సాయి ఊయల
శ్రీసాయినాథాయనమః
ఉయ్యాల ఊగటానికి అందరు ఇష్టపడతారు. ఎంతో ఆనందం, ఎంతో ఉద్వేగం! ప్రస్తుతకాలంలో పెద్దగా లేకున్నా, కొంతకాలం క్రితం వరకు గ్రామాలలొ, పల్లెల్లో ఎంతో ప్రాచుర్యం పొందిన శ్రావణమాస సంబర క్రీడ. మరి బాబాకి ఉయ్యాలతో ఎలాంటి సంబంధముంది? ఇది అర్ధం చేసుకోవాలంటే కొంచెం మనఊహలకు రెక్కలివ్వాలి. బాబా అవతారకార్య పరమార్థం, సాధారణ మానవులను, అసాధారణ తీరాలకు జేర్చి , వారి అంతరంగంలో చైతన్య స్రవంతుల నింపడమే! వారు అవతరించిన భూలోకం బాబాకూర్చున్న ఊయలకు ఆధార పీఠం. వారు ఉత్సాహంతో ఎంతో, మరెంతో ఎత్తైన భావాతీత తీరాలవరకు ఊగుచున్నారు. మరల క్రిందకొస్తూ మరల మరల ఊగుచున్నారు. తెలివిగా మనం వారి పాదాల పట్టుకొంటే , మనంకూడ ఆ సుందర లోకాల్లో విహరించగలం. తానప్రమత్తుడనని బాబా భక్తులకు భరోసా ఇస్తున్నారు, ఏమాత్రం మధ్యలో విడువనంటున్నారుసుమా ! ఊహలా అనిపించినా, ఇదే బాబా అవతారకార్య పరమ రహస్యం!
ఉయ్యాల ఉయ్యాల ఉయ్యాల!
ఉయ్యాల ఉయ్యాల ఉయ్యాల , సాయి ఊగెలే యుగేలే ఈవేళ
చూడాలి చూడాలి ఉయ్యాల ,సాయి ఊగిన ఊగిన ఈవేళ
భూదేవి అలరిన ఆసన ఫలకము ,ధ్యాన తరంగాలే వేలాడు బంధాలు
వైకుంఠ మదియేలే ఆధారకేంద్రము ,సుక్కల్లొ సెంద్రుడు సాయి ఊగేలే .... ఓ ఓ ..ఓ ఓ .. ఓ ఓ. ఓ !ఉయ్యాల ఉయ్యాల!
దయగల హృదయమే సుకుమార పీఠము , జగతిప్రేమయె ఊఫుల కూతము
కరుణ కటాక్షాలే ఊయల
గాలులు , దూర దూరాల ఊయల ఊగెలె ....ఓ ఓ ..ఓ ఓ .. ఓ ఓ. ఓ !ఉయ్యాల ఉయ్యాల!
క్రీగంటి చూపులే సాయి దేవునివి , ఆవైపు ఈవైపు చూచు చున్నవి
పాదపద్మాలే భక్తుల జూపుచు , ముల్లోకముల ఊయల సాగేను .... ఓ ఓ ..ఓ ఓ .. ఓ ఓ. ఓ !ఉయ్యాల ఉయ్యాల!
గురుదేవ పాదముల భద్రముగ పడదాము , మదినిలిపి
శ్రధ్ధతో పెనవేసు కొందాము
అప్రమత్తుడే
సాయి చిత్రముగ రక్షింప,ఊయల ఊపుల తీయ,లోకాలె చూపంగ.... ఓ ఓ
..ఓ ఓ
.. ఓ ఓ.
ఓ !ఉయ్యాల ఉయ్యాల!
శ్రీసాయి కరుణాకిరణాలు అందరిపై ప్రసరించు గాక!
Comments
Post a Comment