సాయి నాట్యం
శ్రీసాయినాథాయనమః
సాయిబాబా షిరిడీ జేరిన మొదటిరోజులలొ హిందూ ముస్లింలు కూర్చునే ద్వారకామాయి సమీపములోని తాకియాలో కాలికి గజ్జెలుకట్టి , ఎంతో పారవశ్యంతో నాట్యం చేసేవారు. ఆ నాట్యం కైలాసవాసి శివుని , బృందావనంలోని చిన్నికృష్ణుని గోపికా నృత్యాల తలపించేది. అపుడపుడూ రావయా రావయా, రామయా రావయా , విభూతి సంచులు తేవయా అంటూ రాగతాళాలకనుగుణంగా నాట్యం చేస్తూ మధురంగా పాడుచుండేవారు. సచిదానందరూపులు సాయిబాబా కాబట్టి ఎంతో ఆనందమయ వాతావరణం నెలకొనియుండేది. అందరు సుఖశాంతులతో ఆనందమయ జీవనం గడపాలనేదే బాబా ఆశయం. ఆరోజులు స్మరించి సాయిపథంలో అందరం ఆహ్లాదమయ జీవితం గడుపుటకు ప్రయత్నిద్దాం!
సాయి నాట్యం
ఘల్లు ఘల్లు ఘల్లు ఘల్లు సాయినాథుడు
గజ్జె కట్టి నాట్యమాడె సాయినాథుడుతాకిధీమ్ తాకిధీమ్ సాయినాథుడు
తాకియాలో నాట్యమాడె సాయినాథుడు
రామ రామ రామ యనుచు సాయినాథుడు
నాట్యశివుని బోలినాడు సాయినాథుడు
కృష్ణ కృష్ణ కృష్ణ యనుచు సాయినాథుడు
తాళ గతుల నృత్యమాడె సాయినాథుడు ||ఘల్లు ఘల్లు||
భక్తిమీర నాట్యమాడే సాయినాథుడు
రాధె రాధె రాధె వోలె సాయినాథుడు
రాసలీల సిందువేసె సాయినాథుడు ||ఘల్లు ఘల్లు||
చావడీ సంబరాన సాయినాధుడు
చూడ పాండు రంగడే సాయినాథుడు
మేళతాళ రాగాల సాయినాథుడు
మిళితమై నర్తించె సాయినాథుడు ||ఘల్లు ఘల్లు||
Bliss ( Sachidananda ) is Saibaba's nature.
ReplyDelete