయిచరిత్ర పూర్తిగా చదువుటకు వీలుకానిచో , ఈ రచన చదువుటచే అధ్యాయ సారమును గ్రహింపవచ్చును. అధ్యాయముల భావసందేశముల బట్టి వాటి వాటి నిడివి మారినది. మొట్టమొదటిగా చరిత్ర పారాయణజేయువారు శ్రీసాయిసచ్చరిత్ర మూలగ్రంథ మును ఒక పర్యాయము పారాయణ జేసి ఆపై ఈ గేయామృతము చదివిన విషయ గ్రహణము శులభము కాగలదు. సప్తాహ పారాయణకు వీలుగ,మూలగ్రంధమువలె ఏడు భాగములుగ విభజించడమైనది. శ్రీసాయి కరుణా కటాక్షములు పాఠక భక్తులకు పరిపూర్ణముగా లభించుటకు మనఃస్ఫూర్తిగా ప్రార్ధిస్తున్నాను.
శ్రీసాయిలీలలను గానరూపంలో పాడుకో దలచువారికొరకు ఈ శ్రీ సాయిలీలలు గేయ రూపంలో వ్రాయడమైనది. సమయాభావముచే శ్రీసాయిచరిత్ర పూర్తిగా చదువుటకు వీలుకానిచో , ఈ రచన చదువుటచే అధ్యాయ సారమును గ్రహింపవచ్చును. అధ్యాయముల భావసందేశముల బట్టి వాటి వాటి నిడివి మారినది. మొట్టమొదటిగా చరిత్ర పారాయణజేయువారు శ్రీసాయిసచ్చరిత్ర మూలగ్రంథ మును ఒక పర్యాయము పారాయణ జేసి ఆపై ఈ గేయామృతము చదివిన విషయ గ్రహణము శులభము కాగలదు. సప్తాహ పారాయణకు వీలుగ,మూలగ్రంధమువలె ఏడు భాగములుగ విభజించడమైనది. శ్రీసాయి కరుణా కటాక్షములు పాఠక భక్తులకు పరిపూర్ణముగా లభించుటకు మనఃస్ఫూర్తిగా ప్రార్ధిస్తున్నాను.
(సరిక్రొత్త ఈ సాయిలీల తెలుగు బ్లాగ్ మెరుగుపరచుటకుకొన్నిసవరణలు అవసరముగా భావిస్తున్నాను. మీ అమూల్య సలహాలనందించి సహాయపడగలరు! సదా కృతజ్ఞుడను!)
మొదటి భాగము (అధ్యాయములు 1-7)
మొదటి అధ్యాయము
ఆత్మకథ, పరమాత్మకథబాబా చెప్పిన భవ్యకథ
ఇది ఆత్మకథ,పరమాత్మకథ భక్తులకెంతొ ప్రీతికథ
తనకావ్యంబును తానె వ్రాయగ పంతును వింతగ పిలిచెనట
ప్రేరణనెంతో నిచ్చెనట అమృతమదియే మనకు కదా!
ద్వారకామాయిలొ బాబనుచూసి జన్మధన్యతను తానుపొందగ
దవ్వులనుండి తానరుదెంచెను దివ్యలీలను కంటితొ గాంచెను
వింతలుకావే సాయికార్యములు తిరుగలి ముందర సాయిదేవులు
కఫ్ని,
చేతులు మడచి సిద్ధమాయిరి
గోధుమలందున వడివడి విసరగ
గ్రామవాసులీచోద్యము చూడగ అంతట మాయికి పరుగున వచ్చిరి
బరబర త్రిప్పుచు బాబాచక్రము గోధుమలందున విసరసాగిరి
నాల్గురంగనలు బాబనుచేరి తిరుగలి తాము విసరసాగిరి
ఫకీరుకేల గోధుమపిండి తమకు పంచులె
మనమున దలచిరి
గోధుమలన్ని పిండిగమారెను వనితలు పిండిని వంతులువేసి
తాముపొందగ సంబరపడిరి వనితలు ఎంతొ సంబరపడిరి
బాబా
భావము ధ్యేయము వేరు
ఉగ్రులాయిరి సాయిదేవులు
తనదుపిండియది
వారికేలయని పొలిమేరల గ్రామపు తాజల్లించిరి
గోధుమలవి గ్రామస్థుల కర్మలు చూర్ణముజేసిరి సద్గురుదేవులు
పిండిగమారెను కర్మదోషములు కలరామారియె షిరిడిని వదలెను
గోధుమలీలను పంతు గాంచెను బాబాలీలల వ్రాయగ దలచెను
మానవాళికి యంతట తెలియగ
బాబా ప్రేరణ చిత్తము మెలుగగ.
