శ్రీసాయికృష్ణలీలామృతము


శ్రీసాయినాథాయనమః 

పాఠక సాయిబంధువులందరికి  హృదయపూర్వక జన్మాష్టమి శుభాకాంక్షలు!

ముందుమాట!
శ్రీకృష్ణ జన్మాష్టమి 1994 సంవత్సరములో ఆగష్టు 29 తేదీన వచ్చినది. షుమారు ఓ నెలరోజులముందుగ   ఆలోచన కలిగినది. సాయిబాబా ఎన్నో మహిమలు, లీలలు చూపారు. అలాగే శ్రీకృష్ణ పరమాత్మకూడ బాలప్రాయంలోనే ఎన్నెన్నో అద్భుత లీలలు చూపారు. సాయిబాబా బూటీ వాడలోని మురళీధరుడుగదామరి శ్రీకృష్ణ లీలలకు , బాబా లీలలకు ఏమైనా పోలికలున్నాయా అనే తలంపు వచ్చినది. ఆలోచన కలిగిన రెండు రోజుల తర్వాత ఈనాడు పేపర్ చదువుతున్నాను. కొన్నిపేజీల తర్వాత పేజీలో క్రిందభాగంలో శ్రీకృష్ణ లీలల సచిత్ర ధారావాహికం ప్రచురింపబడినది. అదే లీలా ప్రారంభ సంచిక. ఆలా నాలుగు వారాలు భాగవతంలోని కృష్ణలీలలన్నీ ప్రచురింప బడ్డాయి. నేను నాలుగు వారాల లీలను సేకరించడం జరిగింది. పరిశీలించిన పిమ్మట  నాకే ఆశ్చ్యర్యం కలిగే విధంగా, ప్రతి శ్రీకృష్ణ లీలకు బాబా లీల పోలిక కనబడినది. అలా శ్రీకృష్ణ జన్మాష్టమి సమయానికి శ్రీసాయికృష్ణ భాగవతం పూర్తయినది. వ్యవహారమంతా సాయి ప్రేరణగా తలుస్తాను. ఇప్పటికీ సాయి బాబా  గుర్తురాకుండా  శ్రీకృష్ణ పరమాత్మను గూర్చి చదవలేను, అలాగే శ్రీకృష్ణ పరమాత్మ మది మెదలక సాయిపరమాత్మను స్మరించలేను. వారిరువురు ఒకే పరమాత్మ నాణానికి రెండు వైపులనే భావన కలుగుతుంది.     

యథా యథాహి  ధర్మస్య గ్లానిర్భవతి భారత
అభ్యు త్తాన  మధర్మస్య తదాత్మానాం సృజామ్యహం                 గీత: 4:7
(ఓ అర్జునా! ఎపుడెపుడు ధర్మానికి హాని కలుగునో, అపుడపుడు 
ధర్మరక్షణార్థము స్వయముగ అవతరించెదను.)

శ్రీ సాయిలీలామృతము  మధురము అతి  ప్రియము  ప్రియము, లీలల ఘనలీలల,  శ్రీ కృష్ణలీల భాగవతము


కృష్ణ జన్మ రహస్యము రాక్షస సంహారమె
ధర్మరక్షణార్థమే మహావిష్ణు అవతారము
కలి ఇచట థర్మగోవు ఒంటికాలు కుంటుచుండ
ఇల వెలసెను సాయీశుడు ధర్మమును నిలుపగను                   | శ్రీ సాయిలీలామృతము |

బాలకృష్ణ జననము మథురలొ చెరసాలయె
దేవకి సుత వాసము గోకుల యశోద గృహమె
తెలియరాని గుహ్యమదియె సాయినాథ జననము
షిరిడియె  బృందావనము సాయిదేవ నిజవాసము                      | శ్రీ సాయిలీలామృతము |



కంసమామ పంపున పెక్కురక్కసి మూకలు
విధ్వంసము సేసెను గోవిందుని వాసము
కలిమాయతొ  వెల్లువాయె కామ క్రోధ మోహములు
జనజీవన మాయెలె అల్లకల్లోలము                                               | శ్రీ సాయిలీలామృతము |

లీలలెన్నొ చూపెలె గోకుల ప్రియ తిలకము
అవలీలగ రక్కసుల నేల కొరగ జేసెను
సాయి సాయి యటులనె జగతి జనుల గాచెను
రోగముల  వేదనల త్రుటిలొ ద్రుంచివేసెను                                     | శ్రీ సాయిలీలామృతము |


