సాయితో చల్లని మాగృహము

శ్రీసాయినాథాయనమః 


ఆనందమె మాగృహము!

అందమె మాగృహము ఆనందమె మాగృహము
బృందావన గోవిందుని సాయి మందిరమీగృహము
బహు సుందరమీగృహము ........

నందన వనము పావనస్థలము మాగృహ ప్రాంగణము
లక్ష్మికటాక్షము వాణినివాసము సాయితో మాగృహము                         ||అందమె మాగృహము||

అన్నము వస్త్రము భోగము భాగ్యము నిండిన మాగృహము
అతిధుల సందడి బాలల అల్లరి పండిన మాగృహము                             ||అందమె మాగృహము|| 

రాగము తాళము సాయిపైభావము మంగళమీగృహము
పూజల పూవుల పరిమళముల మైమరపుల మాగృహము                    ||అందమె మాగృహము||   

నామము ధ్యానము సాయితొ బంధము పెంపొందిన మాగృహము
అర్చన ఆరతి నాలుగు వేళల వెలుగులమాగృహము                              ||అందమె మాగృహము||

ఘుమఘుమ వాసన పాయసములతొ పొంగిన మాగృహము
సద్గురుసాయి సత్సంగులతొ సంబరమీగృహము                                    ||అందమె మాగృహము|| 


శ్రీసాయి కరుణా కిరణాలు అందరిపై ప్రసరించుగాక !
అందరికి శుభమగుగాక!
ఓంసాయి శ్రీసాయి  జయజయసాయి!



Comments

Post a Comment

Popular posts from this blog

శ్రీ సాయి అష్టకము (Sri Sai Ashtakam with English translation )

సాయి మంగళం! ( ఆరతి సాయిబాబా!)

Commonality in the messages of Jesus Christ and Shirdi Sai Baba!