రెండవ అధ్యాయము
సాయిచరితము సాగరతుల్యము బహువిశాలము భావాతీతము
సాధక కోటికి బహుఫలదాయిని భక్తిజ్ఞానముల ముక్తిప్రదాయిని
బాబా కథలు బహు విచిత్రములు చింతచిత్తముల శాంతి ఛత్రములు
ఇహపరంబులకు చక్కని దారులు
మననము సేయగ గమ్యసారధులు
సంకల్పము సాయిది తనదు చరితకు పంతు ప్రేరణకు అదియె మూలము
అహమును బాబాపదముల నిలిపి బాబాలీలల పదముల మలచెను
నాననుపంపి
పంతు నీడ్చెను సాయిబు రూపుతొ బాట జూపెను
పంతు సత్వరమె షిరిడిని జేరెను సాయికథలకది శ్రీకారమాయెను
ధూళిదర్శనము పంతు జేసెను
బాబ పాదముల తాప్రణమిల్లెను
స్పర్శభాగ్యముతొ
పరివర్తన జెందెను అణుప్రతిఅణువులొ బాబను గాంచెను
సాఠేవాడలొ విడిది సేసెను బాలభాటేతొ బహువాదన జేసెను
కర్తలమనమే కర్మల కనుచు "సరిచూడగ గురువేలని" పలికెను
సహచరులతొ బాబను చూడ
మజీదుమా పంతరుదెంచెను
"వాదన ఏమది సాఠేవాడలొ , హేమాద్రిపంతు ఏమి ఏమనె " సర్వజ్ఞులు సాయి పలికెను
అతిఅబ్బురమును పంతు పొందెను, హేమాద్రిపంతుగ బాబ పిలువగ
అహమును హ్రస్వము జేయగ దలచి బాబతొ బిరుదపు భాగ్యము పొందెను
దైవసన్నిధికి దారులు యెన్నియొ
షిరిడినుండియు బాట యున్నది
మార్గమదియె బహుళ జటిలము
క్రూరమృగముల సంకటమయము
మార్గదర్శితొ
గమ్యము సులభము చీకటి దారుల దాటుటె సరళము
బాబా యుక్తిగ సూత్రము దెలిపిరి సమాధానముగ పంతు గ్రహించెను
మూడవ అధ్యాయము
అనుమతి కలిగెను పంతుకు బహుమతి దొరకెను
కావ్యరచనకు అనుమతి దొరకెను
"నిచ్ఛల మనమును నాపైనిలుపుడు , నాదుమాటల విశ్వసింపుడు
కథల శ్రవణమె జ్ఞానము నింపును , అవిద్యయంతయు అంతరించును
భక్తిప్రేమలు మనమున పొంగును , లీలలు నావి శ్రద్ధగ వ్రాయగ
నాదు స్మరణచె కోర్కెల దీర్తును, అన్నిదెసల రక్షణ కూర్తును
మనసుతొ
లీలల మననము సేయగ , సంతసమొందురు సౌఖ్యము పొందురు
గానముసేయగ తృప్తినిత్తును , శాశ్వితంబుగ తృప్తినిత్తును
అన్యము మరచి నన్నే నమ్మిన, శాంతి శాంతి శాంతి గూర్తును"
సాయి తీయగ మాయిలొ , ద్వారకామాయిలొ పలికెను.
దైవయోచనము పెక్కురీతులు , వివిధభక్తులకు వివిధకార్యములు
పంతుకు కలిగెను రచనా
భాగ్యము , సాయిజేసిన చమత్కారము
జీవనమిదియె సాగర పయనము , బాబాలీలలె వెలుగు స్తంభములు
దారులజూపుచు గమ్యము జేర్చును , తీపుల గూర్చుచు తృప్తినిచ్చును
కర్ణపేయములు తన్మయత్వములు , అహము ద్వన్ద్వములు యంతట దూరము
సాయిస్మరణయె జ్ఞానదాయిని, కలియుగంబులొ మోక్షప్రదాయిని
గోవులతల్లుల వాత్సల్యము చూడుడు, పెల్లుబికిన ప్రేమతొ స్తన్యమిత్తురు
మాతృప్రేమయది మర్మము నెరుగదు , బాబ భక్తులకు మాతృమూర్తియె!
