ద్వారకామాయి సందేశం!
శ్రీసాయినాథాయనమః
ద్వారకామాయి సందేశం!
భాగవతం
భాగవతం బాబాలీలల భాగవతం
భాగవతం
భాగవతం ద్వారకామాయి భాగవతం
హేమాద్రిపంతుయె వేదవ్యాసుగ తేనెల సోనలు కురిపెనులే
ఘటనఘటనలో
లీలఘనములే బాలగోపాల సాయి చూపెలే !భాగవతం!
అవతారపురుషులే
సాయిబాబ యట శిరిడీ నేలపై
నడచెనులే
వెన్నదొంగయై
పాండురంగడై క్రీడలెన్నొ మహి సాయి చుపేలే !భాగవతం!
క్రతువులేవి
మనబ్రతుకు మార్చవు భృతిని గూర్చినా గతిని చేర్చవు
సద్గురుపాద భక్తిశ్రద్ధలే
మాయ తొలచునని మాయి పలికెలే !భాగవతం!
కర్మ
పునాదియె వ్యాధుల బాధల కర్మల గాల్చుట
తప్పదులే
బ్రతుకుబాట
నిష్కర్మలు సేయగ ధుని సాయీశుని
పలికెనులే !భాగవతం!
చీనాంబరములె
చిఱుగునని మరి సింహాసనములె
తొలుగునని
శిలావేదికే
చెప్పెనులె బహు సాయితత్వమును చాటెనులే !భాగవతం!
చిఱుగులె
మిగులును రాజులకైనను మదిమహారాజుగ నుండమనీ
వైరాగ్యంబె
వైకుంఠంబని కఫనీయే చెప్పక చెప్పేనులే !భాగవతం!
రూపులనేకము
జగన్నాటకము శునకము పండితులేకమనీ
సుఖము
దుఃఖము శీతల ఉష్ణము సమానమె
సాయిభాష్యములే !భాగవతం!
శక్తి
ఆత్మయే సాటిలేనిదని గురునితోడ యది విప్పమని
చీకటి
తొలగ కాంతులలరునని జలముల దివ్వెలు పలికెనులే !భాగవతం!
( స్పందిచే హృదయానికి బాబారూపురేఖలు, వారి నివాసము, నిత్యకృత్యాలు అందించే మౌన సందేశాలెన్నో! 1994 విజయదశమి, అక్టోబర్ 18 వ తారీఖు ప్రేరణకు అక్షర రూపమే పై ద్వారకామాయి భాగవతము.)
శ్రీసాయి కరుణా కిరణాలు అందరిపై ప్రసరించుగాక!
( స్పందిచే హృదయానికి బాబారూపురేఖలు, వారి నివాసము, నిత్యకృత్యాలు అందించే మౌన సందేశాలెన్నో! 1994 విజయదశమి, అక్టోబర్ 18 వ తారీఖు ప్రేరణకు అక్షర రూపమే పై ద్వారకామాయి భాగవతము.)
Comments
Post a Comment