సాయి ఖండాంతర లీల!
శ్రీసాయినాథాయనమః
హ్యూస్టన్ మందిరంలోని సాయిబాబా విగ్రహము
Here is a global miracle where Saibaba connected Houston TX (USA), Bangalore India, and Shirdi.
శ్రీసాయిబాబా విశ్వవ్యాపకులు. వారిది అఖండస్వరూపము, వారిలీలలు ఖండాంతరములు. భక్తరక్షణ కొరకు సప్తసముద్రముల దాటెదనని సాయే సెలవిచ్చారు. ఇదేవిషయం శ్రీసాయిసత్చరిత్రలొ పెక్కుచోట్ల నొక్కి వక్కాణింపబడినది. అలాగే సాయి సర్వాంతర్యామి, సర్వ హృదయవాసి. అందరి మనసులలోని ఆలోచనలు కోరికలు ఆయనకు తెలుసు. వివిధభక్తులను భిన్నరీతుల చైతన్యపరిచి సాయి తమ కార్యముల నిర్వహించెదరు. అందులకు పెక్కు నిదర్శనలు గలవు. శ్రీమన్ గోపాలరావు బూటీని ప్రేరేపించి సమాధిమందిర నిర్మాణం గావించారు, దాసగణునితో తమ మహిమ వ్యాపింపజేశారు, నానాసాహెబ్ చాందోర్కర్ ద్వారా తమ ఖ్యాతి లోకానికి తెలియబరచారు. రాధాకృష్ణ మాయి నిమిత్తముగ శ్రీసాయి సంస్థానమునకు పునాది వేశారు. ప్రస్తుతవిషయానికొస్తే సాయి తమ చాతుర్యంతో ఖండాంతర లీల నెలా చూపారో అందరిని ఆశ్చర్య పరుస్తుంది.
ఈ విషయం 2002 వ సంవత్సరంలో జరిగినది. హ్యూస్టన్ నగరంలోని హిల్ క్రాఫ్ట్ రోడ్డు పై సాయిబాబా దేవాలయముంది, ఇప్పటికి కొనసాగుతుంది. అపుడు దేవాలయ వెబ్ సైట్ నిర్మిస్తున్నారు. ఆ సైట్ లో షిరిడీలోని బాబా సమాధి మందిరంతోపాటు వివిధ ముఖ్యమైన ప్రదేశాల ఫోటోలు ఉంచాలని సంకల్పం. అదేసమయంలో ఓ స్నేహితుడు, బాబా భక్తుడు, మందిర కార్యకర్త బెంగళూరు వెళ్లడం జరిగింది. షిరిడీకూడ వెళ్లడం ఆతని ప్రోగ్రాంలో ఉంది. అపుడు ఈ విషయం ప్రస్తావిస్తూ అతనికి హ్యూస్టన్ నుండి ఓ ఇమెయిల్ పంపాను. షిరిడీ వెళ్ళినపుడు బాబా దర్శనానంతరం, బాబాకు సంబంధించిన ముఖ్య ప్రదేశాలకెళ్లి వాటి ఫోటోలను వెబ్ కొరకు తీయమని. ఆ మెయిల్ అందిన పిమ్మట ఆతడోరోజు ఓ పుస్తకాల షాపుకి వెళ్లడం జరిగింది. ఎదురుగా "షిరిడీదర్శనం" అనే పుస్తకం కంటబడింది. తనకు ఉపయోగంగా ఉంటుందని వెంటనే ఆ పుస్తకం కొని, ఆ తర్వాత తన కుటుంబంతో షిరిడీ వెళ్ళారు ప్రయాణం సుఖంగా జరిగింది. వారందరు తమ సేద దీర్చుకొని బాబా సమాధిమందిరానికి ఆరతి కెళ్లారు. ఆరతి పిమ్మట షిరిడీలోని వివిధ ప్రదేశాలు చూడాలని ఆలోచన. ఆరతి సమాప్త మైనది. వెలుపలికి వెళ్ళుటకు వారంతా వెను దిరిగారు.