మొరటుమనిషి రోహిల్లా షిరిడిలో, అతిబిగ్గర ఖురానుచదువగ
బాబయాతని పక్షము పలికెను, గ్రామవాసులు బాబనుజేరగ
" మీకార్యంబులు
నాకు విదితములు,అందరి ఎదలు నాకునిలయములు
చరాచరంబుల నిండియుంటిని , జగన్నాటకము నడుపుచుంటిని
జగన్మాతగ నన్నేచూడుడు ;
సృష్టి స్థితి లయ కారకుండను, దృష్టినిలుప సంరక్షింతును " బాబాపలికెను ఆరతివేళల
నిదురనుసోమరితనమును వీడుడు , చంచలమనమును సాయిపై నిలుపుడు
అన్యదారుల అలసట జెందక
సాయిదేవునే చిత్తము నింపుడు
నాల్గవ అధ్యాయము
దైవశాసనము దారితప్పగ , ధర్మగోవుయె కుంటుచు నడువగ
సరిసమయంబుల యోగులు వత్తురు, మానవాళికి మార్గము కూర్తురు
దైవము మానుష రూపములొ షిరిడిలొ వెలసెను సాయీశునిగ
వారిజననము ధరణిలొ ధర్మము ,వారికర్మము భువి కళ్యాణము
ఆత్మస్థితిలొ సాయీశులు స్థిరులు , లోకమోహములకు బహుబాహు దూరులు
దయాంతరంగులు దానకర్ణులు, అమృతసూక్తుల బహు అలరింతురు
అల్లానామము అహర్నిశములు , జనుల జాగృతిలొ యోగనిద్రులు
జనులనిదురలొ సాయిజాగృతులు , షిరిడినుండియే విశ్వపాలకులు
ఆటలు ఆడిన పాటలు పాడిన , భక్తుల బాధలు సతతము దీర్చిన
వచ్చెడివారల సందడి హెచ్చిన కంపనమెరుగని అంతరంగులు
సిద్ధులైనను నిత్యసాధకులు , మాటలాడినను మౌనరూపులే
వారినడకతో షిరిడి పునీతము , వారిస్పర్శచె శిలలు ధన్యము
సాయి దర్శనమె యోగసాధనము , పాదస్పర్శయె బంధనాశకము
సాయిదేవులే రామకృష్ణులు, ద్వంద్వాతీతులు బ్రహ్మస్థితులు
విఠలుని భక్తుడు అతియతి వృద్ధుడు, గౌలిబువా సరిబాబాభక్తుడు
సాయిలొ పండరి విఠలుని గాంచెను, సాయిరంగనిగ నిర్ధారించెను.
సంకీర్తనప్రియులు సాయిదేవులు , నామసప్తాహంబుల బహు జరిపింతురు
ముందుగ పలికి సప్తాహము ముగియగ , విఠలునిజూపిరి పటమున కాకకు
భగవంతరావు సాయిపూజను మరువగ , షిరిడీకి నీడ్చిరి వివరము జెప్పిరి
విఠలునిసేవలు సేయగ బలికి , తనకు రంగని కబేధము పలికిరి
గంగయమునల
జనమ స్థలంబులు , బాబా పదములె బహుపవిత్రములు
గణుడు బాబ చరణములందగ , తీర్థధారలు జలజల బారెను
అయోని సంభవులు బాబా దేవులు , పదునారేండ్ల బాలభాస్కరులు
నింబ ఛాయలో నిచ్చల ధ్యానులు , గురుస్థానమున యోగస్థితులు
వాడలు మూడు షిరిడీలొ వెలసెను ; సాఠే, దీక్షితు వాడలె జనులకు
బూటీవాడ సద్గురుసాయికి, నెలవులాయెను భగన్మహిమగ!
