సంక్షిప్త శ్రీగురుచరిత్ర
శ్రీదత్తాత్రేయాయనమః
శ్రీసాయినాథాయనమః
శ్రీసాయిలీలల పఠించు భక్తులెల్లరకు, వారి కుటుంబసభ్యులకు, మిత్రులు, శ్రేయోభిలాషులకు విజయదశమి శుభాకాంక్షలు. వారలందరిని నిత్యసత్య సమర్ధసద్గురు శ్రీసాయినాథులు, శ్రీగురు దత్తస్వామి, ఆదిపరాశక్తి శ్రీజగన్మాత ఆయురారోగ్య సౌభాగ్యములతొ సుఖశాంతులతొ సదా రక్షించుటకు హృదయపూర్వకంగా, సవినయముగా ప్రార్ధిస్తున్నాను.
సృష్టికర్తయైన భగవంతుడు తానుసృష్టించిన జగతిని ధర్మమార్గంలో నడుపుటకు తానే గురు రూపం దాల్చాడు. ఆగురురూపమే శ్రీదత్తాత్రేయుడు. శ్రీదత్తాత్రేయుడు కలియుగంలో ఇప్పటి వరకు శ్రీపాద శ్రీవల్లభులుగ , శ్రీనృసింహ సరస్వతిగ , శ్రీమాణిక్యప్రభుగ ,శ్రీ అక్కల్కోట మహారాజుగ, శ్రీ షిరిడీసాయిబాబాగ భారతావనిలో అవతరించారు. అన్నిదేశాలలోను, అన్నికాలాలలోను అవతరించిన మహనీయులందరు శ్రీగురురూపులుగా చెప్పబడుతుంది. శ్రీగురుచరిత్రలో మొదటి రెండు అవతారములైన శ్రీపాదశ్రీవల్లభ, శ్రీనృసింహసరస్వతుల వారి అవతారవిశేషాలు, మహిమలు చెప్పబడినవి. వీరు క్రీస్తుశకం 14,15 శతాబ్దములలొ అవతరించారు. శ్రీసాయిబాబా లీలలకు, వీరిమహిమలకు ఎన్నోపోలికలున్నాయి. శ్రీగురుచరిత్రను మరాఠీభాషలో శ్రీసరస్వతి గంగాధరుడు షుమారు రెండువందల సంవత్సరాల క్రితం వ్రాశాడు. తెలుగులో శ్రీ ఎక్కిరాల భరద్వాజగారు అనువదించారు. శ్రీగురుచరిత్ర చాల విపుల గ్రంధమగుటచే తక్కువసమయంలో శ్రీగురులీలలను స్మరించుటకు వీలుగా ఈ సంషిప్త శ్రీగురుచరిత్ర, సాయిబాబా ప్రేరణగా తలచి వ్రాయడమైనది. ప్రధమంగా శ్రీగురుచరిత్ర మూలగ్రంధాన్ని ఓ పర్యాయం పారాయణ చేసినవారికిది ఉపయుక్తంకాగలదని ఆశిస్తున్నాను. మిగిలినవారుకూడ విషయసారమును గ్రహించగలరు.
పూజ్యశ్రీ భరద్వాజగారి మాటల్లో
" ఈకాలానికి సరిపడే మార్పునే సాయి ఆధ్యాత్మికరంగంలోకి తెస్తున్నారు. సద్గురువుని గుర్తించి,సేవించి అనుగ్రహం పొందటానికి " గురుచరిత్ర " పారాయణ , సర్వులూ సంఘటితం కావడానికి " సాయిబాబా జీవితచరిత్ర పారాయణ" , వేద ప్రోక్తమైన వ్యక్తి ప్రాధాన్యతలేని ఆధ్యాత్మికతను నిర్దుష్టమైన సిద్ధాంతంగా రూపొందిస్తూ పురాణేతిహాస సిద్ధాంతముల పద్ధతిని అనుసరించి " చరిత్రపారాయణ " విధానాన్ని అందిస్తున్నారు. ఇదే సాయిచెప్పిన - నూత్న ఆధ్యాత్మిక సిద్ధాంతం "
"శ్రీగురుచరిత్ర పారాయణము శ్రీగురు మానసిక పూజయే, ధ్యానమే. నిత్యపారాయణ అనన్య చింతయే. పారాయణ చేస్తున్నంతసేపూ మనస్సు గురుసన్నిధిలో వుంటుంది గనుక అది సత్సంగమే."
