సాయి ధ్యానపు దినమదె ధన్యము!

ఓంనమోనారాయణాయ! 


ప్రహ్లాదుని విష్ణుభక్తి పద్యాలు  

"కమలాక్షు నర్చించు కరములు కరములు
శ్రీనాథువర్ణించు జిహ్వ జిహ్వ
సురరక్షకుని చూచు చూడ్పులు చూడ్పులు
శేష సాయికి మ్రొక్కు  శిరము శిరము

దేవదేవునిచింతించు దినము దినము
చక్రహస్తుని ప్రకటించు చదువు చదువు
కుంభినీధవు చెప్పెడి  గురుడు గురుడు
తండ్రి హరి చేరుమనెడి తండ్రి తండ్రి   

కంజాక్షునకు  గాని కాయంబు కాయమే
పవన కుంభిత చర్మ భస్త్రిగాక
వైకుంఠు  బొగడని వక్త్రంబు వక్త్రమే
ఢమఢమ ధ్వని తోడి ఢక్కగాక

హరిపూజనము లేని హస్తంబు హస్తమే
తరుశాఖ నిర్మిత దర్విగాక
కమలేశు జూడని కన్నులు కన్నులే
తనుకుడ్యజాల రంధ్రములు గాక

చక్రిచింత లేని జన్మంబు జన్మమే
తరళస్థలిల బుద్భుదంబుగాక
విష్ణుభక్తిలేని విబుధుండు విబుధుడే
పాదయుగముతోడి పశువుగాక"                       

బమ్మెర పోతన, శ్రీమద్భాగవతము


శ్రీసాయినాథాయనమః 

సాయి ధ్యానపు దినమదె ధన్యము

ధన్యము ధన్యము జన్మయె ధన్యము
సాయిసేవల జన్మయె ధన్యము
పుణ్యము పుణ్యము గమ్యమె పుణ్యము
సాయీబోధల గమ్యమె పుణ్యము

సాయిపూజల కరములె  ధన్యము
సాయివీక్షణ చక్షులె ధన్యము
సాయిపలుకుల జిహ్వయె ధన్యము
సాయిగాథల వీనులె ధన్యము

సాయికై పరుగిడు పాదమె ధన్యము
సాయిని పలికెడి వాణియె ధన్యము
సాయిని పాడెడి గానము ధన్యము
సాయిని మదినిడు ధ్యానమె ధన్యము

సాయితొ కలిగిన స్వప్నమె ధన్యము
సాయికై వేచిన నిముషము ధన్యము
సాయితొ గడపిన క్షణములె ధన్యము
సాయిని మనసిడు స్తోత్రమె ధన్యము

సాయియె నిండిన కొలువది ధన్యము
సాయియె నడచిన ధరణియె ధన్యము
సాయి స్పర్శల శిరిడియే ధన్యము
సాయి మూలముతొ నింబము ధన్యము

సాయి వాహ్వాళుల లెండియె   ధన్యము
సాయి దరబారుతొ మాజిదు ధన్యము
సాయి నిదురల చావడి ధన్యము
సాయి సమాధితొ వాడయె ధన్యము

సాయితొ పొంగిన హృదయమె ధన్యము
సాయికి వంగిన శిరమదె ధన్యము
సాయికి లొంగిన మనసదె ధన్యము
సాయికై తపనల తనువదె ధన్యము

సాయిదేవుల మార్గమె ధన్యము
సాయిసాధన శోధన ధన్యము
సాయిశిరిడియె ముక్తి సొపానము
సాయిభక్తియె శక్తిప్రదాయము

సాయిపాదము చిక్కుట ధన్యము
సాయిభావము దక్కుట ధన్యము
సాయినాథుల నామము ధన్యము
సాయి ధ్యానపు దినమదె ధన్యము

శ్రీసాయి కరుణాకిరణాలు అందరిపై ప్రసరించుగాక!అందరికి శుభమగుగాక!ఓంసాయి శ్రీసాయి జయజయ సాయి!

 




Comments

  1. సాయిస్మరణతో... ఆరోజు ధన్యము!

    ReplyDelete

Post a Comment

Popular posts from this blog

శ్రీ సాయి అష్టకము (Sri Sai Ashtakam with English translation )

సాయి మంగళం! ( ఆరతి సాయిబాబా!)

Commonality in the messages of Jesus Christ and Shirdi Sai Baba!