ఐదవ అధ్యాయము
ధూప్ నివాసి చాంద్ పాటిల్ దారితప్పిన హయమును వెదకుచు
మామిడి నీడన బాబను యటగని తన అన్వేషణ విన్నవించెను
బాబ అశ్వము నిట్టులె జూపిరి కలువగట్టున మేయగ జేసిరి
నీరునిప్పుల
సరి సృష్టించి చిలుముజేసి పాటిలుకిచ్చిరి
బాబ లీలను పాటిలుగాంచి బహు అచ్చెరువుతొ తా ప్రణమిల్లెను
అతిధిదేవులుగ తన ఇంటికి రమ్మని ఆతిథ్యంబుల సేవలు జేసెను
పాటిలు మేనల్లుని పెళ్ళికి
పెళ్లిబృందముతొ షిరిడి జేరిరి
బాబ రాకతొ షిరిడి పవిత్రము నాటినుండియె లోకపాలకము
ఖండోబాగుడి విడిది వాసము
బ్రహ్మ రూపుబాబయటగని
" రండి సాయి" యని మాల్సాపతియన, సాయినామమటు జగతికి కలిగెను
యోగులెందరొ సాయినిగాంచిరి సాయీశుల సహవాసము జేసిరి
సామాన్యుడు కాడు మాన్యుడు మణియని
సాయినైజమును నిర్ధారించిరి
బారుకేశముల
వస్తాదు రూపుతొ బంతుల మల్లెల మొక్కలు నాటిరి
పచ్చికుండలతొ నీరుపోయుచు పూలవనమును చక్కగ పెంచిరి.
పాదుకల ప్రతిష్ఠాపన
సాయిపాదుకల సంబరము వెడలింది
నింబవృక్షపువైపు వేడుకగ కదిలింది
రారండి చూడండి ఓ అమ్మలారా
సాగండి తరలండి ఓ అన్నలారా
సాక్షాత్తు దత్త పాదముద్రికలు
షిరిడి వేడుకల సాయిపాదుకలు
భాయి కృష్ణాజి భావనల మెదలినవి
బాబసాయీ షిరిడి ఆగమన సూచనగ
డాక్టారు రామాజి రూపకల్పనలు
ఖండోబ పూజారి నిండైన రూపులు
పద్మాలు పుష్పాలు శంఖ చక్రాదులు
సాయిలీలల శ్లోక మందు ముద్రితములు
ఖండోబ గుడి నుండి సంబరము కదిలింది
దీక్షితు శిరముపై పాదుకలు నిలుపంగ
ద్వారకామాయిలొ సాయి స్పర్శింప
వేపమూలము సాగె దైవపాదములు
బహుశుద్ధతిధి యది శ్రావణపున్నమి
నింబవృక్షా ఛాయ పాదుకలు నిలిచినవి
భువిలోన వెలసిన సాయిదీవెనలు
ఆశ్రితులమనముల గురురూప శోభలు
సాయి పాదుకల సేవింప రారండి
భువిలోన వెలసిన సాయిదీవెనలు
" సదానింబ వృక్షస్య ములాధి వాసాత్
సుధా స్రావిణం తిక్తమప్య ప్రియంతం
తరుమ్
కల్ప వృక్షాధికం సాధయంతమ్
నమామీశ్వరం
సద్గురుం సాయినాథమ్ "
పాదుకలవియే నింబ ఛాయలో
ఉపాసన శ్లోక లిఖితములు
సాయిదేవుల స్పర్శ దీవెనలు
రాజ్యముజేసెడి రామ పాదుకలు!
మొహినుద్దీనుతొ కుస్తీపట్టిరి పొటీ నందున బాబయోడిరి
వైరాగ్యంబును మిగుల పొందుచు
చింకిగుడ్డల శివునిగ మారిరి
సంతానహీనుడు సాహెబు డేంగలె సాయిచలువ సంతానము పొందెను
సాయిశక్తినట జనులు గాంచిరి
దూరదూరముల చూడగ వచ్చిరి
బాబావేషము బహు విచిత్రము
పాతమజీదు రాత్రిశయనము
అహంకారము ఆహుతిజేసెడి ధునివెలిగించిరి చలితొలిగింపగ
పరమాత్మ దీప్తులే సాయిదేవులు దీపములంటే మిగుల ప్రియులు
జలముతోడనె జోతుల జూపి
వణిజుల కన్నుల చీకటి మాపిరి
రహతావాసి జవహర్ ఆలి
సాయికి గురువుగ డంబము పలికి
కాలక్రమమున కపటము తెలియగ సద్గురుదేవుల తా ప్రణమిల్లెను.