" నాయనలారా నలుగురు ఒక్కచోటఁజేరి పరాయణముచేసేవారు , అందులోని స్తోత్రాలు పఠించేవారు , నామసంకీర్తన చేసేవారు మా ప్రీతికి పాత్రులవుతారు. మా కథామృతగానం చేసేవారింట్లో నాల్గు పురుషార్ధాలు, సిద్ధులూ నిత్యనివాసం చేస్తాయి. జీవితాంతమూ అష్టైశ్వర్యాలు , అటుతర్వాత ముక్తి సిద్ధిస్తాయి. " శ్రీగురుడు

శ్రీగణేశాయనమః,శ్రీసరస్వత్తైనమః,సమర్ధసద్గురు,శ్రీసాయినాథాయనమః,శ్రీగురుదత్తాత్రేయాయనమః !
శ్రీవిఘ్ననాయక సిద్ధిప్రదాయక ,గురుచరిత పలుక దీవింపుమమ్ము
ఓందత్త శ్రీదత్త జైజైదత్త ! ఓందత్త శ్రీదత్త జైజైదత్త !!
బ్రహ్మవిష్ణుశీవ రూపుండవీవు , అత్రిఅనసూయ పుత్రుండవీవు
భక్తపాలనా దక్షున్డవీవు , ధవళకాంతుల అవధూతవీవు
జ్ఞానభాస్కర తేజుండవీవు, లోకరక్షక ధ్యేయుండవీవు
ఆనందమేనీవు ఐశ్వర్యమెనీవు, ఆర్తితోపిలువంగ అగుపింతువేనీవు
ఓందత్త శ్రీదత్త జైజైదత్త ! ఓందత్త శ్రీదత్త జైజైదత్త !!
శ్రీపాదశ్రీవల్ల భుండవీవు , శ్రీనృసింహ సారస్వతీవు
అకలకోట సామియేనీవు, గజాననా మారాజువీవు
తాజుద్దీను బాబానీవు , ధునీవాలా దాదానీవు
శ్రీషిర్డీసాయి బాబా నీవు, మాకై వెలసిన మారాజువీవు
ఓందత్త శ్రీదత్త జైజైదత్త ! ఓందత్త శ్రీదత్త జైజైదత్త !!
రూపాలకందని రూపుండవీవు , షోడశకళల తేజుండవీవు
తాపాల తరియించు తీర్థంబు నీవు , శాపాల తొలగించు శూలుండవీవు
గురుచరిత గానంబె భాగ్యాలవిందు , గురుపాదసేవయె సంపదల హరివిల్లు
ఓందత్త శ్రీదత్త జైజైదత్త ! ఓందత్త శ్రీదత్త జైజైదత్త !!
నినుజూడ నామ ధారకుండు తలువ , సిద్ధునిబంపి దీవించినావు
సిద్ధునిబంపి దీవించినీవు , నీదుచరితంబూనె వివరించినావు
బహుతీపి కథలెన్నొ నేర్పుతొ బలికి, గురులీల మహిమాల భువిలోన జూపావు
గురుసేవ కాశీలొ గురినిలిపి జేసి , త్రిమూర్తి దీవెనల దీపకుడు పొందాడు
ఓందత్త శ్రీదత్త జైజైదత్త ! ఓందత్త శ్రీదత్త జైజైదత్త !!
పాదాల నేత్రాల సోదరుల కల్పించి, పాదయాత్రలొ తీర్థాల కెడలావు
తీర్థాలలోకెల్ల తీర్ధుడవైనా , తీర్థయాత్రాలెన్నొ బహుజేసినావు
ఓందత్త శ్రీదత్త జైజైదత్త ! ఓందత్త శ్రీదత్త జైజైదత్త !!
బహుపుణ్య కలశంబు గోకర్ణమందు , గోసాయిగా నీవు వసియించినావు
గోకర్ణ మహిమ మదినెరుగ తరమే , కైలాసమే హర కైలాసమదియే
శాపాల తొలగించు శివక్షేత్రమదియే , పాపాల కరిగించు పావనంబదియే
నీదువాసంబుతొ మహిమాల యలరే , కల్పవృక్షమై కోర్కేల దీర్చె
ఓందత్త శ్రీదత్త జైజైదత్త ! ఓందత్త శ్రీదత్త జైజైదత్త !!
