దయా సాగర సాయి

శ్రీసాయినాథాయనమః 

దయా  సాగర  సాయి


సాగరసాయి నీతీరంలో నేనొక సైకత రేణువునయ్యా 
పొంగుచు పొరలుచు కెరటంలా ..
నీవే నాలో నిండుము సాయి
సాగర సాయి , దయా సాగర సాయి ...

మేరువు నీవుగ,  రాముడ వీవుగ  పాదపు  ధూళిగ    మారితి నయ్యా
పండరి వాసుడ,  రంగడ వీవుగ  ఆర్తితొ  సక్కుగ  వేడితి   నయ్యా
పొంగుచు పొరలుచు కెరటంలా .. నీవే నాలో నిండుము సాయి
సాగర సాయి , దయా సాగర సాయి... 

రాగము నింపెడు శ్యాముడ వీవని నీదరి మురళిగ ఒదిగితినయ్యా
అను, రాగము  నింపెడు  స్వామియె నీవని విరహపు రాధగ  సొలసితి నయ్యా
పొంగుచు పొరలుచు కెరటంలా  నీవే నాలో నిండుము సాయి 
సాగర సాయి , దయా సాగర సాయి ...

ప్రేరణ : షిర్డి
 అభిషేకవేళ  29-11-1996

శ్రీసాయి కరుణాకిరణాలు అందరిపై ప్రసరించుగాక!
అందరికి శుభమగుగాక!
ఓంసాయి శ్రీసాయి జయజయ సాయి!






Comments

Post a Comment

Popular posts from this blog

శ్రీ సాయి అష్టకము (Sri Sai Ashtakam with English translation )

సాయి మంగళం! ( ఆరతి సాయిబాబా!)

Commonality in the messages of Jesus Christ and Shirdi Sai Baba!