పరమపద సోపానం!

శ్రీసాయినాథాయనమః 

పరమపద  సోపానం!

పరమపద సోపాన పటమిది
పాము నిచ్చెన లిచ్చటా
భయము వలదులె  సాయిదేవుల
అభయ హస్తమునుండగా

మబ్బుతాకెడి  శిఖరమున్నవి
పోరులిచ్చట  ఓనరా
కాలుజారిన జీవి బతుకిట
జాడతెలియని  లోయరా                                     | పరమపద సోపాన పటమిది |

భార్య భర్తల బంధమిచ్చట
చక్కనైతే ముచ్చట
చిచ్చు రగిలిన రచ్చ అదియే
పచ్చినిజమిది పాంధుడా                                   | పరమపద సోపాన పటమిది |

పుత్రులెక్కిన పదవు లిచ్చట
సుఖము తండ్రికి సోదరా
శత్రువై ఇట కాలుదువ్విన
తాలు, తండ్రికి తెలియరా                                    | పరమపద సోపాన పటమిది |

కోటి కోటుల చేయుటందుకె
పాటు జీవికి చూడరా
రాగమెచ్చిన రోగమొచ్చును
రక్తపోటులె రాఘవా                                          | పరమపద సోపాన పటమిది |

తీపి తీపుల తిండులున్నవి
విందు పండుగలందురా
తీపి కుదరక పోతె మేహము
పొంచియున్నది చెంతరా                                    | పరమపద సోపాన పటమిది |

లోకమిచ్చట గొప్పవాడని
ఎత్తులెత్తుట సబబురా
సత్తు రూకవె పదవి తొలగిన
పరమునెరుగర .. నరా                                   | పరమపద సోపాన పటమిది |

గురువు లిచ్చట దారిజూపిన
గుడిని చేరెద వీవెర
గురువె కాలు....,  కాలుజారిన
గూడు ఎక్కడ చూడగా                                     | పరమపద సోపాన పటమిది |        

సాయి నిచ్చెన పరము జేర్పగ
హాయిపొందుము సోదరా
బాబ భక్తితొ సేవ జేయగ
భాగ్యమంతయు నీకెరా
సౌ... భాగ్యమంతయు నీకెరా...                         | పరమపద సోపాన పటమిది |

శ్రీసాయి కరుణా కిరణాలు అందరిపై ప్రసరించుగాక!
అందరికి శుభమగుగాక!ఓంసాయి శ్రీసాయి జయజయ సాయి!






Comments

  1. In the ups and downs of life, get the lift with Sai Baba!

    ReplyDelete

Post a Comment

Popular posts from this blog

శ్రీ సాయి అష్టకము (Sri Sai Ashtakam with English translation )

సాయి మంగళం! ( ఆరతి సాయిబాబా!)

Commonality in the messages of Jesus Christ and Shirdi Sai Baba!