మందబుద్ధీని బృహస్పతిజేసి , అంబిక ఆర్తిని నీవృత్తి జేసావు
శత్రురాజులు దండెత్తివచ్చి , నీలీల గాంచియట మిత్రులయ్యారు
సేవలందీ చాకలివాని , మరుజన్మ రాజుగ దీవించినావు
ఓందత్త శ్రీదత్త జైజైదత్త ! ఓందత్త శ్రీదత్త జైజైదత్త !!
సూక్ష్మరూపంబున కురుపురమందున, భక్తుల భయముల దొలగింతువీవు
కురుపురంబున నినుజూడ వెడలిన , వల్లభేశుని రక్షించినావు
ప్రాణంబులొసగి కాపాడి నీవు , చోరుల తృటిలోనె హతమార్చినావు
ఓందత్త శ్రీదత్త జైజైదత్త ! ఓందత్త శ్రీదత్త జైజైదత్త !!
నరహరిగ బాల ప్రాయంబులోనె , బహులీలలెన్నొ యిలజూపినావు
పుట్టుకతోనె ప్రణవంబు బలికి , వేదాల నీవు వల్లించినావు
తొమ్మిది యేండ్ల వటునీగ నీవు , యిల్లు వదలి కాశి కరిగావు
ఓందత్త శ్రీదత్త జైజై దత్త ! ఓందత్త శ్రీదత్త జైజై దత్త !!
శ్రీనృసింహ సరస్వతిగ నీవు, గురుసేవనే గురిగజేసావు
తీర్థాలలోనే తీర్ధుడవైనా, తీర్థాల తరియింప యాత్ర జేసావు
పెక్కురూపులతోటి ఒక్కసమయంబందె, భక్తులిండ్లయందు విందారగించావు
ఓందత్త శ్రీదత్త జైజై దత్త ! ఓందత్త శ్రీదత్త జైజై దత్త !!
కడుపునొప్పి బాధ నోర్వలేక , మరణింప దలచిన వాని గాచావు
నరభక్షకుండు యవనుని నుండి, సాయందేవునికి సాయమైనావు
భవరోగంబులకు వైద్యుడ వీవె , వైద్యనాధంబున వసియించినావు
ఓందత్త శ్రీదత్త జైజై దత్త ! ఓందత్త శ్రీదత్త జైజై దత్త !!
చాంచల్యములేని చిత్తంబుతోడ , గురుసేవజేయ నీవు బలికావు
కల్పవృక్షమైన ఊదంబరా , ఛాయ మూలంబున నీవు నిలిచేవు
ఊదంబరా మహిమ చాటగ చాటగ , బాలుని నేర్పుతొ బ్రతికించినావు
ఓందత్త శ్రీదత్త జైజై దత్త ! ఓందత్త శ్రీదత్త జైజై దత్త !!
పేదవాని తమ్మతీ వే కింద , బంగారునాణాల బహుజూపినావు
నలుబదీ యోగినుల సేవ చూడంగ , నదీమధ్యంబు నీవు నందేవు
తీర్థాల సేవింప దలచీన శిష్యునికి , ప్రయాగ కాశి గయల జూపావు
ఓందత్త శ్రీదత్త జైజై దత్త ! ఓందత్త శ్రీదత్త జైజై దత్త !!
కరుణ సంద్రమె పొంగు సద్గురువు కరుణింప,క్షీరధారలు పొంగె గొడ్డుబర్రెకు వింత
బ్రహ్మాండమూ గాదె గురునిశక్తిజూడ , రాక్షసత్వము తొలగె ఆ గురువు వీక్షింప
ఓందత్త శ్రీదత్త జైజై దత్త ! ఓందత్త శ్రీదత్త జైజై దత్త !!
త్రివిక్రముడు నిను డాంబికునిగా దలువ , నృసింహ సామిగ కనువిప్పు జేసావు
వేదజ్ఞాన మెరుగ ఎంతవారికి దగును, కడజాతి వానీని జ్ఞానవంతుని జేసి
పంతాల పండితుల అహము దీసీ నీవు , గురుమహిమ శక్తీని యవనునికి జూపావు
ఓందత్త శ్రీదత్త జైజై దత్త ! ఓందత్త శ్రీదత్త జైజై దత్త !!
గురుసేవ యదియే ఇహపరంబుల దారి , గురుదూషణంబే మహపాపకారి
చండాలు డటులాయె గురుని దూషింప , గురుకృపతొ గలిగె జ్ఞానమతనికి చెంత
ఓందత్త శ్రీదత్త జైజై దత్త ! ఓందత్త శ్రీదత్త జైజై దత్త !!
