సాయిరామ్! సాయిశ్యామ్!
శ్రీసాయినాథాయనమః
శ్రీసాయి శక్తిలో శ్రీరామచంద్రులు , లీలల గోపాల కృష్ణులు. మహిమల మారాజులొ శ్రీరామ, శ్రీకృష్ణులు నిక్షిప్తమైనారు. సాయికి పెట్టిన దణ్ణం ఇద్దరు అవతారపుషులకు ప్రణామం!
దండాలు దండాలు బాబా!
ఏపాత్రలోనింప ఆరూపు ధరియింతు
గంగోదకమె
నీవు దేవా ...
ఈధాత్రిలోనె
సౌగంధమెదజల్లు
పారిజాతంబీవు
బాబా...
దేవపారిజాతంబీవు
బాబా ....
ఏరూపు నినుదలచి
సేవింపువారలకు
ఆ రూపమైనావు దేవా...
అపురూపమైనట్టి
ఆ రూపులా జూపి
ఆప్తుండవైనావు
బాబా...
మాకు ఆప్తుండవైనావు బాబా || ఏపాత్రలోనింప ||
శ్రీరాముడంచు భావింపు వారలకు
కోదండరాముడవె
దేవా ...
కైదండమూ
మోడ్చి ధ్యానించు వారలకు
కొండంత
అండీవు బాబా...
కొండకొండంత
దొరవీవు బాబా || ఏపాత్రలోనింప ||
శ్యాముండ
వీవనుచు ద్వారంబుజేరిన
వారలకు
ద్వారంబె బాబా
ఆ ద్వారకానగరంబె దేవా...,
ఓ కాలు అందుంచ పాపాలనే
బాపి
లోపాల దొలగింతు బాబా ,
మా శాపాల దొలగింతు బాబా || ఏపాత్రలోనింప ||
నాలుగు
ఆరతులు నమ్మికతొ
జేయుచు
శరణు శరణంటీర దేవా...
సాయి సాయంటు మననంబు సేయుచు
మసలుతున్నార బాబా
..
నీకె మరిమరీ దండాలు బాబా || ఏపాత్రలోనింప ||
శ్రీసాయి కరుణా కిరణాలు అందరిపై ప్రసరించుగాక!
అందరికి శుభమగుగాక!
ఓంసాయి శ్రీసాయి జయజయ సాయి!
ఓంసాయి శ్రీసాయి జయజయ సాయి!
సాయికి పెట్టిన దణ్ణం సర్వదేవతలకు ప్రణామం!
ReplyDelete