ఎంత ధన్యు లెంతధన్యులు!
శ్రీసాయినాథాయనమః
ఎంత ధన్యు లెంతధన్యులు!
ఎంత ధన్యులెంత ధన్యు లెంత ధన్యులుసాయిని సేవించిన భక్తాగ్ర గణ్యులు
సాయినామ కరణకర్త భక్త మహల్సాపతియె
కుష్టువ్యాధి భాగోజి సాయినిత్య సేవకుడె
వచ్చిపోవువారి సేవ రాధామాయి సేసెలె
అర్చనా ఆరతులా జోగు అడుగు ముందులే || ఎంత ధన్యులెంత ||
శ్యామా ఆ శ్యాముడే సాయికి బహుముఖ్యుడె
అల్లునిగా విలసిల్లిన తాత్యా జన్మ ధన్యములె
సాయిగాన అమృతమును దాసగణు పంచెనులె
సాయిలీల గాథల చాందోర్కరు వినిపించెలే || ఎంత ధన్యులెంత ||
బాయిజమాయి తమ్మునిగా, తల్లిప్రేమ చూపించే
తార్ఖడు శ్రీమతియె వంగకూర విందుసేసె
చక్కెర కలకండతొడ చోల్కరు అర్చించే లే
గింజలున్న ద్రాక్షలతొ కాక సేవించెలే || ఎంత ధన్యులెంత ||
బిల్వార్చన గంగల మేఘ సాయి కర్పించేలె
కాషాయరంగు దుస్తుల గురుని మూలె చూసెలె
షిరిడిలోని విఠలునిగా గౌలిబువా తలచెలె
ఇష్టదైవ రాముని రామదాసి పొందెలె || ఎంత ధన్యులెంత ||
శ్రీ.. రామనవమి వేడుకల భీష్మ జరిపించెలె
ఉర్సు ఉత్సవంబు గోపాలరావు నడిపించెలె
చందనోత్సవమును షక్కరు కల్పించెలె
సాయిసత్య వ్రతముల భీ... మాజి నెలకొలిపిలె || ఎంత ధన్యులెంత ||
సాయీశుని రాకపోక లెండి వనము ధన్యమె
కోటీశుని బూటి వాడ సాయికి ప్రియ వాసమె
సాయితోడ కూడు తినిన పశు పక్షులు ధన్యమె
హేమాద్రిపంతు బిరుదుతోడ దబోల్కరు పుణ్యుడె || ఎంత ధన్యులెంత ||
సాయినామ గానముతొ, భక్తకోటి ధన్యమె
సాయిచరిత పారణతొ, భక్తకోటి పావనమె
సాయిదేవ అర్చనతొ, భక్తకోటి శుద్ధములె
సాయిభావ ధ్యానముతొ, భక్తకోటి పరవశమే ...
చిత్తశాంతి పరిమళమే.... || ఎంత ధన్యులెంత ||
శ్రీసాయి కరుణా కిరణాలు అందరిపై ప్రసరించుగాక!
అందరికి శుభమగుగాక!
ఓంసాయి శ్రీసాయి జయజయ సాయి!
How fortunate were those devotees who served Saibaba , in mortal form !
ReplyDelete