శక్తి జూడగ తరమె వీభూతి యనుచు , వీభూతి వైభవము వివరించినావు
పరమశివుడా వీవె పతితపావనుడీవె , వీభూతి ధారణ అవధూత నీవే
ఓందత్త శ్రీదత్త జైజై దత్త! ఓందత్త శ్రీదత్త జైజై దత్త!!
అభయంబు నీదిల అద్భుతంబులు సేయ , భక్తురాలీ భర్త బ్రతికించినావు
భాగ్యంబు నీ సేవ భక్తులెల్లరకు , సౌభాగ్యంబె నీ పాద తీర్ధమెల్లరకు
ఓందత్త శ్రీదత్త జైజై దత్త! ఓందత్త శ్రీదత్త జైజై దత్త!!
సాక్షాత్తు నీవు రుద్రుండవూ గాదె , రుద్రాక్ష మహిమాల నీవు దెలిపావు
రుద్రమంత్రముతోడి అభిషేకములతోడి , రాజ మంత్రి సుతులు పూర్ణ ఆయుషు పొందె
సావిత్రి కరుణించి సోమవార వ్రతము , నియమంబుసేయ నీవు బలికావు
ఓందత్త శ్రీదత్త జైజై దత్త! ఓందత్త శ్రీదత్త జైజై దత్త!!
ఆదిభిక్షుడవీవె అంతరంగుడవీవె , భోజన నియమాల బహుబలికి నావు
దేవతలకర్పించి అతిధులకు సమకూర్చి, తాను భుజియింప చక్క బలికావు
సాక్షాత్తునీవు అన్నపూర్ణేశుడవు , నీదయతోడి పంచభష్యంబులు
ముగ్గురి భిక్ష సామాను తోటి , భాస్కరుడు వేల అతిధులకు వడ్డించె
గురుమహిమ నెంతయో కొనియాడి రెల్లరు, గురుకృపా తోటే సంపదలు కొల్లలు
ఓందత్త శ్రీదత్త జైజై దత్త! ఓందత్త శ్రీదత్త జైజై దత్త!!
అశ్వత్థ వృక్ష మహిమ తెలియగ తరమె , సాక్షాత్తు ప్రణవ నామంబు సమమదియె
ఆ కల్పవృక్ష ప్రాదక్షణా తోటి , వృద్ధురాలీని దయతోటి కరుణించి
గర్భంబు పండించి బిడ్డ లిరువుర నొసగి , గురుమహిమ లోకాన వెలుగంగ జేశావు
గురుకృపా గంగా పారంగ జూపావు , గురుమహిమ లోకాన పొగడంగ జేశావు
ఓందత్త శ్రీదత్త జైజై దత్త! ఓందత్త శ్రీదత్త జైజై దత్త!!
వ్యాధులు బాధాలు కర్మఫలంబులె , తప్పింపతరమే అనుభవింపా వలయు
కుష్టురోగి యతడు నరహరి శర్మ , నమ్మినిన్నూ జేర నారాయణుండనుచు
మేడి మోడు నిచ్చి దాని చివురించి ,వాని జీవన లతను వికసింపజేసి
కర్మధ్వంసిగ నీవు యిల వెలసినావు , కామధేనువుగ కరుణ జూపావు
నరహరి గురుస్థుతి తన్మయంబున జేసె , సాక్షాత్తు నిన్ను హరిహరుండగ దలచె
ఓందత్త శ్రీదత్త జైజై దత్త! ఓందత్త శ్రీదత్త జైజై దత్త!!
సాయందేవుడు గురుసేవజేయ,భార్య బిడ్డలా యిలు వదలి వచ్చాడు
మార్గమదియే కఠినంబనీ బలికి , శ్రద్ధ భక్తులూ గురుని నిలుపంబలికి
చిరుపరిక్షాతొ యాతనీ కరుణించి , నీసేవకుండుగ చక్క నియమించి
త్వష్ట కథనే వినిపించి నీవు , విశ్వనాథుని మహిమ నెరిగించి నావు
ఓందత్త శ్రీదత్త జైజై దత్త! ఓందత్త శ్రీదత్త జైజై దత్త!!
ఆదిదేవుడ వీవె ఆనంతుడా వీవె , వ్రతములన్నియు నీకు అభయంబులే మాకు
అనంత వ్రతము ఆచరింపగ బలికి , అష్టసంపదలూ అందింతువూ నీవు
అష్టసంపదలూ అందించి మాకు , కష్టంబులెల్ల హరియింతు వీవు
ఓందత్త శ్రీదత్త జైజై దత్త! ఓందత్త శ్రీదత్త జైజై దత్త!!
