నవవిధ భక్తులు

శ్రీసాయినాథాయనమః 

శ్రీసాయి చరిత్రలో అంకెలకు చాల ప్రాముఖ్యతయుంది. ఉదాహరణకు 2,5,6,9,11 మొదలగునవి. శ్రద్ధ,సహనము నకు ప్రతీక 2, పంచప్రాణాలు,పంచేంద్రియాలు,మనసు,బుద్ధి,అహంకారములకు ప్రతీక 5;
అరిషడ్వార్గాలు 6, కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యాలు.
నవవిధ భక్తి 9, శ్రవణము,కీర్తనము,స్మరణము,పాదసేవనము,అర్చనము,నమస్కారము,దాస్యము,సఖ్యత,
ఆత్మనివేదనము.
బాబా ఏకాదశ సూత్రాలు 11.

బాబా తమ మహాసమాధికిముందు, లక్ష్మీబాయి షిండేకు ఆమెసేవకు ప్రతిఫలమన్నట్లుగా 9 వెండినాణాలు దానం చేసారు. వాటిని ఇప్పటికి  భద్రపరిచారు, 1994 లో షిరిడీలో  దర్శించాను. ప్రస్తుతము దసరా నవరాత్రులు  9 రోజుల వేడుకలు ప్రారంభమైన శుభ తరుణంలో పైచెప్పిన తొమ్మిది భక్తిమార్గాల్లో  మనసుకు, సాధనకు నచ్చిన ఎదో ఒక మార్గాన్ని ఎంచుకొని బాబాను సేవించడం సాయిభక్తులందరికి యెంతో శుభము,శ్రేయస్కరము.ఈ పవిత్ర  నవరాత్రి సమయంలో  శ్రీసాయిసచ్చరిత్ర 7 రోజుల (గురువారంతో ప్రారంభించి) పారాయణము కూడ ఎంతో ఫలదాయకముగా చెప్పబడినది. బాబా శక్తిస్వరూపులు. వారు స్వయంగా చెప్పిన మాటలను స్మరించుదాము.

" ఈ జగత్తును నడిపించువాడను,సూత్రధారిని నేనే. నేనే జగన్మాతను, త్రిగుణముల సామరస్యమును నేనే.  సృష్టి స్థితి లయ కారకుడను నేనే. ఎవరైతే తమదృష్టిని నావైపు త్రిప్పెదరో వారికేహానిగాని బాధకాని కలుగదు. నన్ను మరచినవాని మాయ శిక్షించును. చరాచర జీవకోటియంతయు నా రూపమే! "  శ్రీసాయిసచ్చరిత్ర, అధ్యాయము 3.కావున బాబాకు చేసిన సేవ అమ్మవారికి చేసినటులనె !  బాబా మరియు అమ్మవారి అశీసులు సాయిభక్తులందరికి మెండుగా, దండిగా లభించగలందులకు హృదయపూర్వకముగా ప్రార్థిస్తున్నాను. 

నవవిధభక్తులు 

నవవిధ భక్తులతో నిన్నే కొలచెదరా
నాలుగు అర్ధములా నాకిల నీయవయా
శ్రద్ధా సహనములే   నేనిడు దక్షిణయా
నీపదసంపదనే నా యెద నింపవయా
  బాబా, బాబా, బాబా...., 
షిరిడీ షిరిడీ, షిరిడీ షిరిడీ,   షిరిడీ ...... బాబా!

లీలల నీకథ శ్రవణము జేయుచు లోకము మరచెదరా
కీర్తన గానము మరి మరి సేయుసు చిందులు వేసెదరా
స్మరణము స్మరణము అనుక్షణము నీ స్మరణము మరువనురా
పాదము పాదము సద్గురు పాదము నేనెల విడుతునురా
  బాబా, బాబా, బాబా..... ,
షిరిడీ షిరిడీ, షిరిడీ షిరిడీ,   షిరిడీ ...... బాబా!                                        ||నవవిధ భక్తులతో||  

తనువుతొ మనసుతొ సతతము నీకే అర్చన సేతునురా
దినమును రాత్రము నీసన్నిధినే వందనమిడుదునురా
మనమందిరమునె మరిమరి నూడ్చుచు దాస్యము సేతునురా
నెయ్యము కయ్యము నీవే నాకని  నన్నే మరచెదరా
  బాబా, బాబా, బాబా...., 
షిరిడీ షిరిడీ, షిరిడీ షిరిడీ,   షిరిడీ ...... బాబా!                                       ||నవవిధ భక్తులతో||

శ్రీసాయి కరుణా కిరణాలు అందరిపై ప్రసరించుగాక!
అందరికి శుభమగుగాక!
ఓంసాయి శ్రీసాయి జయజయ సాయి!

జై మా దుర్గే!



Comments

  1. భక్తికి వశులు పరవశులు శ్రీసాయి, బాబాను భక్తితో సేవిద్దాం!

    ReplyDelete

Post a Comment

Popular posts from this blog

శ్రీ సాయి అష్టకము (Sri Sai Ashtakam with English translation )

సాయి మంగళం! ( ఆరతి సాయిబాబా!)

Commonality in the messages of Jesus Christ and Shirdi Sai Baba!