చిరువేలిపై  చిన్మయుడే గోవర్ధనం నిలిపెను
గోవుల గోపాలుర విస్మయముగ బ్రోచెను
ప్రళయమదియె గర్జనల షిరిడి ప్రజయె  కంపింప
శాంతిపగ శాసించె కనుసైకల సాయిదేవ                                      | శ్రీ సాయిలీలామృతము |


తనదు చిన్న నోటిలోనె  విశ్వంబును జూపింప
యశోదమ్మ విస్తుబోయె వాస్తవము గ్రహించి
ఇష్టదైవ రూపముల  ఆశ్రీతులు    కనులజూడ
విశ్వరూపుడయ్యే సాయి భక్తకోటి మిగుల పొగడ                          | శ్రీ సాయిలీలామృతము |

సృష్టికి ప్రతి సృష్టిజేసి గోవుల గోపాలుర
తమ గృహముల వెడల జేసె నందలాల గోపాల 
నీరు నిప్పు సృష్టించి నీటితోటె వెలుగునిచ్చి
సృష్టినె మరలజూపె సృష్టికర్త యనగ సాయి                             | శ్రీ సాయిలీలామృతము |  
నవనీత చోరుడు నందగోపాలుడు
గోపికల మనసులనే దొంగిలించె వెన్నలా
సూదంటు శిలయె సాయి   తనభక్తుల నీడ్చగా
తనువులూ మనసులూ,  వశములు పరవశములే                        | శ్రీ సాయిలీలామృతము |


మురళీ రవ హాయికి లోకువాయె లోకాలు
మైమరపులు గోవులకు  గోపిక గోపాలురకు
తర తమ భేదము మరచి హాయినొందె జీవకోటి
సాయిచూపు తాకినంత  సాయి రూపు కనులనిండ                  | శ్రీ సాయిలీలామృతము |

బహుశిరముల నురగ రాజు కాళీయుని మర్థించి
పడగలపై నర్తించె ద్వాపరయుగ అవతారము
శ్యామ నాగ విషము విరచి ప్రాణంబుల రక్షించె
కృష్ణ యవతారుడనగ ద్వారకమయి సాయిదేవ                        | శ్రీ సాయిలీలామృతము |


గోపిక గోపిక క్రీడల నల్లనయ్య కృష్ణయ్య
గోపిక లందరి గృహముల చల్లనయ్య కృష్ణయ్య
యశోదమ్మ ముంగిట అల్లరయ్య కృష్ణయ్య
ఒక్కడే కృష్ణయ్య ఇచట నచట చూడరయ్య                             | శ్రీ సాయిలీలామృతము |

ద్వారకమయి  నీడనెపుడు  వీడని సాయన్న
జాంనేరు లీల చూపేలె బహునేర్పరి సాయన్న
హేమాద్రిపంత్ విందుకాయె   హాజరు సాయన్న
ముందు పలికి గయలో విందు సేసె సాయన్న                         | శ్రీ సాయిలీలామృతము |


అక్రూరుని పూర్వ జన్మ సుకృతమది యేమొ గాని
జలవాటిక విష్ణురూప దర్శనమదె కృష్ణమాయ
శిలవేదిక మసీదున దశరూపుడు సాయిదేవ
దశ దిశల ఖ్యాతి వెడల  ఆశ్రీ..తుల మాయతొలగ                     | శ్రీ సాయిలీలామృతము |

కురూపికి రూపమిడియె కృష్ణ భక్త బాంధవుడు
సుధామునికి కుసుమములతొ విభవమొసగె మాధవుడు
కుష్టురోగ ముక్తుడాయె భాగోజీ బాబా చలువ
కలకండతొ  భాగ్యమొందె  చోల్కర్  బాబ  వలన                     | శ్రీ సాయిలీలామృతము |

మేనమామ నేలగూల్చి  అవనిభార మంతరించి
తనవారల హితముసేసె  మురారియె యిలలొ మేటి
అంతరంగ రిపువర్గము అంతరింపజేయ బలికి
శరణుగోరు వారినెల్ల లీల గాచె సాయి షిరిడి                              | సాయిలీలామృతము |



సాందీపుని శుశ్రూషతొ  సకలవిద్య లభ్యసించి
దక్షిణగా గురుపుత్రుని తిరిగితెచ్చి ముదముగూర్చె
శ్రద్ధాసహన దక్షిణలగ సాయిదేవ గురునిసేవ
బహుకాలము జేసి జేసి  కలియుగ అవతారుడాయె                 | సాయిలీలామృతము |

