శ్రీ సాయీశ్వరాయ గేయామృతము
శ్రీసాయినాథాయనమః
సాయి శివా సాయి శివా శివ శివ శివ శివ సాయిశివా! సాయి శివా సాయి శివా శివ శివ శివ శివ సాయిశివా!
సాయి హరా సాయి హరా శివ శివ శివ శివ సాయిహరా! సాయి హరా సాయి హరా శివ శివ శివ శివ సాయిహరా !
సాయి హరా సాయి హరా శివ శివ శివ శివ సాయిహరా! సాయి హరా సాయి హరా శివ శివ శివ శివ సాయిహరా !
శ్రీ సాయి శివ స్వరూపులు. శివునిలా భిక్షాటన జేసేవారు.కైలాసవాసిలా శిలావేదికే ఆయనకు సింహాసనం. చిరుగుల అంగియే వ్యాఘ్ర చర్మం. భక్తుల బాధల దాల్చిన గరళకంఠుడు. శివుడు ఆదియోగికాగా, సాయి ఖండయోగి, యోగిరాజు. శివునిలా మన్మధుని కాల్చిన ఆజన్మ బ్రహ్మచారి. ఇరువురు గంగాధరులే. విభూతి ధారణ ఇరువురికి ప్రియం. ఇరువురు బోళాశంకరులే! పరమశివుని నాట్యానికి కైలాసం వేదికైతే, బాబా నృత్యానికి తాకియా రంగస్థలం. ఇరువురికి కోపం ముక్కుమీదే. ఇరువురూ నాగభూషణులే. పరమభక్త మేఘాకు సాయే సాక్షాత్తు పరమేశ్వరుడు. ఇలా చెప్పుకుంటూ పొతే ఎన్నో ఉపమానాలు. కాని ఎందరికో తెలియని మరో గొప్ప పోలిక ఇరువురు తేజోమయ దేహులు. పరమశివుడు ద్వాదశ జ్యోతిర్లింగాలలొ తేజోరూపునిగా విలసిల్లుతున్న విషయం సర్వులకు తెలిసిన సత్యమైనా , సాయిబాబా తమ తేజోమయ దేహదర్శనము అతికొద్దిమందికి మాత్రమే ప్రసాదించారు. ఈ వివరాలు మునుముందు చూస్తాము. ఈవిధంగా షిరిడీ సాయి, కైలాసవాసి పరమశివుడు వేరుకాదు. సాయికి చేసిన అర్చన శివార్చనే, అభిషేకం శివాభిషేకమే; సాయి స్థోత్రము ఈశ్వరస్థోత్రమే; ఈశ్వర స్థోత్రము సాయి స్థోత్రమే!
శ్రీ సాయీశ్వరాయ గేయామృతము
(శ్రీసాయి పరంగా వ్రాసిన శ్రీ నమశ్శివాయ గేయామృతము , అదే బాణీలో.)

సాయీశ్వరాయా... ఓం సదాశివాయ
సాయీశ్వరాయని నా మనసందున
సన్నుతిసేతును నను కడతేర్చుము || ఓం సాయీశ్వరాయ ||
సాయీశ్వరాయను మంత్రము నానా
నరకములను తెగ ద్రుంచునయా || ఓం సాయీశ్వరాయ ||
అతిదీనుడనై అనుదినముననిను
మదిలో దలచెద బ్రోవుమయా || ఓం సాయీశ్వరాయ ||
పతిత పావన పాపవినాశన
పావన సేయవె దయామయా || ఓం సాయీశ్వరాయ ||
ఎంతనివేడుదు పంతమునాపై
సుంతయు దయరా దేలనయా || ఓం సాయీశ్వరాయ ||
బాబా హర హర రూపా... నీ..
చరణములే గతి అంటి నయా || ఓం సాయీశ్వరాయ ||
అండ పిండ బ్రహ్మాండము నంతట
నిండిన జ్యోతివి నీవెనయా || ఓం సాయీశ్వరాయ ||
ఆదియు మద్యము అంతము తెలియని
ఆనందామృత తత్వమయా || ఓం సాయీశ్వరాయ ||
ఇంద్రుడాదిగా సకలసురలకును
ఇష్టదైవమగు మూర్తివయా || ఓం సాయీశ్వరాయ ||
దేవర నామొర ఆలకింపరే
ద్వారకామాయిలొ నిన్ను చేరగ || ఓం సాయీశ్వరాయ ||
ఊది విలేపన నీదగు మోమును
మాయతొలగగా మదిని దలతురా || ఓం సాయీశ్వరాయ ||
ఊరడించినను గావక యుండిన
నోపజాల గతి నీవెనయా || ఓం సాయీశ్వరాయ ||
ఋతువులు మాసములెన్నో గడచెను
వెతలదీర్పనెటు బోదునయా || ఓం సాయీశ్వరాయ ||
ఎందుకు నీదయ రాదు పరాత్పర
మందుడనని కడు కోపమయా || ఓం సాయీశ్వరాయ ||
ఏమియు తెలియని దీనుడనైతిని
పామరముడిపియు పాలింపగవే || ఓం సాయీశ్వరాయ ||
ఐక్యస్వరూపము తెలిపిన జాలుర
ఆనందాంబుధి మునిగెదరా || ఓం సాయీశ్వరాయ ||
రెండక్షరముల నీదు నామముతొ
సకలంబులకు సాక్షివయా || ఓం సాయీశ్వరాయ ||
ఓంకారాత్మక మయమగు బ్రహ్మము
నొందెడు మూలము తెలుపవయా || ఓం సాయీశ్వరాయ ||
ఔరా ఏటికి నీదయ రాదుర
అంత కఠినమా హర హర, హర హర || ఓం సాయీశ్వరాయ ||
అంతయు నీవై యుండగ వేరే
చింతలు నాకిక నేలనయా || ఓం సాయీశ్వరాయ ||
ఆలకింపుమిక నాదగు మనవిని
అరమరసేయక ఆదిదేవా || ఓం సాయీశ్వరాయ ||
అహర్నిశంబును నీదగు మంత్రము
నను సంధింపగ జేయుమయా || ఓం సాయీశ్వరాయ ||
కమలసంభవాది అమర గణార్చిత
కంజలోచన భావమోచన || ఓం సాయీశ్వరాయ ||
షిరిడి విరాజిత యోగిరాజ ప్రభు
సకల దేవతా సత్త్వ స్వరూపా || ఓం సాయీశ్వరాయ ||
ఘనమగు నీదగు కీర్తిని విని నే
మనమున నమ్మితి గావుమయా || ఓం సాయీశ్వరాయ ||
Sai is Siva, Siva is Sai!
ReplyDelete