అందరిలో నన్నేచూడు!

శ్రీసాయి నాథాయనమః 

అందరిలో నన్నేచూడు

అందరిలో నన్నేచూడు    నాలో అందరిచూడు
అంటున్నాడు అంటున్నాడు సాయిబాబా
వింటున్నారా  వింటున్నారా సాధకులారా,
సాయి సాధకులారా......? 

మావిడిపూవులు గంపలకోయ్  ఫలమయ్యేది కొన్నేనోయ్
వచ్చేవారు వెల్లువలోయ్  నిలిచేవారు నల్గురోయ్
నిలిచేవారు నల్గురోయ్  కొలిచేవారు నల్గురోయ్
అంటున్నాడు అంటున్నాడు సాయిబాబా
వింటున్నారా  వింటున్నారా సాధకులారా,
సాయి సాధకులారా......? 

ప్రేమే దైవం తెలియండోయ్   తీయగ మాటలు పలకండోయ్
కలయిక మనదిట బంధమోయ్  కల్లాకపటం మానండోయ్
మానండోయ్ మానండోయ్ కల్లాకపటం మానండోయ్
అంటున్నాడు అంటున్నాడు సాయిబాబా
వింటున్నారా  వింటున్నారా సాధకులారా,
సాయి సాధకులారా......? 

అల్లా అల్లా మాలిక్ హై !    అందరికతడే నాయక్ హై !
నీది నాది ఏముందోయ్  నాలుగురోజుల నాటకమోయ్
నాటకమోయ్ నాటకమోయ్ నాలుగురోజుల నాటకమోయ్
అంటున్నాడు అంటున్నాడు సాయిబాబా
వింటున్నారా  వింటున్నారా సాధకులారా,
సాయి సాధకులారా......? 

దేవుని రాజ్యం అందరిదోయ్  జీవుల కాతడు తండ్రేనోయ్
పశువుల పక్షుల ఉన్నాడోయ్  పల్లకిబోయడు తానేనోయ్
తానేనోయ్ తానేనోయ్ పల్లకిబోయడు తానేనోయ్
అంటున్నాడు అంటున్నాడు సాయిబాబా
వింటున్నారా  వింటున్నారా సాధకులారా,
సాయి సాధకులారా...... ?

సద్గురు సారధి చేయండోయ్  పగ్గములాతని కివ్వండోయ్
పగ్గము లాతని కివ్వండోయ్  దండిగ పండగ చేయండోయ్
చేయండోయ్ చేయండోయ్ దండిగ పండగ చేయండోయ్
అంటున్నాడు అంటున్నాడు సాయిబాబా
వింటున్నారా  వింటున్నారా సాధకులారా,
సాయి సాధకులారా...... ?

వెలుగుల దివ్వెగ మారండోయ్  ఇతరుల దివ్వెల చేయండోయ్
బాబకు ఆరతు లివ్వండోయ్  భావాతీతము పొందండోయ్
భావాతీతము పొందండోయ్   బాబా...  ఆసీసు లొందండోయ్ !


శ్రీసాయి కరుణాకిరణాలు అందరిపై ప్రసరించుగాక!
అందరికి శుభమగుగాక!
ఓంసాయి శ్రీసాయి జయజయ సాయి!



Comments

Post a Comment

Popular posts from this blog

సాయి మంగళం! ( ఆరతి సాయిబాబా!)

Commonality in the messages of Jesus Christ and Shirdi Sai Baba!

శ్రీ సాయి అష్టకము (Sri Sai Ashtakam with English translation )