వారికోపెద్దాయన కనిపించారు. రండి రండి వెళదామంటూ వారిని సంభోదించాడు. ఎక్కడికని ఆయన నడగాలని వీరి కనిపించలేదు. వారెక్కడకు వెళ్లాలనే తమ ఆలోచనా ఆయనకు చెప్ప లేదు. అలా ఆయన ముందు, వీరు వెనుక షిరిడీ లోని అన్నిప్రదేశాలకు వెళ్లారు. ఆ ప్రదేశాల వివరాలు పెద్దాయన చాల ఓపిగ్గా వివరించి చెప్పాడు. తన దగ్గరి కెమెరాతో మిత్రుడు ఆయాప్రదేశాల ఫోటోలు చక్కగా తీసాడు. ఇదంతా పూర్తవడానికి షుమారు ఓ గంట పైనే సమయం పట్టింది. తమ వెంట వచ్చింది షిరిడీలోని టూరిస్ట్ గైడ్ అని తలచి ధన్యవాదాలు చెప్పి కొంత డబ్బులివ్వటానికి ఆతనికై వెనక్కు తిరిగాడు. కాని ఆశ్చర్యకరంగా ఆ పెద్దాయన కనిపించలేదు. ఆ వెంటవచ్చింది సాయి కాదుగదా అనే పెద్ద అనుమానమొచ్చి ఆ ప్రదేశమంతా ఎంతోసేపు వెదికాడు. కాని ఏమాత్రం మనిషి ఆచూకీ తెలియలేదు.
ఆ పెద్దాయన టూరిస్ట్ గైడ్ ఐతేనేగదా కనిపించడానికి. ఇలా బాబా ఎన్నో సందర్భాలలో ఏదో రూపంలో దర్శన మిచ్చినా, అనుభవమిచ్చినా, వారిని గుర్తించే అవకాశం మాత్రం ఆ సమయానికివ్వరు. ఆలస్యంగా ఆ విషయం బోధపడుతుంది. మితృనికి మంచి ఫోటోలు తీశాననే పెద్ద తృప్తి కలిగినా, బాబాను గుర్తించలేకపోయాననే చింత ఎక్కువయినది. ఆపై ఫోటోలను వెబ్ సైటులో ఉంచారు. మరో ముఖ్య విషయం ఈ ఘటన జరిగిన అతికొంత కాలానికే షిరిడీ మందిర పరిసరాలలొ ఫోటోగ్రఫీ నిషేదించారు.సాయిబాబా విశ్వవ్యాపకులు
విశ్వాత్మరూపా… ఓ సాయిబాబా…
నిలీలవర్ణింప నేనెంత
దేవా
ఏడేడు సంద్రాలు నిండినావయ్య
నేనేల నిలుగొలతు ఓ
చిన్ననావ
లోకాలు
లోకాలు నీవె నీవయ్యా
ఏపాటి నినుజూతు కనులు రెండయ్యా |విశ్వాత్మరూపా|
హస్తాలు
శతకోటి నీకె నీకయ్యా
ఈరిక్త
హస్తాల సేవ ఎటులయ్యా
రూపాల బహుమేటి బాబ నీవయ్యా
ఎవ్వనిగ
నినుజూతు బాలుండనయ్యా |విశ్వాత్మరూపా|
భానుండ
చంద్రుండ నీవెనీవయ్యా
బలహీన మో నూలు
పోగు నేనయ్యా
కాలత్రయంబందు
కదిలేటి దేవా
అల్పప్రాణంబుల
నీకెటుల సేవా |విశ్వాత్మరూపా|
నీనోట గోళాలె పరిడిల్లునయ్యా
జీవజననా
లయలె నీ ఉదరమయ్యా
దుష్ట పాపుల గాల్చు నీతేజమయ్యా
శిష్ట దాసులగాతు నీవెనీవయ్యా |విశ్వాత్మరూపా|
( If you like please share with your friends and Sai devotees. )
Sai Baba is omnipotent and omnipresent!
ReplyDelete