ఆరవ అధ్యాయము
జీవననావకు
సాయే నావిక , సాయే నాయక
బాబాసేవయె భాగ్యము జీవికి , బాబాసేవయె భవభయ హారిణి
బాబాసన్నిధె
శాంతిసముద్రము, బాబాశరణమె ఆత్మోద్ధరణము
బాబాభక్తుని గృహమె స్వర్గము , అన్నవస్త్రములు అడుగక కలుగును
యోగక్షేమములు బాబా బాధ్యత , స్థిరచిత్తంబుతొ సద్గురుసేవతొ
సాయిసత్కృపతొ సంతతిపొందిరి , గోపాలరావు
దాము అన్నలు
పతాకోత్సవము పెద్దగ జరిపిరి, రామనవమి శుభదినంబున
చందనోత్సవము సరివనగూడెను , అమీర్ షక్కరు ఆరంభింపగ
పగటివేళలొ పతాకోత్సవము , రాత్రివేళ చందనోత్సవము
రామనవమిని భీష్మ మొదలిడె , బాబాయనుమతి ఆసీసు లందగ
మతముల సమతయె సాయినాథులు, రామురహీములు ఒక్కరూపులె
రామజననమె రాక్షస వధనము , రామకథయె జరుగుసమయమున
బహుకోపితులాయిరి బాబాదేవులు , రామావహనము తాముపొందుచు
వేడుక వేళల నీరుకొరవడ , ఉప్పునీటిని తీయగ మార్చిరి
పువ్వులజల్లి సాయిదేవులు ; సాయిసేవలో మధురము జన్మము
మజీదు మరమతు సాగు సమయమున , ఉగ్రులాయిరి సాయిదేవులు
కొట్టిరితిట్టిరి దగ్గర భక్తుల , చల్లగమారిరి యంతట తృటిలొ
ఏడవ అధ్యాయము
సాయియోగియె ఖండయోగియే , బాబయోగియె పూర్ణయోగియే
మతములగోడల దాటిన పురుషులు , మతములశిఖరము లెరిగిన పురుషులు
ఓనిముషంబున హిందువుగుందురు , యవనుని రూపము యంతలొ నిత్తురు
రామనవముల ఉరుసుల ప్రియులు , చెవులకుచిల్లులు హైందవధర్ములు
మజీదువాసులు మహమ్మదీయులు, మద్యమాంసముల కలిసి భుజింతురు
సుకృతముండిన సాయిసన్నిధి , పుణ్యముండిననె సాయిసేవలు
శుద్ధాంతరంగులు తురీయ స్థితులు ; సాయిదేవులుదైవ రాయబారులు
నుడులకు అందరు, నుతులకు పొంగరు;
అంతరంగముల చదివెడి నిపుణులు
రాజుపేదకు భేదమెరుగరు , సమ్మానమునొందరు మనసుతొ వశులు
దక్షిణలందుచు పంచివేతురు , చూపుతోడనె రోగము గూర్తురు
గుడ్డివారికి చూపునిత్తురు , కుంటివారికి కాలు గూర్తురు
చరాచరంబుల సాయి చరింతురు , భక్తులబాధల తాము ధరింతురు
చేయినిగాల్చిరి కొలిమిలొ బిడ్డకై, ప్లేగునుదాల్చిరి బాబును గాచిరి
మనసర్పింపగ మైమరపింతురు , అంతరంగముల చక్కగ చదువుచు
పండరిదారిలొ నానా చేరగ , రంగనిభజనతొ అబ్బుర పరచిరి.
పండరిదారిలొ నానా చేరగ , రంగనిభజనతొ అబ్బుర పరచిరి.
మొదటిభాగము సంపూర్ణము
శ్రీసాయినాథాయ నమః
సద్గురు శ్రీసాయినాథార్పణమస్తు!
సద్గురు శ్రీసాయినాథార్పణమస్తు!
Sree Sai Satcharitra samshipta Ganamrutamu is the synopsis of Sri SaiSatcharitra, intended to convey the message in brief and also music lovers can sing the glories of Baba to their heart content. This post is the first of seven parts.
ReplyDelete