సాయి సామ్రాజ్యంలొ పౌరులౌదాము!
శ్రీసాయినాథాయనమః
దేశమంటే మట్టికాదోయ్, దేశమంటే మనుషులోయ్ అనే మహాకవి గురజాడవారి సందేశం మనందరమెరిగిన విషయమే. అలాగే మనుషులందరికి తమ తమ దేశ పౌరసత్వముంటున్నది. భాగ్యవంత దేశాలు కావచ్చు, సామాన్య దేశాలు కావచ్చు, పౌరులెవరూ సమస్యల వలయానికతీతులుకారు. ఎదో విధమైన సమస్యలు బాధిస్తూనే ఉన్నాయి. ఇలాంటి సమస్యలకతీతంగా జీవించే జీవన సత్యాలెన్నింటినో సాయిబాబా ప్రబోధించారు. ఆ ప్రబోధాల నాచరించి ఎందరో మహానుభావులు శాంతి సౌఖ్యాల పొందియున్నారు, పొందుచున్నారు, ఇతరులకు మార్గదర్శకు లవుచున్నారు. ఆ మార్గంలో పయనించి జీవితాల సుఖమయం జేసుకోవడం, ప్రస్తుతకాలానికెంతో ఆవశ్యకము,ప్రయోజనకరమూ కదా !
సాయిసామ్రాజ్యంలొ పౌరులౌదాము,సాయి మా రాజుని చూసి తరి యిద్దాము II2II
పంచవన్నెలా పతాక మెగిరేను ,ఓంకార మందున మధ్య నిలచేను
పతాక వందనము నిత్యమూ చేదాము , చీకులా చింతలా పక్కనెడదాము ||సాయి||
భక్తి భావముల సాయిని కొలచెదము ,
నిత్య ఆరతులా మనమున నిలిపెదము
శక్తీ యుక్తులతోడ సాయి సేవిద్దాము
, సరిలేని సిరులందు తేలియాడెదము ||సాయి||
కూటికి గుడ్డకు లోటులేదూ యచట , సాయినీడయె చూడ గూడుగా అందరికి
ఉరుకులూ పరుగులూ లేని సామ్రాజ్యంలొ
,హాయిగా జీవనము గడపెదము మనము
||సాయి||
కులములూ లేవచట మతములూ లేవచట , విచ్చుకత్తుల మోత వినిపించదూ యచట
మనుషులందరు చూడ భాయిభాయియె నచట,మనసులందరిలొ సాయిసాయియె నచట ||సాయి||
సాయిసరకారులో సోమరులు లేరులే , తమతమా కర్మలా నిష్ణాతు లందరే
సాయిదరాబారులో భేదాలు లేవులే , పేదోళ్ల గొప్పోళ్ళ భావమే లేదులే ||సాయి||
శోకాలు లేవులే రోగాలు లేవులే ,భవరోగము బాపు సాయిదేవుల చెంత
కోపాలు లేవులే తాపాలు లేవులే ,కొలువు దీరిన సాయిదేవుని ఇంట ||సాయి||
పల్లె పల్లెలా పాఠశాలలే చూడు , మిధ్య దాటు విద్య సాయిదేవులు జెప్పు
ఆట పాటలతోట హాయిగా అందరము , పూలబాటలలోన జీవనము చేయంగ ||సాయి||
వినోదక్రీడలకు లోటు లేదూ అచట , సాయిలీలల ఏన్నొ క్రీడలున్నాయి
రోజుకో క్రీడగా రోజుకో లీలగా , సాయిలీలలయందు బాలలై పోదము ||సాయి||
శ్రీసాయి కరుణా కిరణాలు అందరిపై ప్రసరించుగాక!
Comments
Post a Comment