తదాశ్రయ భక్తకోటి రక్షణ నిమిత్తమే
ద్వారక  నిర్మాణ మాయె సాముద్ర గర్భమున
ద్వారకా మయి యదియె సాయిదేవ ప్రియవాసము
కలిబాధల భువి మానుపు కన్నతల్లి ప్రియ గర్భము                 | సాయిలీలామృతము |

మనసిచ్చిన రుక్మిణీ రాక్షస వివాహమాడి
రక్కసులా నచట గూల్చె శ్రీకరుడూ ముకుందుడు
గతికోరిన వారల శీఘ్రగతి రక్షించు సాయి
అభయ మొసగి శుభముగూర్చు వాస్తవంబు నాడు నేడు        | సాయిలీలామృతము |


శమంతక మణియదియె బహుసంపద ప్రదాయిని
కేశవుడది త్యజియించి  మోహమునే జయించిలె
సచిదానంద గురువె సాయి ద్వారకా మయిలొ
ఇహసంపద నిరశించి పరసంపద నందించె                                 | సాయిలీలామృతము |

గుప్పి డవియె కుచేలుని అటుకులు శ్రీకృష్ణునికి
లేమితొలగ కలిమిజేసె తనదుబాల్య మిత్రునికి
భక్తి కుదిరినేని యింత శ్రద్ధ కలిగెనేని యింత   
శత గుణక ఫలము గలుగు సిరిసంపద సాయినింట                    | సాయిలీలామృతము |


బహుళాశ్వ  శృతిదేవుల గోవిందుడె విందుపొంద
హృదయమందు  రాజుపేద  ఒకరను సందేశమాయె
భాగోజీ బూటియుల సమదృక్కుల సేవలంద
సాయి మనము కలిమి లేమి ఏకమనే భావమాయె                   | సాయిలీలామృతము |

మేనత్త కుంతిపుత్రు పాండవులా యెల్లవేళ
కురుయోధుల కపటంబుల రక్షించెను కృష్ణదేవ
అక్క బాయిజ బాయి పుత్ర తాత్య మరణవేళ
తనదు ప్రాణంబులా ఫణముసేసె సాయిలీల                                | సాయిలీలామృతము |


అష్టమి పుట్టినవానికి అష్టపట్ట మహీషిలే
గీతబోధ యోగేశ్వర నిత్యశోభ లాలసయే
అష్టదిక్పాలకులతొ  సాయిదర్బారులే
సాయిలోక పాలకుడే నిత్య అప్రమత్తుడే                                      | సాయిలీలామృతము |


వనమాలికి వందనాలు శిఖిపించికి చందనాలు
గురుసాయికి ప్రణామాలు సుఖసంపద లీనాడు
ద్వారకమయుని కివే హృదయకుసుమ పరిమళాలు
కృష్ణలీల సాయిహేల శ్యాము బ్రోవ యెల్లవేళ                                   | సాయిలీలామృతము |

మంగళమిదె ముకుందునకు దేవ దేవ వందితునకు
మంగళమిదె దేవకీ నందగోవిందునకు
మంగళమిదె గురుసాయి ద్వారకామాయునకు
మంగళమిదె బహురూప దత్తదేవ రూపునకు                                   | సాయిలీలామృతము |


(శ్రీసాయిలీల భాగవతమును భక్తి శ్రద్దల పఠించు భక్తకోటికి శ్రీసాయినాథులు 
సిరిసంపదలు ,సుఖఃశాంతులు ,ఆయురారోగ్యములు సదా ప్రసాదించుటకై ప్రార్ధింతును!)

సమర్ధసచ్చిదానందసద్గురు శ్రీసాయినాథ్ మహారాజ్ కి జై!
శ్రీసాయికరుణాకిరణాలు అందరిపై ప్రసరించుగాక 1
అందరికిశుభమగుగాక !
ఓంసాయి శ్రీసాయి జయజయ సాయి!



Comments

  1. శ్రీకృష్ణ లీలలకు, శ్రీ షిరిడి సాయినాథుని లీలలకు ఎంతో సారుప్యముంది, అందుకే ఈశీర్షిక శ్రీసాయికృష్ణ భాగవతము.

    ReplyDelete

Post a Comment

Popular posts from this blog

శ్రీ సాయి అష్టకము (Sri Sai Ashtakam with English translation )

సాయి మంగళం! ( ఆరతి సాయిబాబా!)

Commonality in the messages of Jesus Christ and Shirdi Sai Baba!