ఏడుకొండల వేంకటేశుడు సాయి
శ్రీసాయినాథాయనమః
శ్రీ తిరుమల వేంకటేశ్వర స్వామి కలియుగ ప్రత్యక్ష దైవము. ఆపద్బాంధవుడు, అనాధ రక్షకుడు. పిలిస్తే పలుకుతాడు. నిత్యసత్యుడు, నిర్మలాత్ముడు. స్వామివారి నిలయము నిత్యకల్యాణము, పచ్చతోరణము. కాని భక్తులు మొక్కులు మరచితే వడ్డీతోసహా వసూలుచేస్తాడు శ్రీ వరద వేంకటేశ్వరుడు. మరి సద్గురు శ్రీ సాయినాథులు యెంతటి మహిమాన్వితులు, యెంతటి విశ్వవ్యాపకులు, యెంతటి భక్తజన చింతామణి! స్వామి వారి మహిమకు, సాయినాథుల మహిమకు పెద్దతేడా నాకు కనుపించదు. కాని ఒక్కవిషయంలో ఓచిన్న తేడా! అదేమిటంటే సాయినాథులు ఋణపడిన తమభక్తుల నుండి దక్షిణ గ్రహించి వారిని ఋణవిముక్తల జేసేవారు. కాని శ్రీ వేంకటేశునిలా వడ్డీని వసూలుజేసిన దాఖలాలు లేవు. గోవానుండి వచ్చిన ఓ పెద్దనుండి కేవలం 15 రూపాయల దక్షిణ పొందారేగాని, యెన్నో సంవత్సరాలుగ మరచిన వడ్డీని మాత్రం వసూలుజేయలేదు. కావున మరింత దయాళుగ కన్పిస్తారు. మరొక్క విషయం. ఇండోరు హైకోర్టు జడ్జి శ్రీ ఎం.బి రేగేవారు బాబా పరమభక్తులు. వారిని తమ ఉపాసనా దైవం శ్రీమన్నారాయణుడు సాయిబాబా చెంతకు, స్వప్న సందేశమిచ్చి పంపుతారు. ఇష్టదైవం తృప్తి చెందితే, మన ప్రవృతికి తగిన సద్గుని జూపుతారట! వ్యక్తిగతంగా నేను బాబామార్గంలోకి రాకపూర్వం 1993 సంవత్సరానికి ముందు, శ్రీవెంకటేశ్వర స్వామిని దర్శించుకొను చుండేవాడిని. మా కుటుంబ ఆరాధ్యదైవము శ్రీ వేంకటేశ్వరస్వామియే. ఆస్వామియే మా కుటుంబాన్ని బాబాచెంతకు పంపారనేది నా విశ్వాసం, నమ్మకం. అలాగే యితర దైవములతో పోలిస్తే, శ్రీసాయినాథులు యెంతటి కరుణామయులో పరిశీలిద్దాం!
వేంకటేశుడు సాయి
ఏడుకొండల వేంకటేశుడు సాయి, వేంకటేశుడు సాయి
వడ్డి
కాసులా ఊసునెత్తబోడు , ఊసునెత్తబోడు
, ఊసునెత్తాబోడు
ద్వారకామాయిన
చిన్నికృష్ణుడు
సాయి, చిన్నికృష్ణుడు సాయి
కల్లబొల్లిమాట
నొల్లనొల్లాబోడు,నొల్లనొల్లాబోడు,నొల్లనొల్లాబోడు || ఏడుకొండల||
కోదండపాణియె
రామచంద్రుడు
సాయి, రామచంద్రుడు సాయి
నమ్మీనవారల
నడవి
నంపబోడు, నడవి నంపబోడు, నడవి
నంపబోడు || ఏడుకొండల||
హిమగిరీ
శిఖరాల పరమశివుడూ
సాయి,పరమశివుడూ సాయి
మరులు
గూర్పు వార మరిగాల్పబోడు ,మరిగాల్పబోడు
,మరిగాల్పబోడు || ఏడుకొండల||
దుష్ట
శక్తుల గూల్చు , ఉగ్రశక్తియె సాయి,ఉగ్రశక్తియె సాయి
ఆది శక్తీ యటుల భయము
గొల్పబోడు, భయముగొల్పబోడు, భయముగొల్పాబోడు || ఏడుకొండల||
సాయి
యనగ దత్తరూపమే భాయి! సాయీయనగ
శాంత కూటమేనోయి !!
శ్రీసాయి కరుణా కిరణాలు అందరిపై ప్రసరించుగాక!
స్వామి వారి మహిమకు, సాయినాథుల మహిమకు పెద్దతేడా నాకు కనుపించదు. కాని ఒక్కవిషయంలో ఓచిన్న తేడా!
ReplyDelete