శ్రీశైల క్షేత్ర శీవున్డవీవె , హృదయక్షేత్ర యధిపతివి నీవే
తోటివారలు శ్రీశైల మెళుచూ, తమతోటి తంతుని యచటకు రమ్మన
గురుడవు శివుడవు సర్వమూ నీవనుచు , తంతుడు వారితొ వెడల కుండగ నుండ
దయతోటి వాని శ్రీశైల దరశనము , తృటిలోనె జేయించి మహిమ జూపావు
మల్లికార్జునిగా రూపు దాల్చావు , మహిమలా మారాజ రాజువే నీవు
ఓందత్త శ్రీదత్త జైజై దత్త! ఓందత్త శ్రీదత్త జైజై దత్త!!
తెల్ల కుష్టువ్యాధి నంది శర్మ,వ్యాకులుండై నిను వైద్యునిగ దలువ
షట్కులమందు తీర్థమొనరించి ,అశ్వత్థ వృక్ష ప్రదక్షిణ జేయించి
రోగమంతటను పారద్రోలావు , కవీశ్వరుండని బిరుదు నిచ్చావు
రోగాలు నీ చెంత దూరమాయేను , భారాలు తృటిలోనె కనుమరుగాయేను
ఓందత్త శ్రీదత్త జైజై దత్త! ఓందత్త శ్రీదత్త జైజై దత్త!!
సర్వదేవతా రూపుండవీవె , నరకేసరి కల్లేసుండ వీవె
ఏడుగ్రామాల పెద్దలు వేంచేసి , ధనత్రయోదశికి
కరుణింపుమని బలుక , అన్నిచోటుల ఏకసమయం బందు
దరశనంబిచ్చి , దయను జూపావు
నీవున్న గంధర్వ పురమందు యపుడే , నీదు భక్తులకు రూపు జూపావు
ఓందత్త శ్రీదత్త జైజై దత్త! ఓందత్త శ్రీదత్త జైజై దత్త!!
పర్వతేసుడు నిను పరమగురునిగ దలచి,పదిరెట్ల వ్యవసాయ ఫలము పొందాడు
భక్తులెల్లరకు అభయ ప్రదాతవు , అష్టతీర్థాలతొ కష్టాల దీర్చావు
యవనూనిబాధ నీదుమహిమన్ దొలగె, అద్వైతుడావీవె ఆదిగురుడావీవె
ఓందత్త శ్రీదత్త జైజై దత్త! ఓందత్త శ్రీదత్త జైజై దత్త!!
పురుషార్థములనగ నాలుగూ పుష్పాల , శిష్యులకు ప్రేమతో నీవు బంపావు
పరమశివుడావీవె పరమాత్మవూ నీవె , శ్రీశైలశివునిలొ ఐక్యమొందావు
ఓందత్త శ్రీదత్త జైజై దత్త! ఓందత్త శ్రీదత్త జైజై దత్త!!
సిద్ధుడట ఆసీసు సిద్ధినే పొందాడు , నీదుమహిమాల శ్రద్ధతో బలికాడు
గురుమహిమ నెరుగ పృధివశమె నెవరికి , పార్థగీతయెమాకు పరమార్థ చరితము
గురుచరిత శ్రద్ధతొ అనినను వినినను , చిత్తశుద్ధియె గలుగు,చైతన్యమే వెలుగు
సద్గురుని సత్కృప సత్వరంబే కలుగు, గురుసాయినాథులీ శ్యామునీ కరుణించు!
ఓందత్త శ్రీదత్త జైజై దత్త! ఓందత్త శ్రీదత్త జైజై దత్త!!
ఓం మంగళం గురుదేవాయ మహనీయ గుణాత్మనే ,
సర్వలోక శరణ్యాయ దత్తదేవాయ మంగళం !
శ్రీసాయి కరుణాకిరణాలు అందరిపై ప్రసరించుగాక !
శ్రీదత్తానుగ్రహము సర్వులకు లభించుగాక!
అందరికి శుభమగుగాక!
ఓంసాయి శ్రీసాయి జయజయ సాయి!
శ్రీగురుచరిత్ర పరాయణచే అందరు శ్రీగురుని అనుగ్రహమును పొందెదరు గాక!
ReplyDeleteశ్రీగురుచరిత్ర చదువుచూ, వీనులవిందైన గురుపాద స్తోత్రం వినగలరు.
ReplyDelete